బాల్య వివాహాలు

తేది: March 8, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 3,431 views

http://groups.google.com/group/telugublog/browse_thread/thread/320aa082313d7cb తెలుగు బ్లాగు గుంపులో జరిగిన చర్చకు తరువాయి… 

తాడేపల్లి గారు కూడా పిన్న అవయసులో వివాహాల వైపు మొగ్గేసరికి ఇక నేను నా అభిప్రాయమూ చెబుదామనుకుంటున్నా! అజిత్ గారూ,
మళ్ళీ వెనక్కు వెళ్ళి ఒకసారి మీ వాదన చదివా. మీరంటున్న దాన్ని బట్టి ఆహార అవసరాలు ఎలాగో దాంపత్య/సంపర్క అవసరాలూ అంతేనంటున్నట్లుంది.
ప్రకృతి మనుషులకి పది పన్నెండేళ్ళ వయసుకే పునరుత్పత్తి శక్తి ఇచ్చింది. లేదంటే పద్నాలుగేళ్ళనుకుందాం. అందుకని మనం నిగ్రహించుకొని సంతోష సమయాన్ని నానా విధాల కట్టుబాట్లతో ముప్పై ఏళ్ళ వరకూ వాయిదా వేసుకుంటున్నామంటారా? ఎందుకొరకు మనం ఎనిమిదేళ్ళకే పెళ్ళిల్లు చేసుకోవాలి?
సరే ప్రకృతి ధర్మం కొద్దీ మనం పోవాలంటారా? మరయితే మానవ ధర్మం ఏమి కావాలి? మనం మనుషులమయినందుకు మిగతా ప్రాణికోటిలా కాకుండా ఏది ప్రకృతిగుణంగా పోవాలో ఎక్కడ మనవంటూ పద్దతులు పాటించాలో నిర్ణయించుకొని అందుకోసం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం.
పళ్ళురాని పసివాడు గుంతులో చిక్కుకుంటేదోనన్న తెలివి లేకుండా కనపడిందాన్నల్లా నోట్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాడికి నోరుంది, మింగడానికి గొంతుంది అని మనం చూస్తూ వూరుకుంటామా? గొంతులో చిక్కుకుంటే ఏమవుతుందో మన అనుభవ పరంపర మనకు చెప్పటం లేదా? నోరుండటం, గొంతుండటం అన్నీ తినటానికి ఎలా అర్హత అవ్వదో, ఫలదీకరణకు, పునరుత్పత్తికి సిద్దంగా వున్నా ఆ వయసులో ఆ అపని చేయదగ్గది కాదనే కదా మన ఇన్ని సంవత్సరాల నాగరికత నేర్పింది?
అదేగాక మానవుడు ప్రతి దాని విశయంలోనూ ప్రకృతితో కలిసి నడవలేడు. అందుకే కదా మనం వావి వరసలు సృష్టించుకున్నది. నిన్న బిబిసిలో అన్నా చెళ్ళెల్ల మద్య జరిగిన వివాహం గురించి శ్రోతలు పంపిన అభిప్రాయాలు చదువుతుంటే వింటున్నాను. కొందరు వారికి శిక్ష వేయాలి అంటే కొందరు అది శిక్ష వేయదగ్గ నేరము కాదంటే…. ఇలా వివిధ అభిప్రాయాలు చెప్పారు. మీరేమంటారు?

ప్రతిదానికి ప్రభుత్వ ఆంక్షలా అంటూ రవి వైజాసత్య వ్యతిరేకతతో కూడా నేను ఏకీభవించను. అయితే ప్రభుత్వం వ్యక్తిగత విషయాలలో జోక్యం ఒక పరిమితికి మించి చేసుకోకూడదు. వ్యక్తి యొక్క స్వవిషయమైనా సమాజం మీద ప్రభావం చూపిస్తుంది అంటే దాన్ని ప్రభుత్వం (ఆంటే సమాజం) అడ్డుకొని తీరాలి. నా తిండి నా ఇష్టమని నా ఇష్టం వచ్చింది తింటే మా అమ్మ వూరుకోనట్లే, నా ఇష్టం నా చెవి నేను కోసుకుంటా అంటే నా తండ్రి ఒప్పుకోనట్లే, స్వవిషయాలైనా సమాజానికి ముప్పు అనిపిస్తే ప్రభుత్వరూపంలో సమాజం వాటిని అడ్డుకొనే హక్కు వుంటుంది.

నా అబిప్రాయము ప్రకారము నిర్బంద విద్య, 18 ఏళ్ళ తర్వాత వివాహము వ్యక్తిగత విషయాలైనా కూడా ప్రభుత్వము నిర్బందంగా అమలు జరపాల్సిందే.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'బాల్య వివాహాలు' పై 16 అభిప్రాయాలు

'బాల్య వివాహాలు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. జ్యోతి అభిప్రాయం,

  తేది: March 8, 2007 సమయము: 11:22 am

  నిజమే ప్రభుత్వం నిబంధన పెట్టడం మంచిదే. ఆడపిల్లలకి 21,మగపిల్లలకి 27 వయసులో పెళ్ళి చేస్తే మంచిది. అప్పటికి వాళ్ళు చదువులు పూర్తీ చేసుకుని లోకాన్ని అర్ధమ చేసుకునే సామర్ధ్యం వస్తుంది.ఎమీ తెలియని వయసులో ఎందుకంత తొందర.పెళ్ళి అంటే మన బాధ్యత తీర్చుకోడం మాత్రమే కాదుకదా.వాళ్ళు ఎవరి మీదా ఆధారపడకుండా చేయడం ముఖ్యం కాని. ఎందుకు వెనక్కి వెళ్ళడం.

 2. కొత్తపాళీ అభిప్రాయం,

  తేది: March 8, 2007 సమయము: 11:26 am

  ప్రసాద గారూ,
  ఇదేదో ఇంతకు ముందు జరుగుతున్న చర్చ కంటిన్యూ అవుతున్నట్లుంది. ముందరి చర్చకి లంకెలు చూపెడితే ఇలా ఆలస్యంగా వచ్చిన నాలాంటివాళ్ళు కూడా ఫాలో అవచ్చు కదా.
  ధన్యవాదాలు.

 3. భాస్కర్ అభిప్రాయం,

  తేది: March 8, 2007 సమయము: 11:38 am

  ప్రసాదు గారు చెప్పిందానికి తిరుగులేదు.
  ముందు అసలు పెళ్ళికి ప్రీరెక్విజిట్సు ఉన్నాయా? ఉంటే అవి యేంటి? మానసిక వికాసం అనేది లేకుండా పెళ్ళిచేసుకుంటే యేమవుతుంది? కేవలం కోరికలు తీర్చుకోవటానికేనా పెళ్ళి?
  ధర్మ-అర్ధ-కామ-మోక్షాలు కద మనిషి జీవితానికి అర్ధం? మరి చిన్నవయ్యస్సులో పెళ్ళి చేస్తే, ఆ దంపతులకి ధనం యెలా? ఇంకొకళ్ళమీద ఆధారపడాల్సిందేనా? ఈరోజు రేపట్లో చదువు పూర్తిచేసి ఉద్యొగంవచ్చి కాస్త కాలు చెయ్యి తీసుకోటానికే 24యేళ్ళు పడుతున్నది యెవరికైనా. సంసారం పెట్టటానికి యెంత ఖచ్చు అవుతున్నదో తెలియంది కాదు. యేమైనా 25 అనేది మంచి వయసు అబ్బాయికి. అమ్మాయికి నా ఉద్దెశంలో 20-23. నాకు నాప్రపంచాన్ని నిర్మించుకుని నాకంటూ కొన్ని నిక్కచ్చైన అభిప్రాయాల్ని మూటగట్టుకోటానికి 26 యేళ్ళ పట్టింది. 27 కి పెళి చేసుకున్నా.
  ధన్యవాదాలు
  -భాస్కరు

 4. sudhakar అభిప్రాయం,

  తేది: March 8, 2007 సమయము: 1:39 pm

  జ్యొతి గారు :
  అబ్బాయిలకి 27 అంటె మరి ఎక్కువెమొ?


 5. తేది: March 8, 2007 సమయము: 3:20 pm

  మీరు చెప్పినదానితో ఎకీభవిస్తాను.
  ఆర్థికంగానూ, మానసికంగానూ పరిపక్వత వచ్చినప్పుడే పెళ్ళి చేసుకోవాలి. అది 18-20 తరవాతే అని నా అభిప్రాయం.

 6. జ్యోతి అభిప్రాయం,

  తేది: March 8, 2007 సమయము: 8:52 pm

  సుధాకరుగారు అది సరియైనదండి. అప్పటికి తమ ఉద్యోగంలో కాని, కెరియరులో నిలదొక్కుకుని ఉంటారు అబ్బాయిలు.కాస్తో కూస్తో అప్పులు ఉంటే తీర్చేసి.పెళ్ళీ అంటే వట్టి తతంగం కాదుగా.ఎన్నో కొత్త కొత్త బాధ్యతలు.అందరికీ డబ్బులున్న తండ్రులు ఉండరుకదా! పోషించడానికి. పెళ్ళి చేసుకోగానే ఓ పనైపోతుంది అని కాదుగా! ఇది జీవితాంతం నిర్వహించవలసిన బాధ్యత.ఎందుకు అంతకంటే ముందుగా సంసార సాగరంలో మునగాలనుకుంటారు?

 7. radhika అభిప్రాయం,

  తేది: March 9, 2007 సమయము: 12:40 am

  మీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తాను.అమ్మయిలకి 21,అబ్బయిలకి 26 గా వివాహ వయసు వుంటే బాగుంటుందేమొ.

 8. T.Bala Subrahmanyam అభిప్రాయం,

  తేది: March 9, 2007 సమయము: 4:16 am

  మరీ బాల్య వివాహాల్ని నేను సమర్థించలేదు.ఆడా మగా కనీసం ఇంటర్మీడియట్టయినా పాసవ్వాలి అని నా అభిప్రాయం.అంతే. ఈ నాగరికత పోయి మరో నాగరికత వచ్చినా, మన దేశం సంపన్న దేశమైనా పెళ్ళికి ఆ మాత్రం వయసు రాక తప్పదనుకుంటా.

 9. swathi అభిప్రాయం,

  తేది: March 9, 2007 సమయము: 4:49 am

  ఇంత వయసని చెప్పాలంటే కష్టం.ఆర్ధికంగా, మానసికం గా కనీస ఎదుగుదల ఉండటమ ముఖ్యం. అలా అని మరీ వయసు మించిపోతే పిల్లల బాధ్యత సరిగ్గ నిర్వహించటమ కష్టం.
  20-27 మధ్య వయసు ఎవరికైనా మంచిది వివాహం విషయమ లో

 10. కొత్తపాళీ అభిప్రాయం,

  తేది: March 9, 2007 సమయము: 10:31 am

  ఇంచుమించు సభ్యులంతా 18 ఏళ్ళ లోపు పెళ్ళి చెయ్యడం మంచిది కాదని తీర్మానిస్తున్నట్టు ఉన్నారు.
  ఇది ప్రస్తుత సమాజంలో – అంటే కాస్తొ కూస్తో చదువుకుని ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ తమ చిన్న కుటుంబాన్ని తాము పోషించుకోవాల్ అనే స్పృహవున్న మధ్య తరగతి జీవితాల్లో – సాధారణంగా అమలవుతున్నదే.
  చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అనగానే రక్తం మరిగిపోయే ఆవేశాన్ని కాస్సేపు పక్కన పెట్టండి.
  కొంచెం వెనక్కి వెళితే – ఎక్కువ అక్కర్లేదు – ఒకటి రెండు తరాలు వెనక్కెళితే, మన కుటుంబాల్లోనే 10-15 ఏళ్ళ వయసు మధ్య జరిగిన పెళ్ళిళ్ళు చాలా తరచుగా కనిపిస్తాయి. మా అమ్మమ్మ తాతయ్యలకి 12-13 ఏళ్ళ వయసులో జరిగింది. వాళ్ళిద్దరూ మామూలుగా అందరు దంపతులు పడే కష్టాల్లాంటివే పడ్డారు, కానీ అంత చిన్నతనపు పెళ్ళి వల్ల ఏదో ప్రత్యేకమైన కష్టాలు పడినట్లు నేనెప్పుడూ వినలేదు. నాకు తెలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. నాకు బాగా వయసొచ్చాకే, వాళ్ళకి 75+ వయసులో పోయారిద్దరూ.
  అలాగే ఆ తరం రచయితల కథలు నవలలు చూడండి. ఎంతో ప్రగతిశీల దృక్పథం ఉన్నవాడని పేరుపడ్డ కొకు కథల్లోనే చాలా పెళ్ళిళ్ళు 10-15 ఏళ్ళ వయసులో జరుగుతుంటై. ఆ విషయం స్వతహాగా చెడ్డదని ఆయన రాసినట్టు నేను చూళ్ళేదు.
  ఇంతకీ విషయమేవిటంటే – అప్పటి కుటుంబ పరిస్థితులు ఆ వయసు పెళ్ళిళ్ళని నిలబెట్టటానికి సరిపడి ఉండేవి. ఇప్పటి పరిస్థితుల్లో ఏ పిచ్చి తండ్రైనా తన కూతురికి అలా చెయ్యాలని ప్రయత్నించినా ఆ పెళ్ళిని బతికించడం చాలా కష్టమవుతుంది. ఈ కష్టం సమాజపు తీరుకి ఎదురుగా పోవటం వల్ల మాత్రమే కాదు .. వేరే ఆర్థిక, కుటుంబ, సామాజిక వత్తిడుల వల్ల కూడా.

  పైన వ్యాఖ్యల్లో ఎవరో సరదాగా అన్నారు, “ఆహా, తండ్రి కూతురి బరువు తొందరగా వదిలించుకోవచ్చనా?” అని. బరువు వొదిలించుకోవటం ఎక్కడ, పిల్లకి పెళ్ళి అంటే అల్లుడు, వియ్యాలవారి రూపంలో తడిసి మోపెడైన బరువుని నెత్తికెత్తుకోవడం అవుతుంది గాని!

  ఇంకొక మాట. ఇక్కణ్ణించి చూస్తే గతమంతా ఒకేలా కనిపించ వచ్చు, కానీ మన సమాజం 19వ శతాబ్దిలో ఉన్నట్టు 15వ శతాబ్దిలో లేదు. అప్పుడున్నట్టు పదో శతాబ్దిలోనూ, బుద్ధుడి కాలంలోనూ, వేద కాలంలోనూ లేదు. సమాజపు విలువలు, పద్ధతులు ఎప్పటికప్పుడే మారుతూనే ఉన్నాయి. దీన్ని ఒక కాలక్రమ పద్ధతిలో గమనించాలంటే మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ గారి “ఓల్గా నుంచి గంగకు” చదవచ్చు.

 11. Sowmya అభిప్రాయం,

  తేది: March 9, 2007 సమయము: 8:44 pm

  అమ్మాయైనా అబ్బాయైనా జీవితం లో కుదురుకోవడానికి కనీసం 23-24 ఏళ్ళు వచ్చేవరకు పడుతుంది. 24-28 ideal age అని నా అభిప్రాయం. ఇక్కడ అమ్మాయికి 21 అబ్బాయికి 27 అని అన్నారు పైన ఒకరు. నాకు ఆ వయసు తేడా మరీ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇక పోతే ప్రభుత్వం minimum వయసు పెట్టడం నా దృష్టిలో అవసరమే. మరీ చిన్న వయసు లో mental maturity లేకుండా ఉన్న వయసు లో పెళ్ళిళ్ళు, బలవంతపు బాల్య వివాహాలు నిరోధించడానికి ఇది అవసరమే నా అభిప్రాయం లో. పాత కాలం లో 15 ఏళ్ళ లోపు పెళ్ళిళ్ళు అయిపోయేవంటే అప్పటి సామాజిక పరిస్థితులు వేరు. ఇప్పటివి వేరు. దేశకాలమాన పరిస్థుతులను బట్టి ప్రవర్తించాలి అంటారు కదా :)

 12. Ambanath అభిప్రాయం,

  తేది: March 10, 2007 సమయము: 4:57 am

  సౌమ్యగారితో విభేదించక తప్పట్లేదు.మన వోట్లతో గెలిచేవాళ్ళు ప్రతి విషయంలోను మనల్ని కంట్రోల్ చెయ్యడానికి దోహదించే ఏ ప్రతిపాదనలకైనా నేను వ్యతిరేకం. తప్పో ఒప్పో మంచో చెడో మన ఇష్టమొచ్చినట్లు మనం బతకాలి గాని “బాబ్బాబూ మమ్మల్ని మా మేధాశక్తిని మా పరిణతినీ నువ్వు monopoly తీసుకో. మా జీవితాలకి నువ్వు అధ్యక్షత వహించు.నువ్వు శాసించు.మేము శిరసావహిస్తాం.”అని రాజకీయ నాయకుల కాళ్ళుమొక్కే దరిద్రగొట్టు ప్రజాస్వామ్యం నాకొద్దు. అయినా ఒక మాట. ఇప్పటిదాకా దేన్ని నిషేధించగలిగారు ? ఏమి సాధించగలిగారు ? అని అడుగుతున్నాను. బహు భార్యాత్వం నిషేధించారు. జనం ఇద్దర్ని ఉంచుకోవడం మానారా ? హోమోసెక్సువాలిటీ నిషేధించారు. జనం అది మానారా ? కట్నాలు నిషేధించారు. కట్నాలు పోయాయా ? వావిడికం (incest) నిషేధించారు.పోయిందా ? సారాయి నిషేధిస్తే ఆ సమయంలో కోట్లకి పడగలెత్తలేదా దొంగ సారా వ్యాపారులు ? జన జాగృతే దేనికైనా మందు. ప్రభుత్వాల బలవంతాలు చెల్లవు. పనిచెయ్యవు కూడా.

 13. సుధాకర్(శోధన) అభిప్రాయం,

  తేది: March 10, 2007 సమయము: 6:56 am

  పుట్టిన వెంటనే జనన ధృవీకరణ పత్రం ఇవ్వటంతోనే ఈ సంఘం మన మీద ఆధిపత్యం చెలాయించటం మొదలు పెడుతుంది. ఇస్తే తల్లితండ్రులు ఇవ్వాలి గానీ మధ్యలో ఈ ఎమ్.ఆర్.వో ఎవడ్రా అనుకుంటుంది శిశువు అప్పటికే మాటలు వస్తే. కాబట్టి మనందరం పుట్టడమే ఒక పంజరంలో పుడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఒక్క సారి చుట్టు చూడండి సంఘం కళ్లు ఎంత పెద్దవో మీకు తెలుస్తాయి. నడిరోడ్డులో నగ్నంగా నడిస్తే పిచ్చి ఆసుపత్రిలో తీసుకుపోయి పడేస్తారు. ఏం అదేమన్నా తప్పా? మనకు బట్టలు కట్టుకునే నాగరికత మొదటినుంచి లేదే? కాకపోతే తరతరాలుగా వస్తున్న సంప్రదాయక సంఘ మార్గ దర్శకాలు అది తప్పు అని మనకు చెప్పడం, మనము తప్పు తప్పు అనటం జరిగిపోతున్నాయి.

  చస్ ఈ సంఘంతో నాకు పనేంటి అనుకుంటే మంచిగా ఏ హిమాలయాలో చెక్కెయ్యటం మంచిది. అది కుదరనంతవరకు మీరు, నేను, అందరూ…పుట్టబోయే పిల్లలు అందరూ ఈ సంఘానికి గుత్త బానిసలు. అది ఏది మంచిదందో అదే మనకు మంచిది. చెడ్డంటే చెడ్డది. ప్రస్తుతం సంఘానికి మీకు అతి చేరువలో అధికారకంగా ప్రాతినిధ్యం వహించేది “ప్రభుత్వం”. మనమందరు ఎన్నుకున్న సంఘ కార్యదర్శి అన్నమాట. అది ఏం చేసినా మన వాక్కు మాత్రమే.

  ఇదంతా ఎందుకు చెప్పానంటే…పైన పేర్కొన్న సమస్య అయినా, మరొకటి అయినా అది మనం చేసుకున్న చట్టమే. దాని వెనుక చాలా వరకు మంచి కారణాలే వుంటాయి. మనం మానామా? మాన్లేదా అనేది మన సమస్య. గానీ అది ఈ సంఘంలో బాహటంగా చేస్తు పట్టుబడితే దానికీ సంఘం తన పొదిలో అస్త్రాలను తయారుగా పెట్టుకుని వుంటుంది.

 14. జ్యోతి అభిప్రాయం,

  తేది: March 12, 2007 సమయము: 12:30 am

  గత వారం బాల్యవివాహాలమీద చర్చ జరిగింది కదా! అధిక శాతం మంది తొందరగా పెళ్ళీ చేస్తే మంచిది అన్నారు.నేను అబ్బాయిలకు 27 అంటే మరీ ఎక్కువ అన్నారు సుధాకర్. కాని ఈ రోజు ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం పెళ్ళీకి మాత్రం 30 ఏళ్ళు మేలని నేటి భారతీయ యువత ఘంటాపధంగా చెపుతుంది.వృత్తి జీవితంలో స్థిరపడక ముందే కాపురం పెట్టి కష్టాలపాలయ్యేకంటే తాపీగా ౩౦ ఏళ్ళ వయసులో కుటుంబ జీవితం మొదలుపెట్టడం మంచిదని 79% శాతం మంది భారతేయ యువత అభిప్రాయపడింది.

  మన బాధ్యత తీరుతుంది అని తొందరగా పెళ్ళి చేయడం మంచిదా? లేక పెళ్ళి చేసుకొని జీవితం గడపాల్సిన వారి ఇష్టం ప్రకారం చేయాలా?

 15. సుధాకర్(శోధన) అభిప్రాయం,

  తేది: March 12, 2007 సమయము: 1:58 am

  ఇంతకీ పిల్లలకు పెళ్లి చెయ్యటం బాధ్యత క్రింద ఎందుకు భావిస్తారు? ఎవరి పెళ్లి వారి సొంత గొడవకే వదిలెయ్యొచ్చు కదా.

 16. దిలీప్ అభిప్రాయం,

  తేది: March 13, 2007 సమయము: 3:06 am

  మీరు అంతా చాలా లొతుగా అలొచిస్తున్నట్టున్నారు ఈ విష్యం గురించి. మీరు మరి అంతగా అలొచించ పని లెదనుకుంటా ఎందుకంటె ఇప్పుడు అంతా మారిపొయారు అదెనండి అమ్మాయి తల్లి తండ్రులు , 25 సం! వచ్హినా పెళ్హి చెయాలని అలొచించడం లెదంట. ఇది ఎదొ పపెర్ సెర్వె కాదండొయి, రియల్ సర్వే. ఇది అందరికి వర్తించదులెండి. ఐ.టి లొ పని చెసె వాల్ల తల్లి తండ్రులు మాత్రమె. అది వారి తప్పుకాదులెండి కట్న కానుకలు భారిగ తీసుకొనె వారిది కావచ్హు …

  దిలీప్.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో