అన్నీ వేదాల్లో వున్నాయిష

తేది: March 16, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 4,386 views

మన సంస్కృతి గురించి, వేదాలు, ఉపనిషత్తుల గురించి చెప్పేవాళ్ళు అన్నీ పూర్వం మన ఋషులకే తెలుసనీ, వేదాలే అన్ని జ్ఞానాలకూ మూలమనీ వాదించేస్తారు.
వేదాలు లభ్యమవుతున్న అతిపురాతన సాహిత్యమని అందరు అంగీకరిస్తున్నదే. అలాగే మన ఋషుల తాత్విక చింతన అమోఘమైనదే అయితే ఇప్పటి శాస్త్ర విజ్ఞానమంతా నాడే ఋషులకంతా తెలుసనడం అతిశయోక్తే!
మొన్న ఈమాటలో అసంబద్ద భాషావాదాల గూర్చి సురేష్ కొలిచాల గారు చక్కటి వ్యాసం రాశారు. అలాగే వేదాలలో అన్నీ వున్నాయనే అసంబద్ద వాదనలు ఖండిస్తూ కూడా మంచి వ్యాసాలు వస్తే బాగుండును.
కొన్ని వాదనలు చూస్తే…
“రామాయణ కాలంలోనే విమానం నిర్మించడం, వాడటం తెలుసు.”
ఈనాడు  గ్రహాంతరయానాలు చేస్తున్నట్లు, మనిషి తయారు చేసిన రోబోట్లు మనిషినే నియంత్రిస్తున్నట్లు సినిమాలు వస్తున్నాయి అంత మాత్రాన మనమిప్పుడు గ్రయాంతరయానము చేస్తున్నట్లా? కాకపోతే అవి ఇంకొన్ని రోజులకు నిజాలు అవ్వచ్చు. ప్రకృతిని జయించాలన్న మానవుడి వాంఛ రకరకాల వూహలను ప్రేరేపించింది. ఆకాశయానం చేసినట్లు, జలస్తంబన విద్యతో నీటిలో రోజుల తరబడి వున్నట్లు కలగన్నారు. మహిమాన్విత శక్తులున్న దేవుడికి అన్నీ సాద్యమే గనుక తమ వూహలని దేవుడి పాత్ర రూపంలో తీర్చుకున్నారు. అంత మాత్రానికే అప్పట్లో పుష్పక విమాన ముండేదని ఈ 21వ శతాబ్దములో కూడా నమ్మేస్తే అంతకన్నా పిచ్చి ఇంకేమయినా వుందా? పోనీ రామాయణంలో విశయాలు నిజమే అనుకుంటే కోతులు రాజ్యాలు చేయడం, ఒక కోతి ఇటు నుంచీ అటు లంకకు గెంతడం కుడా ఆ రోజుల్లో సంభవాల కిందే లెక్కెయ్యాల్సి వస్తుంది.

“రామ సేతు”
లంకకూ మనకూ మద్య ఆరోజుల్లోనే వారధి కట్టారట! అదే నీళ్ళపై తేలే వారధి! దాని అవశేషమే ఇప్పుడు సముద్ర గర్భంలోని వారధి అంటారు.
మొన్నేదో ఓ పుస్తకంలో ఒక చైనా కథ గురించి చదివాను. ఆ కథ ప్రకారం పూర్వం 9 మంది సూర్యులు వుండేవారట! ఆ వేడికి ప్రతిదీ దగ్దమైపోతుండేదట! వేడిని భరించలేని ప్రజలు రాజును ఏదో ఒకటి చేయమని వేడుకుంటే ఆయన ఒక సాహసవంతున్ని పిలిచి సూర్యులనందరినీ కూల్చేయమన్నాడట! ఆ సాహస వీరుడు ఒక్కొక్కటే సూర్యున్ని కిందపడేస్తూ చివరి సూర్యున్ని వదిలేశాడట, అది లేకపోతే లోకం చీకటైపోతుందని.
ఇప్పుడు తొమ్మిదిమంది సూర్యులు లేనిది, ఒకడే సూర్యుడు వున్నదీ నిజమే కనుక ఈ కథ నిజమే అనుకోవాలా మనం?
మనకున్న ఎన్నో స్థల పురాణాలు ఇటువంటివే! కనిపించే ప్రతి వింతకూ ఒక పురాణాన్ని కనిపెట్టి సమాధాన పడ్డారు ప్రజలు.

“భారత కాలంలోనే test tube baby విధానం తెలుసు”
ఇది నవ్వులాటకు కూడా నమ్మలేని విశయం. ఆనాడే ఇంత విజ్ఞానం వుంటే విల్లులూ, బాణాలూ, గదలతో యుద్దం చేసుకోవలసిన ఖర్మం ఏమొచ్చింది వాళ్ళకి, శుబ్రంగా ఇప్పటిలా అణ్వాయుధాలతోనే చేసివుందురు. ఇంకా భారతంలో అక్షయ పాత్ర వుంది, ఎంత తోడినా ఇంకా పుట్టుకొని వస్తుందట అందులో. ఇది సాద్యమేనా? జరాసంధున్ని రెండుగా చీల్చినా మళ్ళీ అతుక్కుంటాడట! అవ్వ! ఎంత విజ్ఞానముడేది ఆ రోజుల్లో!

ఈ మద్యన ఏదో తెలుగు బ్లాగులో చూశాను “నాగలోకానికి అదేదో రెండు పర్వతాల మద్యనుండీ దారి వుందట!”. ఇలాంటి శుశ్క వాదాలను నమ్మేవాళ్ళు వున్నారంటే ఎంతో ఆశ్చర్యమేసింది. ఆ బ్లాగులో ఇప్పుడా పోస్టులు లేవు. నా చిన్నప్పుడు మా అవ్వ ఓ కథ చెప్పేది. అక్కడెక్కడో బావి తవ్వుతూ వుంటే, తవ్వగా తవ్వగా ఎంతో లోతుకు తవ్వాక వాళ్ళకు కోడికూతా, రోకటి పోటూ వినబడ్డాయట భూమి లోంచీ! అప్పుడు తవ్వడం ఆపేశారట! (నాగలోకానికి జడిసి ఆపేశారా? ఏమో నాకు తెలియదు.)
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'అన్నీ వేదాల్లో వున్నాయిష' పై 8 అభిప్రాయాలు

'అన్నీ వేదాల్లో వున్నాయిష'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Ambanath అభిప్రాయం,

  తేది: March 16, 2007 సమయము: 1:52 pm

  “పూర్వీకులకి ఏమీ తెలియదు. మనకే అంతా తెలుసు”అనేది గత 250 సంవత్సరాలుగా ప్రచారంలోకి వచ్చిన భావన. “పూర్వీకులకి మనలాంటి నాగరికత ఒకటి ఉండేది.అది ఏ కారణం చేతనో కాలక్రమాన మరుగున పడ్డాక మనం అంతా మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టుకుంటూ రావాల్సి వచ్చింది”అని నవీన కాలంలో చాలామంది పరిశోధకులకు కలుగుతున్న అభిప్రాయం.

  భరద్వాజ మహర్షి రాసిన వ్యోమయాన తంత్రమనే 19 అధ్యాయాల Aeronautical Engineering పుస్తకం ఈ మధ్యనే లండన్ మ్యూజియం వారి కబంధ హస్తాల్లోంచి బయటపడి ప్రచురించబడింది. అది 500 పుటల మహాగ్రంథం.దాని గురించి 1985 లోనే Illustrated Weekly of Indiaలో ఒక జర్నలిస్టు రాశారు. కాని ఆ పుస్తకాన్ని బయటపెట్టడానికి అప్పట్లో లండన్ మ్యూజియం వారు అంగీకరించలేదు.ఎవరో ఇంగ్లీషు ఆఫీసరు ద్వారా దాని తాళపత్ర ప్రతి ఇండియా నుంచి 18వ శతాబ్దంలో ఇంగ్లండుకి చేరుకుందని తెలుస్తోంది.ఇప్పుడు ఆ పుస్తకం తెలుగులోనికి అనువదించబడింది.విజయవాడలో దొరుకుతోంది.

  నా దగ్గర Dr.RVSS అవధానులుగారు రాసిన Science and Technology in Vedas and Sastras అనే మహాగ్రంథం యొక్క మొదటి సంపుటం కూడా ఉంది.శ్రీ అవధానులుగారు హైదరాబాదులోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు.

  ఈ రెండు పుస్తకాల్లోని విషయం గురించి ఎప్పుడైనా నా బ్లాగులో విపులంగా రాస్తాను.

  అలాగే ధర్మరాజు కట్టించిన మయసభలో విద్యుద్దీపాలు వాడినట్లు తెలియవస్తోంది.పిరమిడ్స్ కట్టడానిక్కూడా విద్యుచ్ఛక్తినే వాడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రాచీన గ్రీకులు వాడిన రాగి బ్యాటరీలు ఇటీవల బయటపడ్డాయి కూడా.

  చెప్పాలంటే చాలా ఉంది. తొందరపడి ఏ విషయాన్ని కొట్టిపారెయ్యద్దు.

 2. సత్యసాయి అభిప్రాయం,

  తేది: March 16, 2007 సమయము: 8:58 pm

  అయ్యా. మీరు వేళాకోళానికన్నా, మహాభారత యుద్ధంలో అణ్వాస్త్ర ప్రయోగం జరిగిందని ఈ మధ్య ఒక విదేశీప్రముఖుడే అన్నట్లు ఎక్కడో చదివాను. అంబానాథ్ గారు చెప్పినదాంట్లో వినదగ్గ విషయం ఉంది. భూగర్భ జలాలు ఎక్కడ నిక్షిప్తమయి ఉన్నాయో కనుక్కోవడానికి కొన్ని సూత్రాలు ఒక ప్రాచీన ప్రముఖుడు చెప్పాడని, వాటిని ఉపయోగించి తాను తవ్వించిన బావులు అత్యధిక శాతం సఫలీకృతమైయ్యాయని ఒక ఇంజినీరు చాలా ఏళ్ళక్రితం పత్రికలో వ్రాసాడు. అయితే మన విజ్ఞానం అంతా సంస్కృతంలో వ్రాసి ఉండడం వల్ల, ఆ సంస్కృతం మన విదేశీ, స్వదేశీ పాలకుల పుణ్యమా అని నిర్లక్ష్యానికి గురి అయ్యి మరుగున పడిపోవడం వల్లా ఇప్పుడు మనకి కూడా ఒక విజ్ఞాన వారసత్వం ఉందన్న స్పృహకూడ మనం కోల్పోయాం. సంస్కృతం అనగానే బ్రాహ్మణవాదం, మనువాదం లాంటి బూతులు గుర్తుకు రావచ్చు చాలామందికి. కానీ ఇప్పుడు శాస్త్రవిజ్ఞానానికి ఆంగ్లం ఎలాగైతే మాధ్యమంగా ఉపయోగ పడుతోందో అప్పుడు సంస్కృతం అలా ఉపయోగపడిందని గ్రహించాలి. ఇప్పుడు ఆంగ్లంలో ఉన్న విజ్ఞానం చాలామందికి అందుబాటులో లేదు. కానీ ఆంగ్లం చెడ్డది కాదు. సంస్కృతం విజ్ఞానంపై గుత్తాధిపత్యం కోసం వాడారని అంటారు. ఇప్పుడు విదేశాల్లో మన సంస్కృతం, యోగా, ఆయుర్వేదం లాంటివి వ్యాపార యోగ్యాలు. మన పురాణాలు వాస్తవాలని, మహిమలనీ కలగాపులగం చేసి చెప్పడం వల్ల పుక్కిటి పురాణాలనిపిస్తాయి కానీ అవి చరిత్ర గ్రంధాలు అని జర్నలిస్టు శాస్త్రి గారు తన “ఏది చరిత్ర” అన్న పరిశోధనా పుస్తకంలో నిరూపించారు. చరిత్రని వక్రికరించడం, విదేశీపరిశోధకుల మాటల్ని వేదాలుగా పరిగణించడం మన చరిత్రకారులకి అలవాటని చాలా సందర్బాల్లో అనేకమంది ఉటంకించడం జరిగింది. అది నిజమని మనం చూస్తోనే ఉన్నాం.

 3. lalitha అభిప్రాయం,

  తేది: March 19, 2007 సమయము: 10:32 pm

  ప్రసాదు గారూ,

  పేరులో “వేదాలలో …” అన్నారు కానీ, మీరు ప్రస్తావించిన ఉదాహరణలు ఏవీ వేదాలకి సంబంధిచినవి ఉన్నట్టు లేవు.

  విజ్ఞానం ఉందనడానికైనా,లేదనడానికైనా, వేదాలు చదివి అర్థం చేసుకున్నవారు కావాలేమో శాశ్త్రీయమైన వాదన చేపట్టటానికి?

  అపారమైన విజ్ఞానం ఉంది అని వాదించి ఆ పేరుతో ముడి పెట్టిన అర్థం లేని ఆచారలని సమర్థించటమూ, అలాగే మన వేదాలలో ఎటువంటి జ్ఞానమూ లేదు అని వాటి గురించి పెద్దగా తెలుసుకోకుండా వాటిని విలువలేని వాటి కింద జమకట్టి మన “హెరిటేజు” ని(తెలుగులో ఈ పదం సరిగా ఎలా రాయలో తెలియలేదు) మనమే కించపరుచుకోవడమూ, రెండూ తప్పే అనిపిస్తుంది.

  లలిత.

 4. charasala అభిప్రాయం,

  తేది: March 20, 2007 సమయము: 10:46 am

  అంబనాధ్ గారూ,
  పూర్వీకులకు తెలుసో లేదో కానీ మనకు మాత్రం చాలా తెలుసు అనడానికి మనం చూస్తున్నదే చాలు కదా! భరద్వాజ మహర్షి రాసిన 19 అధ్యాయాల పుస్తకమే దొరుకుతూ వుంటే కనీసం ఒక్కటంటే ఒక్క విమాన అవశేషమూ ఎందుకు మనకు కనిపించట్లేదు?
  నేను భరద్వాజ మహర్షి పుస్తకమూ చదవలేదు అవధానులు గారు రాసిందీ చదవలేదు. తెప్పించుకొని చదువుతాను. కానీ నా సామాన్య దృష్టికి పూర్వులు సాధించలేదనీ, సాధించ కలలు మాత్రమే కన్నారని అనిపిస్తుంది. అయితే ఆ కాలానికి మన ఋషులే ప్రపంచమంతటికీ గొప్ప జ్ఞానులు అయ్యుందవచ్చు కానీ వాళ్ళకు ఇప్పటి సైన్సుకు అందిన విషయాలు తెలుసును అంటే నాకు నమ్మశక్యం కాదు.
  విద్ద్యుచ్చక్తి వుపయోగించి పిరమిడ్డులు కట్టగలిగిన వారు ఎందుకనీ కనీసం నైలునది మీద ఒక ఆనకట్టనైనా కట్టలేక పోయారు? విద్ద్యుచ్చక్తినే వుపయోగించ తెలివుంటే ఆ బండలమీద, గోడలమీద చిత్రీకరించిన చిత్రాలు అంత నాసిరకంగా గుహల్లో నివసించేవారివిలా ఎందుకున్నాయి? వాళ్ళ తెలివి అన్ని వైపులా పాకక ఒక్క విద్యుత్తు వైపే వుండిందా?

  సత్యసాయి గారూ,
  విదేశీ ప్రముఖుడన్నంతనే అన్నమాట ప్రముఖమైపోతుందా? మన గొప్పతనం చెప్పడానికి విదేశీయులు సాక్షి సంతకం పెట్టాలా? అనాదిలో కనిపెట్టబడిన సాంఘిక దర్మాలు ఇప్పటికీ వేళ్ళూనికొని వున్నాయే, అప్పట్లో కనిపెట్టబడిన వైజ్ఞానిక విషయాలు అంత త్వరగా ఎలా పాడయ్యాయో! నేను సంస్కృతాన్ని ద్వేషించటం లేదు. మన వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకోవాలని నాకు మాత్రం వుండదా ఏమిటి? కాకపోతే మరీ విడ్డూరాలను మన గ్రందాలలో మహిమలతో, మంత్రాలతో సాద్యమయ్యాయని చెప్పేవన్నీ నిజంగా మనవాళ్ళు పూర్వమే కనిపెట్టేశారని, మన సంస్కృత గ్రందాలను అపహరించి పాశ్చాత్యులు ఇప్పటి విజ్ఞానాన్ని సంపాదించారని చెప్పడంమీదే నా అభ్యంతరం.
  కనీసం మన సంపదను వాళ్ళు కొలగొట్టి చేయగలిగిందైనా మనం చేయలేకపోయామే?
  ఆర్యబట్టు, భాస్కరుడు, పాణిని లాంటి వారిని తలచుకున్నపుడు సంతోషంతో పులకించిపోతాను. ఇంతకుముందే పిండాలను నేతికుండల్లో పెంచడం, తెగిన తలలు అతికించడం, అణ్వాయుధాలతో యుద్దం చేయడం అంటే నామట్టుకు అది అసంభవం.
  అభివృద్ది అనేది సరళరేకలా సాగుతుందనేది నా నమ్మకం. వర్తులాకారంగా జరిగిందే మళ్ళి జరుగుతుందనేది నేను నమ్మను. రామాయణ కాలంలోనే విమానాలు వుండుంటే రాముడు లంకనే కాదు అమెరికాను జయించేవాడు ఆరోజుల్లోనే! కానీ మన పురాణాలు మహా అంటే ఆసియా ఖండం దాటి మాట్లాడిన దాఖలాలు లేవే!

  లలిత గారూ,
  “వేదాలలో…” అన్నది ప్రాచుర్యంలోని మాట గనుక అలా అన్నాను. వేదాలలోనివే గాక ఏ గ్రందాలలోని విశయాలైనా అని నా అభిప్రాయము.
  వేదాలని చదివి అర్థం చేసుకున్నవారు కావాలి వాదించడానికి అన్న మీమాటతో నేను ఏకీభవిస్తున్నాను.
  నేను ఎటువంటి జ్ఞానమూ లేదని వాదించే రకము కాదు. జ్ఞానము వుంది కానీ ఇప్పుడు కొందరు వాదిస్తున్నట్లుగా ఇప్పటి సైన్సుతో తూగేది కాదు అని నా నమ్మకము.

  –ప్రసాద్

 5. Ravikiran T. Reddy అభిప్రాయం,

  తేది: March 20, 2007 సమయము: 9:39 pm

  500 పుటలు, 19 అధ్యాయాల Aeronautical Engineering గ్రంధాన్ని వ్రాసిన భరద్వాజ మహర్షి, ఎందుకనో తాటి ఆకులమీద, ఘంఠంతో వ్రాయడవనే తక్కువ టెక్నోలజీనే వుపయోగించారు. దీన్నిబట్టి అర్థమయ్యేదేవిటంటే, ఆ గ్రంధం బహుశా వెనుక వరసలో కూర్చున్న గురుకులం పిల్లలేవరో గురువుగారి మీద విసిరేసేందుకు చేసిన తాటి ఆకుల విమానాల పైనేవోనని నా అనుమానం.

  విద్యుత్ ని, అణ్వాయుధాన్ని కలిగివున్న కురు వంశస్తుల బంధువైన శ్రీ క్రిష్నుల గారికి వార్మ హోల్, ఇంటర్ డైమెన్క్షనల్ ప్రయాణం గురించి కూడా తెలుసని భారతం విన్న వాళ్ళకి కూడా తెలుసు.

  శాస్త్రవిజ్ఞానవనేది ముందుకి మాత్రవే ప్రయాణించడానికి వీలుగలిగిన దారి. అలాటి దారీలో, వేద కాలంలోనే అంత పరిణితి చెందిన శాస్త్రవిజ్ఞానం వుంటే, మొన్న మొన్నటిదాకా, ఒంటెద్దు బండి ప్రయాణవో, లేకపోతే నటరాజా సర్వీసో మాత్రవే ఎందుకు ప్రధాన ప్రయాణ సాధనాలుగా వుండేవి?

  అయినా ఈ వాదనలు తెగేవి కాదులే ప్రసాద్, మా తాతలు నేతులు త్రాగేరు అనుకోవటంలో ఆనందం వుందికదా!

  రవికిరణ్


 6. తేది: April 19, 2007 సమయము: 11:46 am

  [...] [అన్నీ వేదాల్లో వున్నాయిష, అంతా వేదాల్లో ఉందష…, లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య] దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అని ఎక్క..డో చదివినట్టు గుర్తుంది (దయ్యాలు ఉన్నాయిష! ???). మనిషి సత్యాన్ని తెలుసుకొని విగ్నాన్ని పదురుగురితో పంచుకునే ఒక ఉత్తమ సంప్రదాయ పరపరలోని భాగమే ఏ వేదలు అనబడే సహిత్యం అని నా నమ్మకం. మానవ జీవితానికి సంబంధించి ఎంతో విగ్నానం వుండి వుంటుంది (నేను చదవలేదు కాబట్టి). ఇకపోతే moneyషికి ఉండేది ఒక పాడె, బొంద మరియు పిండాకుడు తప్ప వేరేవి (జ్ఞానం, ఆత్మ విజ్ఞానం వంటివి) ఉండవు ఎందులోనూ…ష. [...]


 7. తేది: May 25, 2007 సమయము: 1:26 am

  [...] సంబంధించిన టపాలు: అన్నీ వేదాల్లో వున్నాయిష, అంతా వేదాల్లో ఉందష…, లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య , *వేద ఘోష, *మన వేదాలు – మార్గ నిర్దేశం [...]

 8. dinakar అభిప్రాయం,

  తేది: November 24, 2008 సమయము: 8:05 am

  మీ అందరి జవాబులు చదివిన తరువత ఒక్క సందెహమ్ వచ్చింది.ఇక్కడ ఎంత మంది వేదాలు చదివరు ???

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో