నా పూర్వపు రాతలు

తేది: January 18, 2007 వర్గం: కవితలు రచన: చరసాల 2,792 views

ఇవి నా కాలేజీ జీవితానంతరంలో రాసుకొన్న పిచ్చి రాతలు. జారిపోతాయేమొనని ఇక్కడ భద్రపరుస్తున్నా!
********
ఎండిపోయిన
ఎడారిలో
తొలకరి జల్లు కురిపించు
జవ్వని ఎవ్వరో…

***

నీ
పై పెదవి ఇంద్రధనుస్సుకున్న
క్రింది పెదవి నారిని
నా నాలిక భాణంతో
మీటేదెన్నడు నారీ…

***

నీ అద్బుతపాదాలనంటుకొని రాలిపోయిన దుమ్ము కూడా ప్రకాశవంతమే.
నీ వెలుగు చిమ్మే కళ్ళల్లోకి నే చూడలేక వంగి నిలుచుంటాను.
కానీ… విచిత్రంగా నీ పాదాలు నన్ను పలుకరిస్తాయి, నన్ను నిలువరిస్తాయి…
చివరికి స్వప్నంలో కూడా నన్ను చూడవస్తాయి.

***

నీ
చక్కని చల్లని
చేతి స్పర్ష
కమ్మగా నైనా
కఠినంగానైనా
కలలో నైనా
నా చెంపను తాకితే..
ఊహకు అందని ఆ అనుభూతిని
ఏమని వర్ణించను..

***

ఊపిరి తీయకుండా
ఆగగలను క్షణమైనా
ఆగలేను నీ తలపులు లేక

***

నాలోని హృదయం నాదా నీదా
అని సందేహమొచ్చింది
ఎందుకంటే..
అది నాకంటే నీగురించే ఎక్కువ ఆలోచిస్తోందే..

***

నా హృదయాన్ని
దారానికి గుచ్చి
వెతుకుతున్నాను,
నిన్ను అలంకరిద్దామని..
ఎంతకూ కనిపించవేం?

***

సాయంత్రవేళ సముద్రఘోష
పౌర్ణమినాటి పండువెన్నెల
నది ఒడ్డున ఇసుకతిన్నె
నిన్నె గుర్తుకు తెస్తున్నాయి
నీ చెలి ఎప్పుడొస్తుందని
నన్ను అడుగుతున్నాయి

***

సామ్రాజ్యాధిపత్యమా
నీ చెలి సాంగత్యమా
అంటే
నా చెలి సాంగత్యమే
నాకు మక్కువంటాను!

***

ఒంటరివాడనని
వెక్కిరించే
ఓ పిల్ల తిమ్మెరా?
నా ఊపిరినిండా
వూహలనిండా
నా చెలేనన్న సంగతి
తెలియదా?

***

రక్త మాంసాదులతో
ఏర్పడిన దేహం నీదంటే
నేనొప్పుకోను
నీ రక్తంలో అమృతాన్ని
నీ కళ్ళల్లో వెన్నెల గుళికనీ
నింపి వుంటాడు
ఆ బ్రహ్మ!

***

ఓ నెచ్చలీ
నీ వెచ్చని ఆలోచనలతో
నిద్రే రాకున్నది
నీ వెచ్చని కౌగిలిలోనూ
నిద్రరాదు…ఊసులు తప్ప.

***

నేను పుట్టిన వెంటనే
నువ్వు కావాలని ఏడ్చాను
నిన్ను పలకరించాలని మాటలు నేర్చాను
నీకు వ్రాయటానికై వ్రాత నేర్చాను
సూర్యున్ని దివిటీగా
పట్టుకొని
ప్రతిరోజూ నిన్నె వెతుకుతున్నా
పాతిక వసంతాలు
గడిచినా
నీ జాడ లేదు.

***

గల గల పారే సెలయేరు
కిలకిలా రావాల కోయిల
పచ్చని పైరుపంటలు
అన్నీ సింగారించుకొని వచ్చాయి..
సఖీ! ఇక నీదే ఆలస్యం.

***

నా సుఖమూ,
సంతోషమూ,
సఫలత్వమూ,
అన్నింటిలోనూ అసంపూర్ణతే
నీవు లేక, నా జీవితమూ
నేనూ కూడా అసంపూర్ణమే.

***

నేను మూగవానిగా
చెవిటివానిగా
గుడ్డివానిగా అయినా
జీవించగలను…
కానీ
నీ ప్రేమరహితంగా జీవించలేను.

