ఇహలోక నరకం

తేది: February 1, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,752 views

నిన్నటి వార్తలైనా, ఈనాటి వార్తలైనా, రేపటి వార్తలైనా అందులో క్రమంగా తప్పకుండా వుంటున్నది ఇరాకీల మరణాలు. అది షియా కావచ్చు, సున్నీ కావచ్చు. చనిపోతున్నది మాత్రం ఒక అమ్మ, ఒక చెల్లి, తమ్ముడు, అన్న, అక్క.
ఈ దారుణ మారణ హోమం ఎవరు రగిల్చారన్నది ఇప్పుడంత ముఖ్యం కాదు, ఇప్పుడు దాన్నెలా ఆపాలన్నది అర్థం కాని ప్రశ్న. మంట పెట్టడం ఎంతో సుళువు. కానీ ఆర్పడం?
ఆర్పడమెలాగో తెలియక తల పట్టుకున్న భూషయ్యకి సరైన సలహాలు కాదు కదా, సహాయమూ అందటం లేదిప్పుడు. కొత్తగా 21000 మంది సైనికులని పంపుతాను అంటే డెమోక్రాట్లు మెజారిటీగా వున్న కాంగ్రెస్ ఒంటికాలిమీద లేస్తోంది. అయితే గియితే భవిష్యత్తులో అధ్యక్షురాలయ్యే హిల్లరీ కానీ మొరాకో ఒబామా కానీ దీనికి అంగీకరించడం లేదు.
ఇప్పుడు అమెరికా పరిస్థితి పీక్కోలేక, లాక్కోలేక అన్నట్లు వుంది. ఎందరికో నచ్చని అమెరికా ఇలాంటి పరిస్థితిలో వున్నందుకు ఎంతోమందికి ఆనందమేసినా, ఇరాకీ సమస్యకు పరిష్కారం ఆలోచించటంలేదు. చేయిచేసుకున్న వాడు బుష్ కదా మనకెందుకు వాడే పీక్కొని చస్తాడు అన్నట్లుంది చాలా మంది పరిస్థితి.
స్థానిక అరబ్ రాజకీయాల్లో సిరియాకు, ఇరాన్‌కు చాలా పాత్ర వుంది. వీటి వత్తాసు లేనిదే సున్నీలైనా షియాలైనా ఇంతగా బరితెగించడం సాద్యం కాదు. ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన అమెరికా ఇంకా సిరియాను, ఇరాన్‌ను భయపెట్టి పనులు చేపించుకోగల స్థితిలో లేదు. ఇప్పటికే బోనులో వున్న సింహాన్ని చూసి ఎలుక గెంతులేసినట్లు అమెదినెజాద్, కిం జాంగ్ ఎగురుతున్నారు. వారిని భయపెట్టే ఎత్తులు మాని ఇప్పటికైనా సామరస్యంగా ఇరాక్ విషయంలో ఇరాన్‌ని, సిరియాని అవసరమైన ఇతర పార్టీలను కలిపి చర్చలు జరపడం మేలు.
అమెరికా సైన్యాలని వెనక్కి పిలవాలంటున్న నేతలు పిలిస్తే ఆ తర్వాత ఇరాక్ పరిస్థితి ఏంటనేది వూహించడం లేదు. లక్షా ముప్పైవేల పైచిలుకు అమెరికా సైన్యాలు ఇంకా మిగతా మిత్రరాజ్య సైన్యాలు వుండగానే రోజుకిన్ని ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తుంటే అవి కాస్తా వెళ్ళిపోతే ఆ శూన్యతని ఎవరు భర్తీ చేస్తారు? కాంగ్రెసు మరింత సైన్యం పంపడం జాతీయ శ్రేయస్సు కాదంటోంది. అమెరికా జాతీయ శ్రేయస్సు సరే మరి ఇరాక్ శ్రేయస్సు సంగతేంటి?
ఇప్పటికే సున్నీ, షియాలుగా లోతుగా విడిపోయిన ఇరాకీలకు షియా బాహుళ్యమున్న ఇరాకీ సైన్యమ్మీద నమ్మకం లేదు. ఒక్కోచోట తమ భద్రత కోసం సున్నీలు అమెరికా సైన్యాన్నే వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎలా ఎప్పుడు మెరుగుపడుతుందో గానీ ఇది ఆరని గ్యాసు మంటలా తయారయింది.
ఒకరిని ఒకరు నిందించుకోవడం, సహాయ నిరాకరణ చేయటం మాని ఇరాక్‌ని మళ్ళీ మామూలు స్థితికి ఎలా తేవాలో అందరూ ఆలోచించాల్సిన సమయమిది.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'ఇహలోక నరకం' పై 4 అభిప్రాయాలు

'ఇహలోక నరకం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Sudheer Kothuri అభిప్రాయం,

  తేది: February 1, 2007 సమయము: 6:18 pm

  మంచి ఆలోచన…అమెరికా ఇరుక్కుపోయిందని సంబరపడేవారే కాని సమస్యను పరిష్కరిద్దామనే యోచన ఎవరికీ లేదనుకొంటా!

 2. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: February 2, 2007 సమయము: 1:53 pm

  ఇది చాలా మంచి ఆలోచన. తప్పెవరిదైనా ఇప్పుడు దేశాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది. ప్రతిపక్షాలు సమస్యను రాజకీయ లబ్దికోసము ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్లకూ చిత్తశుద్ధిలేదు. బూషయ్యకు సహాయము చేయము అన్నారు.. సరే మరి యుద్ధానికి పూర్తిగా నిధులు ఆపేస్తూ ఒక బిల్లు ప్రతిపాదించొచ్చుగా..లేదు హిల్లరీలకి, ఓబామలకీ అంత దమ్ము లేదు. ఊరకే వ్యవహారాన్ని ముందుకు వెళ్లకుండా.. వెనక్కి వెళ్లకుండా సాగదీస్తున్నారు. అందుకే అమెరికా సైన్యం కోసం, ఇరాకీ ప్రజలకోసం వీళ్లు కార్చేవి ముసలి కన్నీల్లే.

 3. raju అభిప్రాయం,

  తేది: February 6, 2007 సమయము: 10:47 am

  http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=1035

 4. Raju అభిప్రాయం,

  తేది: February 6, 2007 సమయము: 10:49 am

  please delete my comment after seeing the book libk u want

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో