వనజ — అద్భుతమైన తెలుగు సినిమా
నేనింకా ఈ సినిమా చూడలేదు. చూడాలని వువ్విళ్ళూరుతున్నా! కిరణ్ గారి తెలుగుదనం బ్లాగులో మొదట దీని గురించి చదివి ఈ సినిమ సైటుకు వెళ్ళి వివరాలు చూశా!
Trailer చూస్తే ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమ అయ్యుంటుందనుకుంటున్నా! కానీ విచారకరమైన విశయం ఏంటంటే ఈ సినిమాను ఆంద్రదేశంలో ఆడించడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావట్లేదట!
చూశారా? మంచి సినిమాలు తీయరంటారు తీరా కనీసం స్వంత అభిరుచితో తీసిన ఇలాంటి ఆణిముత్యాలను ఎలా ఆదరిస్తున్నారో!
–ప్రసాద్
http://blog.charasala.com
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: March 21, 2007 సమయము: 12:39 pm
నేను కూడా ఈ సినెమా కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పటినించో…. ప్రసాద్ గారూ… మంచి సినెమాలు తీయరు అని కాదండీ… తీసేవారు అరుదు అలగే వాటిని ఆదరించే (చూసే)వారూ అరుదే.. అందుకే 2005 సం.లో పూర్తయిన ఈ సినెమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు…(అసలు ఎప్పుడు విడుదలౌతుందో చెప్పలేం). ఇక డీవీడీ కోసం ఎదురు చూడవలసిందేనేమో.
తేది: March 21, 2007 సమయము: 2:15 pm
అవునండీ ఇలాంటి సినిమాలని డివిడి లలో విడుదలచేయాలి.ఒక మోస్తరు కమర్షియల్ సినిమాలకే థియేటర్ లు దొరకట్లేదు[ఇవ్వట్లేదు].పెద్ద సినిమాలు మాత్రం 6,7 థియేటర్లలో విడుదల చేయిస్తారు.అసలే ఇప్పుడు థియేటర్ వాళ్ళకి లాభాల మాట అటుంచి మేంటెనెన్స్ కూడా దక్కట్లేదు.ఇలాంటి సినిమాలకి ఎలానూ జనాలు రారు .ఇక ఏ ఆశతో ప్రదర్సిస్తారు.[మాకు ఊరిలో ధియేటర్ వుంది అందుకే ఇలా చెప్పగలుగుతున్నాను.] ఇలాంటి కళాత్మక సినిమాలను డివిడీలలో చూసి ఆనందించగలిగే రస హ్రుదయం చాలామందికి వుంది.[నేనూ అంతే]
తేది: March 22, 2007 సమయము: 10:11 am
ధన్యవాదాలు…ప్రసాద్ గారు…నా blog పై మీ అభిప్రాయాలకు, మీ ఆధ్యాత్మికం విభాగం చాలా బాగుంది (నేను మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించక పోయినప్పటికి)
తేది: March 25, 2007 సమయము: 6:11 pm
మంచి సనిమాను పరిచయం చేసారు. ట్రెయిలర్‌ను బట్టి ఊహిస్తే, చాలా సహజత్వం కనిపిస్తుంది.
తేది: March 26, 2007 సమయము: 12:15 pm
చాలా మంచి సినిమాలా ఉంది. రాధిక గారు చెప్పినట్టు ఇటువంటివి డైరక్టుగా డి.వీ.డి లో విడుదల చేయాలి.
తేది: March 26, 2007 సమయము: 3:27 pm
అమెరికాలో ఈ సినెమా ఈ జూన్లో విడుదల చేస్తున్నారంట…. ఈనాడు పేపరులో చూశా.