నా ధీరత్వము

తేది: March 5, 2007 వర్గం: నా ఏడుపు, వర్గీకరింపబడనివి రచన: చరసాల 3,793 views

వేరుశనగ పంట వర్షాధార పంటగా జూలై, ఆగష్టు నెలల్లో వేస్తారు. అయితే చాలా మంది రైతులు ఈ పంటకు కావలసిన విత్తనానికై అప్పులు చేస్తారు. రైతు అవసరమున్న ప్రతిసారీ ధరలు కొండెక్కడం తెలిసిన విషయమే అయినా రైతులు చేయగలిగింది తక్కువ. విత్తనాల కొరకై అప్పులు, ఆ తర్వాత రసాయన ఎరువుల వాడకానికి అప్పులు, ఆ తర్వాత కలుపు తవ్వడానికి, పీక డానికి, వలవ డానికి అన్నిటికి అప్పులే… పైగా ఈ మద్యకాలంలో తిండీ తిప్పలకూ, పండుగ పబ్బాలకూ కూడా ఈ పంట చూపించే షావుకారుల దగ్గర మామూలు రైతు అప్పు చేస్తాడు. తీరా వర్షాలు సవ్యంగా పడి, గొంగళి పురుగు, వేరు పురుగు క్షమిస్తే రైతుకు పండిన పంట ఈ అప్పులు కట్టడానికే సరిపోతుంది. సరిపోయింది అంటేనే గొప్ప విషయం. చాలా సార్లు సరిపోదు. ఇప్పటి అప్పు వారసత్వంగా తర్వాతి సంవత్సరానికి బదిలీ అవుతుంది. ఇలా ఎన్ని పర్యాయాలు పంట సరిగ్గా పండకపోతే రైతు అంతగా చితికి పోతాడు.
అయితే ఇలాంటి విషవలయంలో పడకుండా మా నాన్న మాత్రం ఎలాగోలా తన తెలివినీ, భూమినీ, నీటినీ, పశువులనూ, కొడుకులనూ ఆమాటకొస్తే అందుబాటులోని ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకొని బయట పడ్డారు.
మాకున్న “గద్దగుండ్ల బావి” ఒక ఒయాసిస్సు! ఎంత కరువులోనైనా కనీసం రోజుకు మట్టు (నిలువెత్తు అనుకోవచ్చు) నీళ్ళు వూరుతుంది. కనీసం ఎకరా ఆరుదడి పంటకు ఆ నీళ్ళు సరిపోతాయి. అయితే ఆ బావికి మాతో పాటు ఇంకొకరికి కూడా భాగముంది. అంటే ఆ బావి నీళ్ళు తోడుకోవడానికి మాకు రోజుమార్చి రోజు హక్కుంటుంది.
మా తాత, అమ్మ జీవితాలు.. మా బాల్య జీవితాలు ఈ బావితో ఎంతగా పెనవేసుకొన్నాయంటే, అదీ మా కుటుంబ సబ్యుడే అన్నంతగా! ఈ బావి గురించి మరోసారి చెప్పుకుందాం.
మాకున్న ఆ వనరుతో మా నాన్న నానా ప్రయోగాలూ చేసేవారు. మా వూరిలో ఎవరూ సాహసించని విధంగా ఎండాకాలంలో ఆ బావి కింద టమోటా వేసే వారు. చెరకు పండించే వారు. దోసకాయలు (cantaloupes), పుచ్చ కాయలు (Watermelons) పండించేవారు. అలాగే వర్షాధారపు పంటగా వేసే వేరుశనగ ప్రధాన పంటకు కావలిసిన విత్తనం కూడా పండించేవారు. దీనివల్ల అధిక ధరలకు అదునులో విత్తనం కొనే బాధ తప్పేది. పైగా ఈ బావి కింద పండే టమోటా లాంటి కూరగాయల పంటల ద్వారా, చెరకు లాంటి వాణిజ్య పంటల ద్వారా ఇల్లు గడవడానికి కావలిసిన రాబడి సమకూరేది.

మాకున్న ఆవులు, ఎనుములు (బర్రెలు) ద్వారా చాలా మట్టుకు పొలానికి అవసరమయ్యే సేంద్రీయ ఎరువు, మాక్కావలిసిన పాలు, పెరుగు లభ్యమయ్యేవి. ఇదే గాక ఎండాకాలంలో పనులు తక్కువ వున్న రోజుల్లో చెరువు మట్టిని చేలకు తోలేవాళ్ళం. వీటన్నింటితో బాటు రసాయన ఎరువులూ అంతో ఇంతో వాడేవాళ్ళం. ఇందువల్ల అప్పులు చేయాల్సిన అవసరం తగ్గి అంతో ఇంతో పంట మిగుల్చుకోవడమే గాక కొన్ని సార్లు మా నాన్నే ఇతరులకు విత్తనం, అప్పులూ ఇచ్చేవారు. అయితే వసూలు చేయడంలో ఇబ్బందులవల్ల అది తర్వాత మానేశారు.

అప్పుడు నేను బహుశా పన్నెండు పదిహేనేళ్ళ మద్య వుండి వుంటాను. ఆ రోజు వర్షం ఎడతెగకుండా కురుస్తోంది. వేరుశనగ మంచి కాపుమీద వుంది. ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో పీకవలసి వుంటుంది. మాకు అడవి పందులతో బెడద ఎక్కువ. అప్పట్లో వాటి కొరకు నాటు బాంబులు కూడా పెట్టేవారు. అవి వాటిని కొరికి చచ్చి పడేవి. ఆ తెల్లవారుఝామునే వెళ్ళి తెచ్చుకొని తినేవారు. అయితే అలాంటి పద్దతుల జోలికి మా నాన్న వెళ్ళేవారు కాదు. అక్కడో గుడిసె వేసుకొని రాత్రిళ్ళు కాపలా గాసేవారు. సర్వ సాధారణంగా ఆయనకు తోడుగా నేను వెళ్ళేవాడిని. తోడంటే మాట తోడే. తీరా అక్కడకు వేళ్ళాక నేను వళ్ళు తెలియకుండా నిద్ర పోయేవాడిని. తెల్లవారుఝామునే ఆయన లేచి “నేను వెళుతున్నాను. నీవు పొద్దుపొడిచాక దుప్పటి తీసుకొని ఇంటికి వచ్చెయ్” అని వెళ్ళిపోయేవారు. నాకు దయ్యాలూ, భూతాలూ అంటే భయం లేదని, నేను చాలా ధైర్యవంతున్ననీ మా అమ్మా, అవ్వా అందరితో చెబుతూ వుండేవాల్లు. స్వయంగా అంత భయస్తున్ని కాకపోవడం, వాళ్ళమాటను నిజం చేయాలన్న తలంపుతో తెగింస్తూండేవాన్ని. మా వూరికి పొలానికీ మద్యలో వున్న శ్మశానానికి దగ్గరగా వచ్చినపుడు ఎంత లేదన్నా ఒళ్ళు జలదరిస్తూ వుండేది. చిన్న ఆకు చప్పుడుకు కూడా ఒళ్ళు నిక్కబొడుచుకునేది. అయితే ఆ రోజు వర్షం బాగా కురుస్తోంది. ఆ పక్కనే పిడుగు పడ్డట్టగా అప్పుడప్పుడూ భయంకరంగా మేఘాలు వురుముతున్నాయి. క్షణకాలం మెరిసే మెరపులు దడ పుట్టిస్తున్నాయి. వసారా కింద అరుగుమీద పడుకొని వున్న నేను “అర్జుణా, ఫల్గుణా” అనుకుంటున్నా! లోపల మా నాన్న కాపలా గురించి బాధపడుతున్నాడు. ఆయనకు ఆ వర్షంలోనే కాపలా వేల్తానంటున్నా మా అమ్మ వెళ్ళొద్దంటోంది. వెళ్ళకపోతే ఆ వర్షంలో పందులు చేయగల భీభత్సం గురించీ, అన్ని రోజులూ బిడ్డలా కాపాడుకొన్న పంట పందుల పాలయితే తదనంతర పర్యవసానాల గురించీ అమ్మానాన్నలు వేదన పడుతున్నారు. వాళ్ళకూ నిద్ర రాలేదు, ఆ మాటలు వింటున్నందునా, వర్ష భీభత్సానికీ నాకూ నిద్ర రాలేదు.

ఏమి చేయాలో కర్తవ్యం భోధపడ్డట్టు ఓ గోనె సంచిని కప్పుకొని బయలుదేరాను ఆ వర్షం లోనే! చెబితే అమ్మ వెళ్ళ నివ్వదు. వెళ్ళకపోతే పంట పందులపాలవుతుంది. కనుక చెప్పకుండానే గోనె సంచీ కప్పుకొని పొలం వైపు సాగాను. చిమ్మ చీకటిలో అప్పుడప్పుడూ మెరిసే మెరుపుల్లోనే దారి కనిపిస్తోంది. మిగిలిన సమయమంతా తెలిసిన దారి అనే వుజ్జాయింపుతోనే నడక. వూరు దాటి వచ్చాక స్మశానం దగ్గరి నుండీ ఈత చెట్ల మద్య నుండీ నడుస్తుంటే నా నడకే నన్ను భయపెడుతోంది. నా అడుగుల శబ్దానికే నిమిశానికోసారి వెనుదిరిగి చూసుకుంటున్నా! ఎలాగయితేనేం పొలం చేరుకున్నా “హ్హు హ్హు” అని అరుస్తూ నా అరుపే నాకు రక్షలాగా అరుచుకుంటూ పొలమంతా తిరిగా! అక్కడక్కడా దూరంగా కొన్ని పొలాల రైతులు చేస్తున్న శబ్డాలు కూడా వినవస్తున్నాయి. అలా అరుస్తూ అరుస్తూ చుట్టూ తిరుగుతూ ఓపినంత సేపు వుండి తిరిగి వచ్చి ఎవరికీ తెలియకుండా అరుగుమీద పడుకొని నిద్రపోయా! మా అమ్మ తిడుతుందన్న భయంతో ఆ మరుసటి రోజు కూడా నేను ఇంట్లో చెప్పలేదు. ఆ తర్వాతెప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ వాళ్ళకు నా సాహస గాధ గురించి తెలీదు!
ఇప్పుడెందుకు ఈ సోదంటే… ఈ మద్య బ్లాగటం లేదు కాదా ఏదో బ్లాగుదా మనిపించింది. సరే ఈ విషయమేదో బ్లాగితే నా ధీరత్వము అందరికీ తెలుస్తుంది కదా అని బ్లాగేసా!

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'నా ధీరత్వము' పై 5 అభిప్రాయాలు

'నా ధీరత్వము'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. vijaya అభిప్రాయం,

  తేది: March 6, 2007 సమయము: 8:29 am

  మీ సాహసము తో పాటుగా చక్కని పంట పొలాలను,రైతు జీవితాలను కళ్ళకు కట్టారు. ఇలాటి అనుభవాలు మరిన్ని రాస్తే బాగుంటుంది.

 2. valluri అభిప్రాయం,

  తేది: March 6, 2007 సమయము: 1:06 pm

  మొత్తానికి ఆనాడు, ‘సాహసము శాయరా డింబకా!’ అనుకొని సాధించారు.


 3. తేది: March 6, 2007 సమయము: 1:57 pm

  [...] ‘పరుల కోసం పాటుబడని నరుని బ్రతుకు దేనికని?‘ అంటూ తన ‘అంతరంగం’లోని ఆలోచనలను మనకు ఆవిష్కృతం చేస్తూ ఆధ్యాత్మిక, మనోవైజ్ఞానిక విషయాలను తన బ్లాగులో పంచుకొనే ‘చరసాల ప్రసాద్’ గారి దాతృత్వాన్నే చూసిన మీరు ఇప్పుడు ఆయన ’ధీరత్వాన్ని‘ కూడా రుచి చూడండి. మాకున్న “గద్దగుండ్ల బావి” ఒక ఒయాసిస్సు! ఎంత కరువులోనైనా కనీసం రోజుకు మట్టు (నిలువెత్తు అనుకోవచ్చు) నీళ్ళు వూరుతుంది. కనీసం ఎకరా ఆరుదడి పంటకు ఆ నీళ్ళు సరిపోతాయి. అయితే ఆ బావికి మాతో పాటు ఇంకొకరికి కూడా భాగముంది. అంటే ఆ బావి నీళ్ళు తోడుకోవడానికి మాకు రోజుమార్చి రోజు హక్కుంటుంది.మా తాత, అమ్మ జీవితాలు.. మా బాల్య జీవితాలు ఈ బావితో ఎంతగా పెనవేసుకొన్నాయంటే, అదీ మా కుటుంబ సబ్యుడే అన్నంతగా! ఈ బావి గురించి మరోసారి చెప్పుకుందాం. [...]

 4. radhika అభిప్రాయం,

  తేది: March 6, 2007 సమయము: 7:52 pm

  ఆ వయసులోనే అలా చేసి ఆలోచనాపరులు,ధీరులు అనిపించుకున్నారు


 5. తేది: December 27, 2008 సమయము: 5:09 am

  [...] చూసిన మీర? ఇప?ప?డ? ఆయన ’ధీరత?వాన?ని‘ కూడా ర?చి చూడండి. మాక?న?న [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో