ఇది మన జాతి లక్షణమా?

తేది: March 27, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 3,315 views

గత వారాంతం ఇక్కడి శివ-విష్ణు దేవాలయానికి వెళ్ళాను. చెప్పులు విడిచే ప్రదేశంలో అవి సర్దడానికి కావలిసినంత ఖాళీ జాగా వుంది. అయినా ఎక్కడ విడిచినవి అక్కడే వదిలేసి దేవుడి సమక్షంలో ముక్తిని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు.

వికలాంగులకు కేటాయించిన పార్కింగులో సాధారణ వాహనాలు ఆపడం కూడా చూశాను. అదే ఇలాంటి అతిక్రమణ ఇంకో చోట చెయ్యరు. మన భారతీయులే అత్యంత బుద్దిమంతులమన్నట్లు ప్రవర్తిస్తారు.
ఇక భోజన శాల లో చూడండి. తిన్న ప్రతి చోటా మురికి చేస్తారు. ఇది మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటం అన్న ధోరణి కనిపిస్తుంది.
ఇంకా పని చేసే చోట్ల చూడండి. ఎక్కువ మంది భారతీయులు వున్నారంటే ఇక అక్కడి మైక్రోవేవ్ ప్రతి గోడా కూరలు చిమ్మి వుంటాయి. దాన్ని శుబ్రం చేయాలన్న తలంపే వుండదు.
ఇక ఏ ఇండియన్ గ్రోసరీ కన్నా వెళ్ళండి. సాధారంగా రెస్ట్‌రూమ్ వుండదు. వుండిందా ఇక అది వుపయోగించ వీలులేనంతగా దుర్గంధభూయిష్టంగా వుంటుంది. మొన్ననే ఇక్కడ పేరు మోసిన పటేల్ బ్రదర్స్‌కి వెళ్ళాను. కొనడానికి ఎప్పుడూ లైనులో నిలబడి వుంటారు. బాగా జరుగుతుందని ఆ లైను చూస్తే చెప్పొచ్చు. కానీ రెస్ట్‌రూమ్ మాత్రం భయంకరంగా వుంది. నేనయితే వెనక్కి వచ్చేవాన్నే! నా నాలుగేళ్ళ కూతురుకు అవసరమయింది. వాడక తప్పదు… చక చకా ఓ క్లోరాక్స్ కొనుక్కొచ్చి శుభ్రం చేద్దామా అన్నంద ఆవేశం వచ్చింది.
మనం చూపించేదంతా ఇతరులకోసమేనా? నిజంగా మనకి క్రమశిక్షణ, శుభ్రత లేవా? ఇది మన జాతి లక్షణమా?

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'ఇది మన జాతి లక్షణమా?' పై 13 అభిప్రాయాలు

'ఇది మన జాతి లక్షణమా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: March 27, 2007 సమయము: 11:56 am

  ఇంకా అనుమానమా?అది మన జాతి లక్షణమే.మీరు చెప్పిన ఆయా స్తలాలు మనకే ప్రత్యేకం.కాబట్టి మనదేశంలో వున్నట్టే భావించేస్తారు.అక్కడ వున్నట్తే అనుకుని స్వేచ్చాజీవితం దొరికినట్టుగా ఆనందపడిపోతారు.గుడిలో భోజన శాలలో స్వచ్చంద సేవకులని మన ఊరిలోని హొటల్ లో క్లీనర్లలాగా భావించడం నాకు బాగా బాధకలిగించిన విషయం.మెక్డోనాల్డ్స్ కి వెళ్ళినా తినడం అయిపోయాకా జాగ్రత్తగా టేబుల్ ని క్లీన్ చెసేవాళ్ళు గుడిలో మాత్రం స్వచ్చందసేవకులు చెయ్యక చస్తారా అన్నట్టు మెస్ చేసి వెళతారు.ఎదుటివాళ్ళు చూస్తున్నారంటేనే మనం మంచివాళ్ళం.లేకపోతే మన అంత ఎదవలు ఎక్కడా వుండరు.

 2. పవన్‌ అభిప్రాయం,

  తేది: March 27, 2007 సమయము: 1:42 pm

  ప్రసాద్ గారూ మీరు చెప్పిన దాదాపు అన్ని విషయాలు నేను గమనించాను. మీరు చెప్పినవి అనుమాన పడినవి అన్ని నిజాలే. ఇప్పటి వరకూ తెలుసుకోలేకపోయరంటేనే ఆశ్చర్యం వేస్తుంది. రాధిక గారు సరిగ్గా నేను చెప్పదలచుకున్న విషయాన్నే చెప్పారు.

  మీకు ఎప్పటినించో ఒక విషయం చెప్పాలనుకుంటూ మర్చిపోతున్నను. మీ బ్లాగులో కామెంట్ రాయలంటే మీరు జనుల సౌకర్యార్ధం అమర్చిన తెలుగు రేడియో బటన్ చాలా బాగుందండీ.

 3. సుధాకర్(శోధన) అభిప్రాయం,

  తేది: March 27, 2007 సమయము: 9:16 pm

  ఇంకా డౌటా? మేరా భారత మహాన్ అని చెప్పుకోవటమే మిగిలింది.

  దేశాన్ని సొంత బిడ్డలా చూసుకోవటం పాశ్చాత్యం అయితే…దేశానికి బరువు బిడ్డలుగా తయారవటం మన పని.

 4. రానారె అభిప్రాయం,

  తేది: March 27, 2007 సమయము: 11:02 pm

  మన కలాంగారు కూడా ఇదే చెప్పారొకసారి – ఇలా చేయొద్దని: విదేశాల్లో చాక్లెట్ ర్యాపర్లు కూడా చెత్తబుట్ట కనబడేవరకూ జేబులో పెట్టుకొనే మన జనం ముంబైలో విమానం దిగ్గానే ఎంగిళ్లుయ్యడానికి మూలకోసం చూస్తారు, ఇదేం ప్రారబ్థం ?

 5. chetana అభిప్రాయం,

  తేది: March 28, 2007 సమయము: 10:26 am

  ఉమ్మడి గొర్రె పుచ్చి చచ్చిందని, గుడి/దేశమ్/ఏదయినా “మన”ది, మనందరిదీ అనుకోవటం, ఎవడోకడు చేస్తాడులే అనుకోవటం మన జాతి లక్షణం.

 6. t.sujatha అభిప్రాయం,

  తేది: March 29, 2007 సమయము: 12:26 pm

  మన జాతికున్న అవలక్షణాలలో ఇది ఒకటండి.

 7. Ravikiran Timmireddy అభిప్రాయం,

  తేది: March 31, 2007 సమయము: 8:15 pm

  ప్రసాద్ గారు,

  పది మంది కలసిన ప్రతి చోటా, ఒకరిద్దరి ప్రవర్తన సరిగా లేకపోవడవనేది అసహజవేంకాదు, ఆ పదిమంది దేశీలైనా, అమెరికన్లయినా, లండనీయులైనా. ఎవరో కొందరి దేశీల ప్రవర్తననే మీరు జనరలైజ్ చేసి, దేశీలందరినీ విమర్శించడం నాకంత బాగనిపించలేదు. ఈ బ్లాగ్ లో దేశీల అభిప్రాయాలన్నీ చూస్తే, దేశీల్లో ఎంత దేశీ ఫోబియా వుందో విశిదమవుతుంది.

  రానారే గారు,

  కలాం గారు ఏం చెప్పేరో నాకు తెలియదు. కానీ వారు మీరు చెప్పిందే చెప్పున్నా అంత ఆశ్చర్యం లేదనుకోండి. భారద్దేశంలో నూటికి ఢేబ్బైమందికి చాక్లేట్ కొనుక్కునే అద్రుష్టం, అవకాశం కూడా లేని విషయం కలాం గారికి తెలియక పోవటంలో ఆశ్చర్యం ఏవీ లేదు.

  రవికిరణ్ తిమ్మిరెడ్డి

 8. charasala అభిప్రాయం,

  తేది: April 2, 2007 సమయము: 9:25 am

  రవికిరణ్ గారూ,
  నిజమే మీరన్నట్లు పదిమందిలో ఏ ఒకరిద్దరో ప్రవర్తన అసహజంగా వుండటం సహజమే! కానీ మన వాళ్ళలో ఈ పాలు కాస్తా ఎక్కువేమొ అనిపించింది. చర్చికో, షాపుకో వెళ్ళినపుడు ఇక్కడి వారి ప్రవర్తన అంత అసహజంగా వుండదు. అయినా మంది పెరిగినప్పుడు క్రమశిక్షణ తప్పి నడవడం ఇక్కడా చూశాను. కానీ ఇక్కడ దేవాలయాలకు వచ్చిన దేశీలలో అందరూ చదువుకున్నోళ్ళే, భిన్న సంస్కృతులు తెలిసినోళ్ళే. పోనీ మంది ఎక్కువయి ఇండియాలో చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆ బాధ లేదు. ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలడం, తిన్న చోటు శుబ్రం చేయక పోవడం, ఒక నాట్యమో మఋఒ సభో జరుగుతున్నప్పుడు సీట్లు వున్నా కూర్చోకుండా అందరికీ అడ్డుగా నిబడుతూ పోవడం… ఇలాంటివెన్నో గమనించాను.
  ఇవి అన్ని జాతులలోనూ వుంటాయి కాదనను..కానీ మన జాతిలో ఎక్కువా అని నా అనుమానం.

  –ప్రసాద్

 9. రానారె అభిప్రాయం,

  తేది: April 4, 2007 సమయము: 9:12 am

  రవికిరణ్‌గారూ, చాక్లెట్ కూడా కొనలేనంత దుర్భర స్థితిలో భారతదేశ జనాభాలో ఎంతశాతం ఉందో నాకు తెలీదు. చాక్లెట్ సంగతి వదిలేద్దాం. కలాంగారికి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదా? ఏఁ? కలాం గురించి ఎందుకుంది మీకీ అభిప్రాయం?

 10. Ravikiran Timmireddy అభిప్రాయం,

  తేది: April 4, 2007 సమయము: 3:43 pm

  రనారె గారు,

  కలాం గురించి నాకొక ప్రత్యేకవైన అభిప్రాయమేవి లేదు. జరుగు బాటున్న నాలాగా, మీరు మన్నిస్తే మీలాగా, ఇంకా చాలా మందిలాగే ఆయన కూడా, అవకాశం దొరికినప్పుడు, ఏఓ నాలుగు పదాలు పలుకుతారు. నిజవే, అవి అందరూ అనుసరించ తగినవే. జాతి మంచికోసం చెప్పినవే. కానీ దురద్రుష్టం ఏవిటంటే, మన రోజువారీ కష్ట సుఖాలకి, వాద ప్రతివాదాలకీ, మంచి చెడులకీ, జీవిత సత్యాలకీ అతీతంగా మరో జీవిత సత్యం, మరో జాతి భారద్దేశంలాంటి దేశాల్లో వుంది. ఆ సత్యం, కడుపుకి వొక పూట అన్నం కోసం పాకులాడే సత్యం, బిడ్డకి కడుపునిండా పాలు కాదండీ, నీళ్ళకోసం వెద్కులాడే నిక్రుష్టపు సత్యం. బావిలో వున్న నీళ్ళూ త్రాగి, అష్టవంకరలు తిరిగిన మనుషులున్న సత్యం. ఈ రెండు జీవిత సత్యాల్లో ఒక సత్యానికి మీరు, నేను, ప్రసాద్ గారు, కలాం గారు ప్రతినిధులు. మన గురించి మనం మాట్లాడుకుంటే చక్కగానే వుంటుంది. ఐతే సమస్య ఏంటంటే, ఆ రెండో జీవిత సత్యాన్ని గుర్తించకుండా, మన జీవితానుభవాలే అన్ని తరగతుల వారికీ పాఠాలుగా చెప్పబోవటం. కలాం గారు మనకి గొప్పవారే, కానీ వారి మాటలు, పాఠాలు కూడా మన తరగతి కే. కానీ కలాం గారికా బేధభావాలున్నట్టూ లేదు. అది దురభిప్రాయం కాదని మనవి. కాకపోతే తన, మన బేధం తెలిసిన అభిప్రాయం అంతే.

  ప్రసాదు గారు మన్నించాలి. ఈ నా గోఈకి మీ బ్లాగును యుసర్ప్ చేసినందుకు.

  రవికిరణ్ తిమ్మిరెడ్డి

 11. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: April 9, 2007 సమయము: 10:30 am

  రవికిరణ్ గారూ,
  నిజమే సమాజంలో ఎన్నో రకాల సత్యాలున్నాయి. అయితే మనం అన్ని సత్యాల గురించీ మాట్లాడాలి, ఏ ఒక్కదాని గురించో కాదు. చాక్లెట్ తినలేడివాడి చాక్లెట్ గురించీ మాట్లాడాలి చాక్లెట్ తినగలిగే వాడు ఎక్కడ దాని రేఫర్ పడేస్తున్నాడో మాట్లాడాలి. పూటకింత తిండి గతిలేనివాడి దగ్గర ఆర్గానిక్ ఫుడ్ గురించి మాట్లాడలేనట్లే శుబ్రత గురించీ మాట్లాడలేం. అయితే ఈ బ్లాగులో వ్రాసింది అమెరికాలో వున్న భారతీయుల గురించి ఇక్కడి సగటు జీవితాల కంటే భారతీయుల జీవితాలు బాగానే వున్నాయి. కానీ అలవాట్లలో మార్పు అందుకు అనుగుణంగా లేదు.

  –ప్రసాద్

 12. ravikiran timmireddy అభిప్రాయం,

  తేది: April 14, 2007 సమయము: 10:25 pm

  ప్రసాద్ గారు,

  నిజవే మనం అన్నీ సత్యాల గురించి మాట్లాడాలి,కానీ అన్నీ సత్యాలకీ వొకే పరిష్కారం సూచించడం మాత్రం మానుకోవాలి. మీరు దేశీల గురించి వెలిబుచ్చిన అభిప్రాయంతో నేను కొచెం విభేదించేనే కానీ మీరు మాట్లాడుతున్న వ్యక్తుల గురించి నాకు అవగాహన వుంది. మీరే తరగతి గురించి మాత్లాడుతున్నరో మీరు ప్రత్యేకంగా చెప్పక పోయినా, మీ అభిప్రాయంలో ఆ తరగతి స్పష్టంగా కనిపిస్తూనేవుంది. నేను “రానారే” గారికిచ్చిన జవాబులో కలాంగారి పట్ల నా అభిప్రాయాన్ని, కలాం గారు వెలిబుచ్చే అబిప్రాయాల్లో లోపించినటువంటి ఈ తరగతుల వ్యత్యాసాన్ని ఎత్తి చూపటవే నా ఉద్దశం. ఎందుకంటే మీలా, నాలా మన అభిప్రాయాలు వొక తరగతినుద్దేశించి కాక, కలాం గారి అబిప్రాయాలు, పరిష్కారాలూ యావత్ భారత జాతి నుద్దేశించి వుండటం వలన.

  అందుకని మీరన్నది నిజవే, జీవిత సత్యం వొక్కటిగా కాక పలు రకాలుగా వుంటుంది. ఐతే కలాం లాటి నాయకులూ, అంత పదవిలో వున్నటువంటి నాయకులూ, ఇంత చిన్న సత్యవైనటువంటి తరగతి వ్యత్యాసాన్ని ఎందుకు విస్మరిస్తారో కదా!

  పి. ఎస్.
  ______

  మీరు మీ గ్రామమంలో మీ దళిత అనుభవం గురించి వ్రాసిన బ్లాగులో, రాధిక మొదలైన వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలనే వొక ఉదాహరణగా తీస్కోండి. జీవన వాస్తవాల మద్య వ్యథ్యాసం ఎంత స్పుటంగా, ఎంత వ్యతిరేకంగా ఉందో మనకు తెలుస్తుంది. రాధిక మొదలైన వారి అనుభవాలు కూడా వాస్తవాలే. ప్రమిదలో వెలిగే దీపాన్ని నిజంగా మన చేతుల్తో తాకి ఆ భాదని అనుభవించడం వొక వాస్తవం. ఆ దీపాన్ని తాకినట్టు ఊహించుకోని కలిగిన భాదని అనుభవించడం కూడా వొక వాస్తవవే. ఐతే రెంటి మద్యా ఎంత వ్యత్యాసవొ గమనించండి. కలాం గారు గొప్ప శాస్త్రవేత్తలూ, స్వార్థం తెలియని నాయకులే ఐనా, ఈ చిన్న నీజాన్ని మర్చిపోయి, అరిగిపోయిన, మాసిపోయిన, విలువ కోల్పోయిన ఆ క్లిషేలనే ఎందుకు పలుకుతారో కదా!

  కాబట్టి ప్రసాద్ గారూ, రానారే గారికి నేనిచ్చిన జవాబు, కలాం గారి గురించి మాత్రవే.

  రవికిరణ్ తిమ్మిరెడ్డీ


 13. తేది: June 4, 2007 సమయము: 10:16 am

  [...] ఇది మన జాతి లక్షణమా? [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో