To Make a Difference (MAD) ఏం చేస్తోంది?

తేది: January 16, 2007 వర్గం: సేవ రచన: charasala 2,124 views

గత సంవత్సరంలో తెలుగు బ్లాగుల పరిచయం ఓ వరమయితే, MAD పరిచయం, అందులో పాల్పంచుకునే భాగ్యం కలగడం మరో వరం.
అది మన వల్ల కాదు అనో, అది చేయాల్సింది మనం కాదు అనో, వ్యవస్థే అలా వుందనో నిట్టూరుస్తూ కూర్చోవడమో చేయకుండా, “నేనూ ఓ సమిధనవుతాను..” అంటూ ప్రతి ఒక్కరూ చేయివేస్తే అది తప్పకుండా Make a Differece.
కొత్త సంవత్సరం ఏ పార్టీ ఎలా చేయాలి? ఎవరెవరిని పిలవాలి? ఏఏ వంటలు తినాలి? ఏ సినిమాకు వెళ్ళాలి అనే ప్రశ్నలు వేసుకోకుండా MAD సభ్యులు చలికి రోడ్లపక్కన కప్పుకోవడానికి కూడాలేకుండా వున్న నిరుపేదలకు ఏమి చేయగలం అని ఆలోచించారు. కొత్త సంవత్సరపు తొలిరోజుని పొద్దు పొడవక ముందే దుప్పట్ల పంపిణీతో ప్రారంబించారు.

కొన్ని దుప్పట్ల పంపిణీ ఫోటోలు

అసలైన హీరో
అసలైన హీరో
అసలైన హీరో
అసలైన హీరో
మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

మొదటి విడతలో వచ్చిన అనూహ్య స్పందనకు, బాధితుల అగచాట్లకు స్పందించి మరో విడత పంపిణీకి సిద్దమవుతున్నారు.
కడపలో ఒక సామాన్యుడి మూడునెలల బాబుకి అసామాన్యమైన జబ్బు వచ్చిందని ఈనాడు ద్వారా తెలుసుకొని, ఆ ఇంటిలో బాదను తనింటిలో బాదగా చూసుకొని మీకు మేమున్నాం అంటూ ముందుకురికారు. బాబు తల్లిదండ్రులను బెంగళూరులో రిసీవ్ చేసుకొనే దగ్గర నుండీ, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ తో మాట్ళాడే వరకూ, బాబు తల్లిదండ్రులకు వసతి కల్పించే దగ్గరినుండీ, వివిధ స్వచ్చంద సంస్థలతో మాట్లాడి కావలిసిన ఆర్థిక వనరులు సమకూర్చడం దగ్గర వరకూ ఒక్కొక్క సభ్యుడూ/సభ్యురాలు అవిరామర కృషి చేశారు.
ప్రస్తుతం ఆ మూడునెలల బాబు శస్త్ర చికిత్స అనంతరం ICUలో కోలుకుంటున్నాడు. 

సామాన్యుల ఇళ్ళల్లో MAD పూయిస్తున్న ఈ పూలు మరింతమందికి ఉత్ప్రేరకము అవ్వాలని, MADకు మరింత మందిని ఆదుకొనే శక్తి కలగాలని కోరుకుంటూ..

(మీకూ ఆసక్తిగా వుందా? అయితే ఆలస్యమెందుకు? MADలో చేరండి.)

Subscribe to tomakeadifference

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'To Make a Difference (MAD) ఏం చేస్తోంది?' పై 7 అభిప్రాయాలు

'To Make a Difference (MAD) ఏం చేస్తోంది?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.


  1. తేది: January 16, 2007 సమయము: 6:19 pm

    ఎంత మంచి ప్రయత్నం! నేను ఇప్పుడే చేరానండీ.ఇలాంటి మంచి సంస్థను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  2. రానారె అభిప్రాయం,

    తేది: January 16, 2007 సమయము: 8:40 pm

    నేను సైతం.

  3. Skindia అభిప్రాయం,

    తేది: January 17, 2007 సమయము: 12:11 am

    చాలా మంచి ప్రయత్నం.ఉబుసు పోని కబుర్లతో కాలక్షేపం ఎంత సేపు ఐనా చేస్తాం కాని తిండి లేని కటిక దరిద్రులు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు, వారి గురించి ఒక్క క్షణం ఆలోచించటానికి టైం ఉండదు.అందరినీ ఉద్ద్రరించటానికి మనం మహాత్ముడే కానవసరం లేదు.
    నేను సైతం అంటూ ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతినివ్వగలిగితే చాలు.

  4. venkataramana అభిప్రాయం,

    తేది: January 18, 2007 సమయము: 12:33 pm

    చాలా మంచి ప్రయత్నము. అందరము ముందుకు కలిసి సాగుదాం.

  5. charasala అభిప్రాయం,

    తేది: January 18, 2007 సమయము: 5:48 pm

    స్పందించిన మీ అందరి హృదయాలకు నమస్సుమాంజలులు!

    –ప్రసాద్

  6. త్రివిక్రమ్ అభిప్రాయం,

    తేది: January 23, 2007 సమయము: 12:26 am

    నేను కూడా MADలో చేరాను – మీరు చేరాకే. ఐతే ఇప్పటివరకూ ఒక సమావేశంలో పాల్గొనడం తప్ప ఏమీ చెయ్యలేదు. ఇక నుంచైనా కాస్త చురుగ్గా పాల్గొనాలి.


  7. తేది: June 26, 2007 సమయము: 3:01 pm

    [...] To Make a Difference (MAD) ఏం చేస్తోంది? [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో