- అంతరంగం - http://www.charasala.com/blog -

జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్

Posted By చరసాల On March 23, 2007 @ 9:28 am In నా ఏడుపు | 3 Comments

జోకులు ఇతరులను పీడించి వేసుకొనేవిగా వుండకూడదు. మన నవ్వు ఇంకొకడికి విషాదమవ్వకూడదు.

మనం ఎవ్వరి మీదయినా జోకు వేసే ముందు ఆ స్థానంలో మనలను వూహించుకొని చూసుకోవాలి ముందు.
గత ఆదివారం జెమినిలో “జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్” చూశా! కళ్ళు చిదంబరం కనపడగానే “నువ్వు నన్ను చూస్తున్నావా? ఆమెని చూస్తున్నావా?” — ఇది జోకు నేను నవ్వాలి. ఇంత తలతిక్క ఎందుకుంటుందో జనాలకు అర్థం కాదు.
ఆ తర్వాత ఇద్దరు బధిరులు కలిస్తే ఎలా సంబాషణ వుంటుందో చూపడం! అదీ జోకే! వైకల్యం వాళ్ళకా వైకల్యం మీద జోకులేసుకొనే మనకా?
ఇంకా హైలెట్టు ఏమిటంటే గుడ్డివాడు ఒంటరిగా వున్నప్పుడు ఏమని ఆలోచిస్తాడు (లేదా ఏదో ఇలాంటిదే) అని చూపించడం జోకు!
గుడ్డివాడి వ్యధా, బాధా ఈ గాదిద కొడుకలకు జోకు! ఇంతకంటే జోకులెయ్యడం రాకుంటే మన తెలుగు బ్లాగరులను చూసి నేర్చుకోరాదూ!

నల్లగా వున్న బాబూమోహన్ మీద లెక్క లేనన్ని జోకులు. ఆతన్ని ఎంత నీచాతినీచంగా అసహ్యంచుకుంటే మనకు అంత తృప్తి, నవ్వు! కాకిలా వున్నావనడం, బర్రెలా కుడితి తాగుతున్నావనడం, కోటతో తన్నించడం.. ఇదీ మన తెలుగు సినిమా నవ్వులాట! బాబూమోహన్ అనాకారి తనం, కళ్ళ చిదంబరం కళ్ళూ, ఎవీయస్ నత్తీ మనకు నవ్వుకొనే విశయాలు.
–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=158