- అంతరంగం - http://www.charasala.com/blog -

ఇది మన జాతి లక్షణమా?

Posted By చరసాల On March 27, 2007 @ 10:46 am In నా ఏడుపు | 13 Comments

గత వారాంతం ఇక్కడి శివ-విష్ణు దేవాలయానికి వెళ్ళాను. చెప్పులు విడిచే ప్రదేశంలో అవి సర్దడానికి కావలిసినంత ఖాళీ జాగా వుంది. అయినా ఎక్కడ విడిచినవి అక్కడే వదిలేసి దేవుడి సమక్షంలో ముక్తిని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు.

వికలాంగులకు కేటాయించిన పార్కింగులో సాధారణ వాహనాలు ఆపడం కూడా చూశాను. అదే ఇలాంటి అతిక్రమణ ఇంకో చోట చెయ్యరు. మన భారతీయులే అత్యంత బుద్దిమంతులమన్నట్లు ప్రవర్తిస్తారు.
ఇక భోజన శాల లో చూడండి. తిన్న ప్రతి చోటా మురికి చేస్తారు. ఇది మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటం అన్న ధోరణి కనిపిస్తుంది.
ఇంకా పని చేసే చోట్ల చూడండి. ఎక్కువ మంది భారతీయులు వున్నారంటే ఇక అక్కడి మైక్రోవేవ్ ప్రతి గోడా కూరలు చిమ్మి వుంటాయి. దాన్ని శుబ్రం చేయాలన్న తలంపే వుండదు.
ఇక ఏ ఇండియన్ గ్రోసరీ కన్నా వెళ్ళండి. సాధారంగా రెస్ట్‌రూమ్ వుండదు. వుండిందా ఇక అది వుపయోగించ వీలులేనంతగా దుర్గంధభూయిష్టంగా వుంటుంది. మొన్ననే ఇక్కడ పేరు మోసిన పటేల్ బ్రదర్స్‌కి వెళ్ళాను. కొనడానికి ఎప్పుడూ లైనులో నిలబడి వుంటారు. బాగా జరుగుతుందని ఆ లైను చూస్తే చెప్పొచ్చు. కానీ రెస్ట్‌రూమ్ మాత్రం భయంకరంగా వుంది. నేనయితే వెనక్కి వచ్చేవాన్నే! నా నాలుగేళ్ళ కూతురుకు అవసరమయింది. వాడక తప్పదు… చక చకా ఓ క్లోరాక్స్ కొనుక్కొచ్చి శుభ్రం చేద్దామా అన్నంద ఆవేశం వచ్చింది.
మనం చూపించేదంతా ఇతరులకోసమేనా? నిజంగా మనకి క్రమశిక్షణ, శుభ్రత లేవా? ఇది మన జాతి లక్షణమా?

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=159