సంజయ మేనియా

తేది: April 12, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 1,952 views

ఈ 17 ఏళ్ళ భారతీయ సంతతి కుర్రాడు అమెరికన్ ఐడల్ పోటీలో తారాజువ్వలా దూసుకుపోతున్నాడు. నిన్న జరిగిన పోటీలో చివరి 7 మందిలో స్థానం పదిలం చేసుకున్నాడు. అమెరికాలో ఇండియన్ ముఖం చూస్తే ఇప్పుడు సంజయ గుర్తొస్తున్నాడు చాలామందికి. సంజయ తండ్రి భారతీయ సంగీత కళాకారుడు. ఈ విధంగా సంగీతం ఇతనికి ఉగ్గుపాలతోనే అబ్బింది. మొదట సంజయతో పాటు ఇతని అక్క శ్యామలి కూడా ఈ పోటీల్లో పాల్గొన్నా తర్వాతి రౌండ్లలో ఆమె ముందుకు పోలేదు.
సంజయ్ నవ్వు పెద్ద ఆకర్షణ అని కొందరంటే అతని జుట్టు కొందరికి ఆకర్షణ. ప్రతి పోటీకి అతను ఎన్నుకునే వేషధారణ, జుట్టు శైలి అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈక్కడ వున్న ఒక విడియోలో చూడండి, ఒక అమ్మాయి ఆనందంతో ఎంతలా ఏడ్చేస్తుందో! గతంలో ఒకసారి ఈనాడులో సంజయ గురించి వచ్చిన దగ్గరినుంచీ ఈ పోటీ మీద నాకు కొంచం అభిరుచి కలిగింది. అయినా ఇప్పటివరకు ఒక్క షో కూడా చూడలేకపోయాను. అయితే ఏం థ్యాంక్స్ టు యూట్యూబ్. మామూలుగా అయితే నాకు ఏ ఇంగ్లీషు పాటా అర్థమవ్వదు. కానీ ఈ సంజయ పాడిన ప్రతిపాటా నాకు అర్థమవుతోంది అంతో ఇంతో.
సంజయకి అభిమానులున్నట్లే అసుయాపరులు, అతని విజయాన్ని జీర్ణించుకోలేనివారూ వున్నారు. అతని విజయానికి కారణం భారతీయుల వోట్లే అని నమ్మేవారూ వున్నారు. (నాకు తెలిసి భారతీయులు ఇంటర్‌నెట్ మీద ఓట్లేయమంటే వేస్తారుగానీ సులభంగా ఫోన్లు చేసి ఓట్లేస్తున్నారంటే నమ్మలేను).
మీరు ఈ వీడియోలు చూసి చెప్పండి అతని ప్రతిభ ఎలా వుంది అనేది.

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

సంజయ గెలవాలని ఈమె ఉపవాసవ్రతం చూడండి. 

YouTube Preview Image

 

సంజయను ఎగతాళి చేస్తూ… 

YouTube Preview Image

 

హొవార్డ్ స్టెర్న్ సంజయకు ఓటేయమని ప్రోత్సహిస్తున్నడంటూ అతనిమీద సివిల్ దావా వేస్తానంటున్న లాయరు..

YouTube Preview Image

ఇంకా ఎన్నో సంజయకు అనుకూలంగా, ప్రోత్సహిస్తూ, ఆరాధిస్తూ…వ్యతిరేకంగా, ఎగతాళి చేస్తూ, ద్వేషిస్తూ… ఎలాగైనా ఇప్పటి అమెరికా సెన్సేషన్ …సంజయ మాలేకర్.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'సంజయ మేనియా' పై 2 అభిప్రాయాలు

'సంజయ మేనియా'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. నాగరాజా అభిప్రాయం,

    తేది: April 14, 2007 సమయము: 6:16 am

    కృతజ్ఞతలు.

  2. శ్రీ అభిప్రాయం,

    తేది: April 20, 2007 సమయము: 11:24 am

    ఎవరేమన్న తిరుగులేకుండా చాలా రొజులే నిలదొక్కుకున్నాడు సంజయ. ఈసారి చాలా సంజయలు దిగుతారు అమెరికన్ ఐడల్లొ!

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో