“నేను” అనగా…

తేది: February 21, 2007 వర్గం: ఆధ్యాత్మికం రచన: చరసాల 16,222 views

కాలేజీ రోజుల్లో ఎందుకో గానీ అధ్యాత్మిక ధ్యాస మరీ ఎక్కువై పోయింది. హైస్కూలు రోజుల్లోనే ఒకానొక క్రిస్టియన్ ఉపాధ్యాయుడు వల్ల బైబిల్ చదివే అవకాశం కలిగింది. చిన్నప్పుడు ఘంటసాల నోటినుండి వచ్చిన గీతే కాకుండా ఎవరెవరో రాసిన గీత వాఖ్యానాలు చదవడమూ అయ్యింది. ఇంచుమించు నాలుగవ తరగతిలో వున్నప్పుడే మా వూరి ఒక ముసలామె (రాసమ్మ గారామె) తన దగ్గర వున్న బ్రహ్మం గారి జీవిత చరిత్ర తెచ్చి నాతో చదివించుకొనేది. అందులో సిద్దయ్య వేసిన యోగాసన చిత్రాలు చూసి నేనూ అలా చేయడానికి ప్రయత్నించేవాన్ని.
ఇక కాలేజీ రోజుల్లో తెలుగులో వున్న ఖురాను దొరకబుచ్చుకోవడానికి నా ప్రయత్నం చాలానే చేశాను గానీ ఫలించలేదు. ఇప్పటికీ చదవాలన్న కోరిక వుంది. కానీ తెలుగులొ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. బ్రహ్మకుమారీ సమాజానికీ వెళ్ళాను. అక్కడ వారు దేవునికి రూపం కల్పించడం నాకు నచ్చలేదు. ఇక గణపతి సచ్చిదానంద సమావేశాలకు వెళ్ళాను. ఆయన చేసే యజ్ఞాలమీద నాకసలు నమ్మకం కలుగలేదు. ఎంతో భక్తితో మిత్రులతో కలిసి ప్రతి శనివారం సాయంత్రం వేంకటేశ్వరుని గుడికి వెళ్ళేవాన్ని..రాతి విగ్రహం కనిపించేదే గానీ, దేవుడు కనిపించేవాడు కాదు.

ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎందరి వుపన్యాసాలు విన్నా దేనిమీదా గురి కలగలేదు. కానీ, నిన్నా మొన్నటి వరకూ (నాలుగేళ్ళ క్రితం వరకూ) ఆత్మ, పరమాత్మ వున్నాయని నమ్మకముండేది. ఎంతు లోతుకు వెళ్ళినా “ఎలా” జరుగుతున్నదో చెప్పే సైన్సు, “ఎందుకు” జరుగుతుందో చెప్పలేక పోయినప్పుడు అదే పరమాత్మ లీల అనుకునే వాన్ని. అయితే ఒకానొక దుస్సంఘటన వల్ల నాలోని నమ్మకాలు పటాపంచలు అయ్యాయి. కొందరు సనాతన వాదులు, ఆస్తిక వాదులు ఏమంటారంటే అలాంటి దుర్ఘటనలు మనిషిని దేవుడిమీద నమ్మకాన్ని పోగొడతాయి అంటారు. అయితే కానివ్వు, చీకటిలో నడుస్తున్నప్పుడు కాలికి రాయి తగులుతుంది. అది తగిలినప్పుడే కదా అక్కడ రాయి వుందని భోధపడుతుంది? రాయి తగలడం వల్ల నిజం (జ్ఞానమ్) తెలుస్తుంటే రాయినెందుకు తప్పుపట్టాలి? నిజం అలా తెలుసుకోవడం బాధాకరమైందే అయినా లోపభూయిష్టమయిందైతే కాదు కదా? నాకూ ఈ ఆత్మ, పరమాత్మ, పూర్వ జన్మ, మలి జన్మ అన్న సిద్దాంతాలన్నీ కారుమబ్బుల్లా విడిపోయి స్పష్టంగా నిజం (సత్యం) (నేను నిజమనుకున్నది మీకు కాకపోవచ్చు) భోధపడింది. నేనీ సత్యాన్ని తెలుసుకోవడం నా సొంత జిజ్ఞాస ద్వారానే కానీ, హేతు వాద పుస్తకాలు గానీ, వాదనలు కానీ చదవడం వల్ల కాదు. అయితే ఈ మద్య కొడవగంటి రోహిణీ ప్రసాద్ బ్లాగు చూశాక నా నమ్మకానికి మరింత బలం వచ్చింది.

ఇంతకీ “నేను” అంటే ఎవరు? ఇదే ప్రశ్న ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు కుడా మొదటిరోజు అడిగారు. సనాతనుల దృష్టిలో “నేను” అంటే “ఆత్మ”. అది జరామరణములు లేనిది, ఆద్యంతాలు లేనిది. దాన్ని నీరు తడుప జాలదు, అగ్ని మండింపజాలదు. నేనూ దీనిని నమ్మేరోజులలో ఆలోచనలు, జాగృతి లాంటివి ఆత్మ కలుగజేస్తున్నది అనుకున్నాను. భయం, ప్రీతి ఇలాంటివివి మనసుకు అంటే ఆత్మకు సంబందించినవి అనుకున్నాను. ఆత్మకు, మనసుకు తేడా వుంటుందేమొ, అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మన ఆలోచనలు, చేష్టలు, అనుభవాలు అన్నీకూడా భౌతికమైన ఈ దేహానివే కానీ, ఆత్మ గీత్మ అనే మరో అభేద్యమయిన అర్థం కాని దానివి కాదు అని.

నాకీ మద్య ఎలాంటి విషాద వార్త చూసినా నా ప్రమేయం లేకుండానే కళ్ళంబట నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఒక పసివాడి గుండె రంధ్రాన్నో, దిక్కులేని ముసలమ్మ యాతనో చూస్తే ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఒక్కోసారి వెక్కిళ్ళు కూడా వస్తాయి (నమ్మండి నమ్మకపొండి నిజం). చిన్నప్పటినుండి నన్ను సున్నితమనస్కుడనే అంటారు కానీ ఇప్పటి సున్నితత్వం మరీ ఎక్కువగా వుందని అనిపించింది. దానికి తోడు బరువు తగ్గడం లాంటి సమస్యలుంటే ఏమవుతుందో నాకని డాక్టరు దగ్గరికెళ్ళా. తేలిందేమిటంటే నాకు థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్‌ను ఎక్కువగా విడుదల చేస్తున్నది. దానివల్ల మెటబాలిజం ఎక్కువయి బరువు తగ్గడం, స్నో పడుతున్న వేళలో కూడా చెమటలు రావడం … ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. థైరాయిడ్ ఎక్కువయితే కోపం, చిరాకు కూడా వుంటాయిట! ఎందుకో నాకు లేవు.

ఇప్పుడు నా అనుమానము ఏమిటంటే ఈ థైరాయిడ్ వల్ల నా హృదయం ద్రవించి నేనేదైయినా సహాయం చేస్తే ఆ పుణ్యం నా ఆత్మకు దక్కాలా? థైరాయిడ్ గ్రంధికి దక్కాలా? దాని ప్రభావం వల్ల కోపంలో నేను ఏదైనా చేయరాని పని చేస్తే ఆ కర్మఫలం నా ఆత్మనంటిపెట్టుకొని మరు జన్మకు ప్రయాణిస్తుందా? నా ఆత్మ ప్రమేయము లేకుండా నా దేహంలో జరుగుతున్న రసాయినక ద్రవాల వల్ల జరిగే అనర్థాలకు నేనెలా (నా ఆత్మ) కారణం? పుట్టిన బిడ్డమీద తల్లి చూపే అవ్యాజప్రేమకు, యువతీయువకుల మద్య జనించే వ్యామోహానికి కారణం దేహములోని కొన్ని రసాయనాల వల్ల అయితే, దేహాన్ని ఆశ్రయించుకొన్న ఆత్మకు ఏ విధంగా సంబందం?

ఇప్పుడు చెప్పండి నేనంటే నా దేహమా? నా ఆత్మా?

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'“నేను” అనగా…' పై 15 అభిప్రాయాలు

'“నేను” అనగా…'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. రాజేష్ గన్నారపు అభిప్రాయం,

  తేది: February 21, 2007 సమయము: 3:42 pm

  స్టేట్ సేంట్రల్ లైబ్రరీ (హైదరాబాద్) లొ ఖురాన్ (తెలుగు) దొరుకుతుంది.

 2. radhika అభిప్రాయం,

  తేది: February 21, 2007 సమయము: 4:46 pm

  ఆత్మ, పరమాత్మ వున్నాయని నమ్మకములేనప్పుడు ఏది దేనికి చెందుతుందన్న మీమా0స ఎందుకు?అయినా నిజ0 చెప్పొద్దు…నాకు కొ0త అర్ద0 కాలేదు.

 3. vijaya అభిప్రాయం,

  తేది: February 22, 2007 సమయము: 12:12 am

  మా నాన్న గారు చనిపోయినపుడు నాకు ఇలాగే అనిపించింది. ఆయన దేహం ఉన్నంత వరకు నాన్న, నాన్న అని కలవరించడం, నాన్న అంటే ఆ రూపాన్నే ఊహించుకోవడం. నిజంగా ఆయన ఆత్మ రూపంలో ప్రత్యక్షం ఐనా నాన్నగా అంగీకరించలేము. మా నాన్న పొయిన వెంటనె నాకు బాబు పుట్టాడు. అందరు మీ నాన్నే నీకు ఇలా పుట్టారే అని సంబర పడ్డారు. కానీ, నాన్న అంటే ఆకారం, రూపూ వేరు. ఆ అత్మ మా బాబులో నిజంగా ఉన్నా, నేను నాన్న అని అనుకోలేను కదా..అందుకనే నాకు కూడా మరీ లోతుగా ఆత్మా -గీత్మా అనుకోకుండా మనిషి అంటె…మనకి కనపడే రూపం అని మాత్రమే అనిపిస్తూ ఉంటుంది.

 4. simurgh అభిప్రాయం,

  తేది: February 22, 2007 సమయము: 2:07 am

  ప్రసాదు గారు
  ఇంగ్లీషులో కామెంటు రాద్దామంటీ కదరటం లేదు.

 5. Gowri Shankar అభిప్రాయం,

  తేది: February 22, 2007 సమయము: 5:04 am

  మీ ఆధ్యాత్మికఙ్ఞానం మిమ్మల్ని సంకటం లో పడేస్తోందేమోనంపిస్తోంది.ప్రస్థుతం జరిగేది,దానికి మీరు ఎంత చేయగలరో అంతే చెయ్యాగలరు.ఎదుటివారి కష్టాలకి,భాధలకి మీరు భాద్యులుకారు.దాని గూర్చిన ఆలోచనలు, ఊహాలు మిమ్మల్ని ఎక్కువ బలహీనున్ని చేస్తున్నాయి.ఇందులో నిజముందేమే చూడండి.

 6. jyothi అభిప్రాయం,

  తేది: February 22, 2007 సమయము: 5:51 am

  ప్రసాదుగారు మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు సందిగ్ధంలో పడేసుకుంటున్నారు. మీ ఆలోచనలకు థైరాయిడ్ సమస్యకు సంబంధం లేదు. అది వైద్యపరంగా నయమవుతుంది.నేనూ ఆ వ్యాధిగ్రస్థురాలినే ఒకప్పుడు..దేవుడు ఉన్నాడనుకుంటే ఉన్నాడు లేడనుకుంటే లేడు.మీరు అవసరమైన ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయండి. వాళ్ళు సంతోషిస్తే తృప్తి పడండి.ఎప్పుడూ నేటి గురించే ఆలోచించాలి రేపు ఉంటామో లేదో తెలీదూ.ఏమవుతుందో తెలీదూ.ఎందుకండి ఈ చిన్ని జీవితంలో ఇన్ని సందేహాలు?

 7. T.Bala Subrahmanyam అభిప్రాయం,

  తేది: February 23, 2007 సమయము: 1:59 pm

  ఎవరి మొహం వాళ్ళు చూసుకోవడం సాధ్యమైనప్పుడు, ఎవరికి వాళ్లు”నేనెవరు” అని ప్రశ్నించుకుని సరైన సమాధానాన్ని పొందడం కూడా సాధ్యమౌతుంది.

  మన తెలివితేటలు భాషతో ముడిపడినటువటివి. అవి పరిణామ స్వభావం గలవి.అంటే అనుభవాల నుంచి నేర్చుకోవడం ద్వారా ఏర్పడినటువంటివి. భాషతో సంబంధం లేని తెలివితేటలు గలవాడు అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేనివాడు ఒకడు ఉన్నాడు.వాణ్ణే మనం దేవుడంటున్నాం.వాణ్ణి ఎవరైనా చూపించాల్సిందే తప్ప మనంతట మనం తెలుసుకోగలగడం అసాధ్యం.అందుచేత ముందు వెతకాల్సింది దేవుణ్ణి కాదు.అలాంటి అన్వేషణ చరిత్రలో ఎప్పుడూ ఫలించలేదు.ఎందుకంటే ముందు వెతకాల్సింది ఆయన్ని చూపించగలవారిని.

  మనం మేధాశక్తిలో ఒక స్థాయికి చేరుకున్నాక “ఉన్నాడు” అన్నా తృప్తి కలగదు. “లేడు” అనుకున్నా తృప్తి కలగదు.

 8. Nagaraja అభిప్రాయం,

  తేది: February 24, 2007 సమయము: 1:54 am

  బాల సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. పదాల-రూపంలో కాకుండా అనుభవ-రూపంగా తెలుసుకోవాలనే ప్రయత్నం దీర్ఘకాలంగా ఉపయోగకరం అని నా నమ్మకం.

 9. swathi అభిప్రాయం,

  తేది: February 25, 2007 సమయము: 11:42 pm

  అదేనండి ఎప్పటికీ వీడని మిస్టరీ. అందుకే ఎంతో తెలుసుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా చివరికి కలడు కలండనెడు వాడు కలడో లేడొ అనే సందేహమ తోనే వెళ్ళిపోయారు. ఈ విషయమ లో ఎవరి అనుభవాలు, అభిప్రాయాలు వారివి. నాకు విసుగు కలిగి ఈభవ జీవితమ లో నేర్చుకోగలిగింది, చేయగలిగింది, పొందగలిగింది, ఇవ్వగలిగింది, ఆనందపడగలిగింది మాత్రమే నిజం ఇక వేరే అలోచన ఎందుకు అనే నిర్ణయానికి వచ్చాను.

 10. రానారె అభిప్రాయం,

  తేది: March 2, 2007 సమయము: 12:48 pm

  మీకు కలిగిన ఆలోచనలను ఇలా రాస్తూపోతే, మీకు ఎవరూ చెప్పనవసరం లేకుండానే మీరే ఒక నిర్ణయానికి రాగలరని నేననుకొటున్నాను.

 11. అజిత్ కుమార్ అభిప్రాయం,

  తేది: March 7, 2007 సమయము: 7:00 pm

  ప్రసాద్ గారు మీరు ఆత్మకోసం ఆధ్యాత్మికకేంద్రాలకే వెళ్ళారు.అక్కడ ఆత్మ లేదు అని తెలుస్తుందేమోనని వెతికినట్లు కనిపిస్తుంది.ప్రస్తుతం ఆత్మను గురించి మీకు తెల్సినంతవరకు మీ మనసులో ఆత్మ అంటే చాలా ఇష్టం ఉంది అని తెలుస్తుంది. ఎవరైనా మీకెంతో ఇష్టమైన ఆత్మ/దేవుడు గురించి సైన్సులోలాగా నిరూపించి చూపగల దివ్య పురుషుని కోసం ఇప్పటికీ వెతుకుతూ ఉన్నట్లు నేను అర్ధం చేసుకుంటున్నాను.మీకు కలిగిన స్వల్ప అస్వస్తత వల్ల మీ దైవభక్తి మరింత పెరుగుతుంది.మరొక్క రాయి తగిలితే ( క్షమించండి , తగలమని నేను కోరుకోవడంలేదు.)మీకు ఆ దైవం /ఆత్మ ప్రత్యక్షం కాగలదు.
  అలాకాదు నిజమైన నిజం /సైన్సు తెలుసుకోవాలనుకుంటే (భహుశా ఈ వయసులో కష్టమే. విద్య ద్వారా మన అభిప్రాయాలు మార్చుకోవచ్చు.మీకు అబ్బిన ఈ ఆత్మానురాగము విద్య ద్వారా మీకు(మనకు) తెలియకుండా పొందినదే.)శ్రీమతి రంగనాయకమ్మ గారి వంటి గురువును ఆశ్రయించండి. నేను కూడా వారి ఏకలవ్య శిష్యుడినే.వారు వ్రాసిన పుస్తకములు చదవండి.మార్పు విద్య ద్వారానే సాధ్యం.మీకు మతమౌఢ్యదృష్టి తొలగి , గతితార్కిక చారిత్రక భౌతికవాద ఆలోచన కలిగిన తర్వాత ఎన్ని రాళ్ళు తగిలినా తొణకరు.బెష్ట్ ఆఫ్ లక్.


 12. తేది: June 5, 2007 సమయము: 7:37 am

  [...] “నేను” అనగా… [...]

 13. Aruna Gosukonda అభిప్రాయం,

  తేది: August 21, 2007 సమయము: 8:57 am

  Good article Prasad garu.
  Try to read complete works of Swami vivekananda and the gospel of Sri Ramakrishna paramahamsa.
  In those books Sri Ramakrishna Paramahamsa resolved many such qns.

 14. ramasree అభిప్రాయం,

  తేది: November 28, 2008 సమయము: 4:23 am

  నేను అనగా మీ అన్ని అవస్తలలోనున్న్ సామాన్యమయిన (L.C. M) చైతన్యం. అది అందరికి ఒక్కటె.

 15. naresh అభిప్రాయం,

  తేది: June 21, 2011 సమయము: 2:44 am

  మీరు చెప్పిన ప్రకారమ్ ఒక వ్యక్తి హత్య చెస్తె సిక్ష ఆత్మ(మనసు,బుద్ధి) భరిస్తుంద సరీరము(దెహము) భరిస్తుంద? రెందు భరిస్తై. ఇది కూద అంతె.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో