అంతరిక్ష యుద్దాలు

తేది: January 19, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 1,662 views

కోల్డ్‌వార్ శకం ముగిసిందని సంబరపడుతున్న రోజులు ఎంతో కాలం వుండవేమొ! ఒక బాలిస్టిక్ క్షిపిణితో అంతరిక్షం లోని ఉపగ్రహాన్ని చైనా నాశనం చేసిందట! ఇది సహజంగానే అమెరికాను గగ్గోలు పెట్టించింది. ఈ వృత్తాంతమంతా చూస్తుంటే చిన్నపిల్లలు చదివే “స్నో వైట్” కథ గుర్తుకు వస్తుంది. అందులో “స్నో వైట్”గా పిలువబడే రాకుమార్తె సవితి తల్లి దగ్గర ఒక అద్దం వుంటుంది. అందులో అందరిలోకి అందగత్తె ఎవరన్నది తెలుస్తుంది. స్నో వైట్ తనకంటే అందగత్తెగా మారిందని తెలియగానే ఆమెను మట్టుబెట్టడానికి లేనిపోని మాయోపాయాలు ప్రయోగిస్తుంది సవితి తల్లి.
ఇప్పుడు అమెరికా పాట్లు అలాగే వున్నాయి. తనే ప్రపంచంలోకి బలవంతుడుగా ఎల్లకాలం వుండాలి, ఇంకొకడు ఎదుగుతున్నాడని తెలియగానే దాన్ని అంతం చేయడానికి అన్ని పన్నాగాలు పన్నుతుంది. అయితే ఒక నియంత ఏలుబడిలోని రాజ్యం ఇలాంటి ఎత్తులు వేస్తుందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ అతి పురాతనమైన  ఒక ప్రజాస్వామ్య రాజ్యం అలా చేస్తుందంటే నమ్మలేకపోయినా నమ్మాల్సిన నిజం!
గత ఏడాదే వండి వార్చిన తన రోదసీ విధానంలో “రోదసీలో తన హక్కులను, సంపత్తిని, తనకు నచ్చిన విధంగా ఉపయోగించుకునే తీరును” నిలబెట్టుకుంటూనే, “తన హక్కులకు భంగం కలిగే విధంగా గానీ, తనకు భవిష్యత్తులో పోటీగా ఎదురయ్యే విధానాలను నిరోధించే హక్కు” కూడా తనకే దఖలు పడిందని తనకు తనే రాసుకుంది.
ఇప్పటికే అమెరికా తన ఉపగ్రహాలని గూడచర్యానికి, లక్ష్యాలను గుర్తించడానికి, లక్ష్యంమీద దాడిని నిర్దేశించడానికి వాడుకుంటోంది. అలాంటపుడు ఇతరులకు అలాంటి ఉపగ్రహాలని నాశనం చేసే హక్కు ఎందుకు వుండగూడదనుకుంటుందో అర్థం కాదు. నా శత్రువు ఒక ఉపకరణాన్ని నా మీద దాడికి వుపయోగిస్తున్నపుడు నాకు దాన్ని నాశనం చేసే హక్కు తప్పకుండా వుండాలి. ఇప్పుడు చైనా సమకూర్చుకుంటున్న శక్తి అదే! దానికి మనం తప్పుబట్టాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే ఉపగ్రహాలను రక్షణావసరాలకు వాడుతున్న అమెరికానే అలాంటి అవసరాన్ని చైనాకు కలిగించిందని చెప్పాలి.
అయితే చైనా అవసరం ఎలాంటిదైనా, అందులో దాని తప్పొప్పులు ఎలా వున్నా ప్రజాబాహుళ్య శ్రేయస్సు దృష్ట్యా చూస్తే ఇది తప్పు. ఇప్పటికే చాలినన్ని కక్ష్యలు లేక, వున్న కక్ష్యల్లో చాలినంత స్థలం లేక అల్లాడుతుంటే వున్న క్షేమకరమైన స్థలాన్ని ఇలా పేల్చి వేసిన చెత్తాచెదారాలతో నింపేస్తే భవిష్యత్తులో శుక్రుడి చుట్టూ దుమ్ము వలయాలున్నట్లు భూమి చుట్టు కూడా ఏర్పడిపోతాయి. రోదసీలో తిరుగాడే అతి చిన్న దూళి రేణువు కూడా రోదసీ శకటాలకు, ఇతర వుపగ్రహాలకు హాని చేస్తాయి. పైగా ఒకడు చేశాడని ఇంకొకడు పోటీపడి ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే రోదసీ ప్రపంచపు భవిష్యత్తు శకలాల మయమై పోతుంది.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'అంతరిక్ష యుద్దాలు' పై 4 అభిప్రాయాలు

'అంతరిక్ష యుద్దాలు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. రానారె అభిప్రాయం,

  తేది: January 19, 2007 సమయము: 6:13 pm

  ఇంతకీ చైనా పేల్చింది చైనా ఉపగ్రహమే కదా, కొంపదీసి అమెరికాది కాదుకదా?


 2. తేది: January 20, 2007 సమయము: 2:07 am

  మీరే రెండు రకాల అభిప్రాయాలను తెలియజేసారు.

  ఏదేమైనా చైనా చేసింది,చేయాలనుకుంటున్నది సరైందే అని నాకనిపిస్తోంది. ఎందుకంటే ఆ దేశం తన ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆలోచిస్తున్నది కాబట్టి.మీరే చెప్పినట్టు శత్రువునెదుర్కొనే సామర్థ్యం పెంపొందించుకోవడం తప్పు కాదు కాబట్టి.

 3. Giri అభిప్రాయం,

  తేది: January 20, 2007 సమయము: 2:19 pm

  మీరు అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవస్తున్నాను. అమెరికాకి స్నో వైట్ సవతి మనస్తత్త్వము ఉండడం ఎంతకాలం గానో మనము చూసిన విషయమే అయినప్పటికి చైనా తన గొప్పదనము చూపెట్టుకోడానికి రోదసిని నాశనం చేయడం సబబు కాదు.

 4. త్రివిక్రమ్ అభిప్రాయం,

  తేది: January 23, 2007 సమయము: 12:00 am

  పిచుకంత పక్షి కూడా వేగంగా వెళ్ళే విమానానికి తగిలితే ప్రమాదకారణమౌతుంది. ఇక రోదసిలో ఇలా పేల్చివేయబడ్డ ఉపగ్రహాల శకలాలన్నీ చెల్లాచెదరుగా తిరుగుతూ ఉంటే ప్రయోజనకారులైన ఉపగ్రహాలకు ప్రమాదం. మనిషి తనచేతులు సాచినంతమేరా చెత్తకుప్పగా మార్చుకుంటూపోయే దురలవాటును మానుకోకపోతే మనిషి మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. అక్కరతీరిపోయిన ఉపగ్రహాలను పేల్చివేయకుండా స్పేస్ క్యాప్సూల్ రికవరీ ద్వారా భూమ్మీదకు తెచ్చుకునేటట్లైతేనే కొత్త ఉపగ్రహాలను ప్రయోగించేలా ప్రపంచదేశాలన్నీ నియమాలను ఏర్పరచుకుంటే బాగుంటుంది. ఇక తనకు హాని కలగజేసే ఉపగ్రహాన్ని పేల్చివేసే హక్కు ఏ దేశానికైనా ఉండవలసిందే. అలా పేల్చేసినప్పుడు ఆ చెత్తను (ఏరగలిగితే) ఏరవలసింది ఎవరు? అనేదింకొక ప్రశ్న. ఐతే “హక్కులన్నీ నావి – బాధ్యతలు నీవి” అనే ధోరణితో పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు మొదలుకొని ఇలాంటి అనేక విషయాల్లో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించేది అమెరికాయే.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో