- అంతరంగం - http://www.charasala.com/blog -

తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలు

Posted By చరసాల On March 21, 2007 @ 7:40 am In వర్తమానం | 1 Comment

ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమా, వ్యతిరేకమా అనిగాకుండా నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఈ అసమ్మతి ఎమ్మేల్యేలు చేస్తున్నది అక్షరాలా అక్రమం.
గులాబీ కండువా పైన వేసుకుంటారు. లోపల కాంగ్రెసు వాదిలా ప్రవర్తిస్తారు. కారు చిహ్నంతో గెలిచారు, కెసీయార్ నాయకత్వాన్ని నమ్ముకున్నారు, ఎన్నికల్లో మీరు తెరాసవాదులనే ప్రజలు గెలిపించారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక అటు ప్రజలనూ మోసం చేసి ఇటు కేసీయార్‌ను మోసం చేసి రాజశేఖరరెడ్డి వెనకాల తిరగడం ఏ విధంగా న్యాయం.
సరే మీకు కేసీయార్ నచ్చలేదు. ఆయనకంటే మీకే ప్రత్యేక తెలంగాణా మీద ప్రత్యేక అభిమానం వుంది. మరి ఇంకా ఆ గులాబీ కండువానే ఎందుకు? దానితో గెలిచిన ఎమ్మెల్యే గిరీ ఎందుకు? రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. ఒకరిమీద ఒకరు తొడలు చరుచుకున్నందుకే ప్రజలు ఎన్నికలు భరించారు. మీరు రాజీనామా చేస్తే మాత్రం భరించలేరా? ఇలా అటూ ఇటూ గాని మద్యెరకం గాళ్ళలా ఈ వేషాలెందుకు?

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=156