నరక ద్వారం
నిన్నో బాలిక ఈ రోజింకో బాలుడు! (http://www.eenadu.net/story.asp?qry1=15reccount=30)
హతవిధీ ఇంకెంతమంది పిల్లలు ఛస్తే ఈ ప్రజలు మేలుకుంటారో! మన ముఖ్యమంత్రి ఇప్పుడు మేలుకున్నారు. కానీ ప్రతిదీ ప్రభుత్వం పట్టించు కోవలిసిందేనా? ఇంకెన్ని వార్తలు చూడాలి? ఇంకెంతమందిని నిర్లక్షంగా వదిలేసిన గుంతలకు బలిచ్చుకోవాలి? ఇన్ని వార్తలు చూస్తున్నా కనీసం పిల్లలున్న తల్లిదండ్రులైనా ఆ వూరిలో వున్న గుంతలను పూడిస్తే ఇంత అనర్థం జరగదు కదా! ఇంత కడుపు కోత, శోకం వుండదు కదా!
ఓ ప్రాణం రూపుదిద్దుకోవాలంటే ఓ తల్లి పడే కష్టం ఎంత? తొమ్మిది నెలలూ రోజొక యుగంగా ఎదురు చూసి చూసి, ప్రతి క్షణమూ తన ప్రాణంలో ప్రాణంగా, తన పొట్టలో తన వాడుగా పెరిగే పసికందుపై ఎన్ని ఆశల పందిళ్ళు అల్లుకుంటుంది తల్లి! ఆ తర్వాత ఎన్ని మురిపాలు, ఎన్ని జోలపాటలు!
అన్నీ ఓ చిన్న తప్పిదంతో, కనురెప్పపాటులో జరిగే ప్రమాదంతో అంతరించడానికేనా? ఏమవుతాయి తల్లిదండ్రుల ఆశల, అనురాగాల దీపాలు?
చేతులు కాలాక ఆకులు పట్టుకోకుంటే ఆ గోతులు పూడ్చడం అంత కష్టమైన పనా? పసిపిల్లల ప్రాణాలకు మించిన పనా?
ఇంతకుముందిలాగే వరస మృతులతో తల్లడిల్లినపుడు రాసిన బ్లాగు
http://www.charasala.com/blog/?p=55
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: April 25, 2007 సమయము: 10:26 am
అవును. మనిషి జీవితానికి మన సమాజంలో విలువ లేదు. ఆ ధోరణి మారాలి ముందు.
రెండోది – ప్రభుత్వాన్ని ఎప్పుడూ మన నించి వేరుగా చూడ్డం. మనమూ ప్రభుత్వంలో ఒకభాగమనే భావన ప్రజలకూ ఉండదు, ప్రభుత్వానికి అసలే ఉండదు.
తేది: April 25, 2007 సమయము: 2:04 pm
గత మూడు,నాలుగేళ్ళుగా పసిపిల్లల మరణాలు ఎక్కువయ్యాయా లేక ఇప్పుడు అలాంటి వార్తలు ఎక్కువగా బయటకి వస్తున్నాయా?ఇలాంటి గుంతలను తల్లిదండ్రులు పూడిచినా ఏ మున్సిపాలిటీవాల్లో,టెలీఫోను లైనులకనో,ఇంకోటనో ఏదోరకం గా మళ్ళా గుంటలు ప్రత్యక్షం.మా ఊరికి ప్రతీ రెండేళ్ళకీ రోడ్లు వేసేవారు.వేసిన 3 నెలలకే ఏదోక పేరు చెప్పి గోతులూ తీసేవారు.ఇలాగే వుంటాయి పరిస్తితులు.