***

ప్రియా!
నీకు తెలిసినా
తెలియకున్నా
నాకు తెలుసు…
నీవు పీల్చి వదిలిన గాలినే
నేనూ పీలుస్తున్నాను గనుక
బ్రతికి వున్నానని.

***

దేవుడు ప్రత్యక్షమై
మూడు వరాలు
కోరుకొమ్మంటే
ప్రేమ
ప్రేమ
ప్రేమ
కావాలంటాను.

***

తల్లి వాత్సల్యాన్ని,
చెల్లి అనురాగాన్ని,
అక్క ఆప్యాయతనీ,
రంభ సౌఖ్యాన్నీ..
ఈ ప్రపంచంలోని
సమస్త సుఖాలనీ ఒక్క
నీనుండే జుర్రుకోగలను ప్రియా!

***

నీకోసం మళ్ళీ మళ్ళీ
మానవునిగానే కాదు
పేడా పురుగుగానైనా
జనిమించగలను,
నాకు తోడుగా నీవు నిలిస్తే.

***

ప్రియా,
నీవూ, నేనూ వేరంటారు
మూర్ఖులు.
కాదు, ఒకే ఆత్మ రెండు ముక్కలుగా
నీలో నాలో వుండబట్టి,
ఒకే దేహం నీ, నా గా విడిపోబట్టి కదా..
నీ,నా ఆత్మలు, దేహాలూ
ఒక్కటవడానికి సదా ఇంత
ఆరాటపడుతున్నాయి.

***

ఓ చెలీ!
నీ వాక్కులే నాకు వేద వాక్కులు
నీ దర్షనమే దైవ దర్షనం
నీ చుంబనమే అమృత సేవనం
నీ సాంగత్యమే స్వర్గ సుఖం
నీ సేవయే నాకు దైవ సేవ!

***

ఏ ఒడిలోనూ
బడిలోనూ
గుడిలోనూ
పొందలేని సౌఖ్యాన్ని
ఇవ్వగల నీకు
ఏ దేవత సాటి రాగలదు?

***

ఓ సఖీ!
నా దేహంలో ప్రాణం నీవు
నా వాక్కులో భావం నీవు
నా పాటకు పల్లవి నీవు
నా జీవిత పరమార్థం నీవు!

***

ప్రేమ తంత్రుల వీణ
నా మనసు
దానిపై రాగాలు పలికించు
కొనగోరు నీవు!

***

ఒక్క క్షణమైనా
నీ సాహచర్యం
నాకు లభిస్తుందంటే
ఈ కంటకప్రాయమైన
మానవ జన్మలను
ఎన్నైనా ఎత్తుతాను!

***

నీ కళ్ళు కురిపించు
ప్రేమధారలలో
మునిగి వుక్కిరిబిక్కిరి
అవుతున్నాను
ప్రియా!
నన్ను అక్కున చేర్చుకొని
రక్షించవా!

***

నీ చూపుల గాలం
నా హృదయాన్ని
గాయం చేస్తోంది
తీసుకో నా హృదయాన్ని
నీ వలపుల బుట్టలో వేసుకో!

***

ప్రియా!
నీవు లేక అష్టైశ్వర్యాలూ
త్యజిస్తాను
నీ సన్నిధిలో చావునైనా
చిరునవ్వుతో ఆహ్వానిస్తాను.

***

నీ వూహలతో
బరువెక్కిన కాలం
కదలడం లేదు
నిన్ను పొందాలన్న
బలమైన కాంక్ష
నన్ను ఊపిరి సలపనివ్వడం లేదు.

***

నిన్ను చూడటానికి కళ్ళు
నిన్ను చేరడానికి కాళ్ళు
నిన్ను వేడుకోవడానికి నోరు
వున్నా
ఏమీ చేయజాలని
నా నిస్సహాయ జీవితం కంటే
రోజూ నీ అందమైన
పాదాలనంటి పెట్టుకొని
తిరుగుతున్న
నీ పాదరక్షల జీవితం
ఎంత గొప్పదో కదా!

***

నీ ముంగురులతో ఆడుకొనే దువ్వెన
నీ వంటిపై నర్తించే సబ్బుబుళ్ళ
నీ పాదాలనంటిపెట్టుకొని వుండే
పాదరక్షల కన్నా
పవిత్ర వస్తువులు
ఈలోకంలో మరేం వున్నాయి?

***

బస్సు గురించో, దారి గురించో
ఆట గురించో, పాట గురించో
పువ్వు గురించో, నవ్వు గురించో
ఆలోచిస్తావు గానీ
నా గురించి ఒక్క సెకనులో
వేయ్యోవంతు ఆలోచించినా
చాలదా ఈ జన్మ సార్థకం అవడానికి?

***

నల్లని మబ్బుల మాటున
దాగిన జాబిల్లీ
వెన్నెల కురిపించు నీ కన్నులు
నీ వునికిని నా కెరుక
పరుస్తున్నాయిలే!

***

ఏ గుడిలోనూ కనిపించని
ఏ దేవతవు నీవు?
ఏమని మొక్కిన
కటాక్షించదవు?

***

ఈ రోజు బస్టాపులో
నిన్ను చూశాను
నీవు విసిరిన వలపు చూపులో
చిక్కుకొని నేను విలపిస్తుండగా
బస్సెల్లిపోయింది
అందులో నీవూ వెళ్ళిపోయావు
నేను మాత్రం బస్టాపులో మిగిలిపోయాను.

***

నా హృదయ మైదానాన్ని
చదును చేసి వుంచుకొన్నాను
నా మనసు కోయిల
వసంతరాగాన్ని ఆలపిస్తూనే వుంది
ప్రేమ పన్నీటి జల్లు
కురిపిస్తూనే వుంది
అయినా…
ఆ మొక్క పూయదేమిటి?
ఈ గులాబీ విరబూయదేమిటి?

***

ప్రేమ ఫలము యొక్క
మధుర రసము గ్రోలాలని ఆస!
కానీ…
ఇంకా చెట్టే కనిపించదే,
ఫలమెప్పుడు దొరికేను?

***

నీ ముద్దొచ్చే పెదవులనీ, బుగ్గలనీ
సూరీడు తన కిరణ బాహువులతో
ఎంత తన్మయంగా తడుముతున్నాడో చూడు!
గాలి తనేమీ తక్కువ తినలేదని
నీ ముంగురులు సవరించి,
చున్నీ లాగుతూ పరాచికాలాడుతోంది!

***

ప్రియా!
వుదయమే నీవు చూసిన ఆచూపు
నన్ను రోజంతా చైతన్యంగా
వుంచిందే…
ఇక నాతో కలిసి నీవు నడిస్తే
ఇంకో పది జన్మల భారాన్నైనా
అవలీలగా మోయలేనా!

***

పల్లవి లేని పాటను నేను
రాగం లేని గీతం నేను
కొమ్మలు లేని మోడును నేణు
వసంతం లేని కాలం నేను
చంద్రిక లేని గగనం నేను
నూవు లేని నేను నేను.

***

ఆనందమున్న చోట దఃఖము
ప్రేమ వున్న చోట ద్వేషమూ
పుడతాయట!
అందుకే నిన్ను ప్రేమించాలన్నా
భయంగా వుంది!

***

ఓ అందమా!
నీ చెంప ఆ చెవిపోగుకు
అందాన్ని తెచ్చింది
నీ పాదం ఆ కాలి అందెకు
మెరుగునిచ్చింది
నిన్ను మోస్తున్నందుకు
బస్సు చూడు
ఎంత విజయగర్వంతో
పరుగెడుతోందో!

***

ప్రియా!
నాకు మోహం లేదు
కామం లేదు
కోరిక అసలే లేదు…
నీ మోము లోకి చూస్తూ
కాలం గడపాలన్న
కాంక్ష తప్ప!

***

రోజూ ఎదో వ్రాస్తున్నాను
నీ మీది ప్రేమను
ఇంతకంటే ఎక్కువగా
తెలియజేయలేకున్నాననే బాధ
నన్ను పీడిస్తోంది.
ఎలా వ్రాసినా అవి నన్ను
వెక్కిరిస్తూ చూస్తున్నాయి.

***

ఈరోజు ఒక విషయం
నన్ను ఏద్చేలా చేసింది
నీకేదో కస్టం కలిగినట్లుగా
నేణు తల్లడిల్లి పోయాను
నీతో చెబితే
నన్ను పిచ్చివాడిగా
చూస్తావేమొ!

***

ఓ నిర్దాక్షణ్య కాలమా!
ఎన్నాళ్ళిలా ప్రేమ ఱంపముతో కోసి
నా హృదయాన్ని గాయపరుస్తావు?
ఎన్నాళ్ళీలా ఒంటరి గానాన్ని
ఆలపించమంటావు?
ఇక నా వల్ల గాదు.

***

నీ సందర్యాన్ని నా రెండు కళ్ళతో
అంచనా వేయాలని చూస్తూ
ఈ ప్రేమగానాన్ని నా నోటొతో
పాడటానికి ప్రయత్నిస్తూ
నిన్ను కీర్తించడానికి
పదాల కోసం వెతుక్కుంటూ…
ఎంత అల్ప ప్రయత్నం చేస్తూ వున్నాను
అనంతమైన సౌందర్యాన్ని
అల్పమైన మాటలతో వ్యక్తం చేయాలని
వ్యర్థ ప్రయత్నం చేస్తూ…

***

నా హృదయం ఎక్కడ పోయిందని
ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను
ఇప్పుడు తెలిసింది
నీవే నా హృదయమని.

***

నా హృదయం
నీచే దొంగిలింపబడాలని కోరుకుంటాను
నీ హృదయాన్ని
నేను గెలవాలని కోరుకుంటాను.

***

నిన్ను చూస్తున్నంత సేపూ
సుమధుర సంగీతం
వింటున్నట్లుగా
గాలి మేఘాలపై
విహరిస్తున్నట్లుగా
నిన్ను చూడనంతసేపూ
చీకటిలో, చిట్టడవిలో
దారికోసం తడుముకుంటున్నట్లూ
వుంటుందేందుకనో!

***

నా కళ్ళు ఏమని భాషిస్తున్నాయో
నీకే తెలుసు?
నీ కళ్ళనడుగు.
నా హృదయం నీకెంత సన్నిహితమో
నీకేం తెలుసు?
నీ హృదయాన్నడుగు.

***

నీ చూపుల గాలులతో
నా హృదయ సంద్రంలో
తుఫాను రేపకు,
నన్ను గాయ పర్చకు.

***

ఈ చీకటితో నెయ్యం
నే చేయలేను చెలీ!
నీవు మోసుకొచ్చే
అమృతభాండము కొరకు
ఎన్ని చీకటి రాత్రులు
ఎదురుచూస్తూ గడపను?

***
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 1.00)
Loading ... Loading ...

'నా పూర్వపు రాతలు' పై 15 అభిప్రాయాలు

'నా పూర్వపు రాతలు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. jyothi అభిప్రాయం,

  తేది: January 18, 2007 సమయము: 9:05 pm

  అద్భుతమండి ప్రసాదుగారు, ఇంతకీ ఆ కలలరాణి ఎవరండి. ఈ కవితలన్నీ మీ ఆవిడని చదవనీయకండి. జాగ్రత్త.చిక్కుల్లో పడతారు.

 2. vihaari అభిప్రాయం,

  తేది: January 18, 2007 సమయము: 9:40 pm

  అమ్మో ఇంత పెద్ద కవిత రాశారా?

  మీకూ మీ భావుకత కు జోహార్లు.
  మనసులో ఉన్న వన్నీ ఒక్క సారిగ బయట పెట్టేశారు.

  విహారి

 3. swathi అభిప్రాయం,

  తేది: January 19, 2007 సమయము: 2:21 am

  అలా జరిగిందన్నమాట. రోజు వారి ప్రేమ మొత్తాన్నీ రాసేసినట్టున్నారు. నిజం చెప్పండి అసలేంటి సంగతి..
  అన్నట్టు కొన్ని చోట్ల చలం ప్రేమ లేఖల్లా అనిపించింది.
  బాగున్నాయి.
  ఇలాంటి రహస్యాలు ఇంకా ఏవైనా ఉంటే బయటపెట్టండి.

 4. charasala అభిప్రాయం,

  తేది: January 19, 2007 సమయము: 9:57 am

  జ్యోతి గారూ,
  ఎవరూ లేరండీ. నా పెళ్ళికి ముందు ఓ కలల రాణికోసం కలగన్న రోజుల్లూ రాసుకొన్న రాతలివి.
  మా ఆవిడకే ఇవి మొదట చూపించాను.

  విహారీ,
  ఇంత పెద్ద కవిత ఒకసారి రాసింది కాదండి. హైదరాబాదులో తిరుగుతున్న రోజుల్లో ఒక్కోటి (చుక్కల మద్య వున్న) ఒక్కోరోజు రాసింది. ఇప్పుడా బావుకతా లేదు, బయట పెట్టడామూ లేదు.

  స్వాతి గారూ,
  అవునండీ అది రోజువారీ స్పందన. ఒక్కో రోజు కలిగిన ఒక్కో స్పందనని ఏరోజుకారోజు అలా రికార్డు చేశాను. చలం ప్రేమ లేఖలు, రవీంద్రుడి గీతాంజలి చదివి వుండడం వల్ల అవి అక్కడక్కడా అలా బయటికొచ్చాయి.

  –ప్రసాద్

 5. Sudheer Kothuri అభిప్రాయం,

  తేది: January 19, 2007 సమయము: 3:15 pm

  గురువుగారూ! కాలేజీ జీవితానంతరం అన్నారేంటి? కాలేజీలో ఉన్నపుడు ఎవరినయినా మిస్ అయ్యారా? ఎదేమైనా అదరగొట్టారు! చాలా బావున్నాయి మీ దిన దిన స్పందనలు!

 6. charasala అభిప్రాయం,

  తేది: January 19, 2007 సమయము: 3:49 pm

  సుధీర్ గారూ,
  కాలేజీ రోజుల్లో స్పందనలూ రాశాను కానీ ఇప్పుడెక్కడున్నాయో కనపడటం లేదు. ఇవి మాత్రం ఆ తర్వాత హైదరాబాద్ లో వుద్యోగం చేస్తున్న రోజుల్లో రాసినవి.
  ఎవరినీ ఎప్పుడూ మిస్ కాలేదు! ప్రేమించే, ప్రేమించబడే గొప్ప వరాలు నాకు అనుగ్రహింపబడలేదు!
  –ప్రసాద్
  http://blog.charasala.com

 7. radhika అభిప్రాయం,

  తేది: January 19, 2007 సమయము: 5:11 pm

  చాలా బాగున్నాయండి.కాలేజి రోజుల్లో అందరి ఊహలు ఒకేల వుంటాయన్న మాట.ఎలా అన్నా..అప్పటి కవిత్వం లో ఫీల్ కనిపించేస్తూ వుంటుంది.ఆ జ్ఞాపకాలన్ని ఇక్కడ దాచుకుని మంచిపని చేసారు.
  “కానీ… విచిత్రంగా నీ పాదాలు నన్ను పలుకరిస్తాయి, నన్ను నిలువరిస్తాయి…
  చివరికి స్వప్నంలో కూడా నన్ను చూడవస్తాయి”
  ఎంత అందమయిన భావం ఇది.
  “ఒంటరివాడనని
  వెక్కిరించే
  ఓ పిల్ల తిమ్మెరా?
  నా ఊపిరినిండా
  వూహలనిండా
  నా చెలేనన్న సంగతి
  తెలియదా”…..అంటున్నప్పుడు గానీ……..
  “నా సుఖమూ,
  సంతోషమూ,
  సఫలత్వమూ,
  అన్నింటిలోనూ అసంపూర్ణతే
  నీవు లేక, నా జీవితమూ
  నేనూ కూడా అసంపూర్ణమే”…..అంటున్నాప్పుడు గానీ
  ఎంత నిజాయితీ కనిపిస్తుందో పదాలలో.మనుసులే కాదు,కొన్ని పదాలూ ,వాక్య నిర్మాణం కూడా నిజాయితీని చూపిస్తాయన్న మాట.
  “నీ వూహలతో
  బరువెక్కిన కాలం
  కదలడం లేదు
  నిన్ను పొందాలన్న
  బలమైన కాంక్ష
  నన్ను ఊపిరి సలపనివ్వడం లేదు.”

  మరో అందమయిన విరహ భావన.

  “నల్లని మబ్బుల మాటున
  దాగిన జాబిల్లీ
  వెన్నెల కురిపించు నీ కన్నులు
  నీ వునికిని నా కెరుక
  పరుస్తున్నాయిలే!”

  ఎంతానందం కనిపిస్తుందో ఈ బుజ్జి కవితలో

  “నా హృదయ మైదానాన్ని
  ……….
  ఆ మొక్క పూయదేమిటి?
  ఈ గులాబీ విరబూయదేమిటి”

  చివరి రెండు వాక్యాలు చాలా నచ్చాయి నాకు.
  ఇంకో పది జన్మల భారాన్నైనా
  అవలీలగా మోయలేనా!……ఇది అసలయిన ఆణిముత్యం.
  “రోజూ ఎదో వ్రాస్తున్నాను
  నీ మీది ప్రేమను
  ఇంతకంటే ఎక్కువగా
  తెలియజేయలేకున్నాననే బాధ
  నన్ను పీడిస్తోంది.
  ఎలా వ్రాసినా అవి నన్ను
  వెక్కిరిస్తూ చూస్తున్నాయి”
  మొత్తం మీ కవితల్లో నాకు చాలా చాలా నచ్చిన కవిత.చిన్న పదాలలో ఎంత అద్భుతం గా వివరించారో?


 8. తేది: January 20, 2007 సమయము: 1:55 am

  ఎంత బాగున్నాయండీ మీ కవితలు… యిదంతా మీరు కాలేజీ (తర్వాతి) రోజుల్లో రాసిన ప్రేమ కవిత్వమైనా వీటిల్లో పరిణితి కనిపించింది.
  నాకైతే అన్నింటికన్నా “నీ పాదాలు నన్ను పలుకరిస్తాయి” అన్న భావన అద్భుతంగా తోచింది.


 9. తేది: January 20, 2007 సమయము: 3:07 pm

  అధ్బుతంగా రాసారు. మీ ఆలోచనలు బాగా వ్యక్తపరిచారు.

 10. దిలీప్ అభిప్రాయం,

  తేది: January 21, 2007 సమయము: 4:51 pm

  హ హ నీవు డిప్లమొ చదువుతున్నప్పుడు వ్రాసుకున్న ఒక కవితల డైరి నెను దాచాను. కాని అది మన ఇంట్లొ చెదులు తిన్నది, అంతగా పాడవలెదనుకుంటా నెను అన్నకు చెపుతాను పొస్ట్ చెయమని.

  దిలీప్.

 11. charasala అభిప్రాయం,

  తేది: January 22, 2007 సమయము: 3:40 pm

  రాధిక గారూ,
  నా రాతలు మీకు నచ్చినందుకు ధన్యున్ని.
  “కానీ… విచిత్రంగా నీ పాదాలు నన్ను పలుకరిస్తాయి, నన్ను నిలువరిస్తాయి…
  చివరికి స్వప్నంలో కూడా నన్ను చూడవస్తాయి”
  – అమ్మాయిల మొహంలోకి చూడాలంటే చచ్చేంత సిగ్గుండేది. పరిచయమైన అమ్మాయిలతో మాట్లాడ్డానికి సంకోచముండేది కాదు గానీ, అందమైన అపరిచిత ముఖాలని చూడాలనిపించినా చూడటానికి ఏదో అడ్డొచ్చేది. అప్పుడు కిందికి వంచుకొన్న నాకు కనిపించేది పాదాలే! అవి ఆత్మీయంగా మాట్లాడుతున్నట్లనిపించేది. వాటివైపు చూడటానికి బెరకు వుండేది కాదు. అలా పుట్టాయి ఆ లైన్లు.
  “నల్లని మబ్బుల మాటున
  దాగిన జాబిల్లీ
  వెన్నెల కురిపించు నీ కన్నులు
  నీ వునికిని నా కెరుక
  పరుస్తున్నాయిలే!”
  – ఇది రాసిందెందుకో నాకు బాగా గుర్తు. హైదరాబాదులో ఒకసారి బురఖా వేసుకున్న (కళ్ళు మాత్రమే కనిపించేలా) అమ్మాయిని చూశాను. ఆమె కళ్ళ సోయగమే చెబుతోంది అమెంత అందమయిందో! ఇక్కడ “నీ వునికిని” అనకుండా “నీ అందాన్ని” అనుంటే బాగుండెదేమొ!

  కేశవాచారి గారూ,
  మీక్కూడా “నీ పాదాలు నన్ను పలుకరిస్తాయి..” నచ్చినందుకు ధన్యున్ని.

  మా తమ్ముడు దిలీప్ అప్పటి నా రాతలు ఇంటిదగ్గరెక్కడో వున్నాయంటున్నాడు. అవి దొరికితే బ్లాగిస్తాను.

  –ప్రసాద్

 12. త్రివిక్రమ్ అభిప్రాయం,

  తేది: January 23, 2007 సమయము: 12:10 am

  బాబోయ్! ఒకేసారి ఇన్ని అద్భుతకవితల్ని బయటపెట్టేస్తే ఎలాగండీ? వీటన్నిటినీ నేను ఒకేసారి పూర్తిగా ఆస్వాదించలేను. ఒకటొకటే నిదానంగా చదువుకుంటాను.

 13. venkataramana అభిప్రాయం,

  తేది: January 26, 2007 సమయము: 10:58 am

  ప్రసాదు నీ వ్రాతలన్ని మాకు కన్పించినవన్ని తీసివుంచాము. ఆవి అన్నియు మేము కవితలుగా చదువుతూ ఆనందిస్తుంటాము. నేను వాటిని సాద్యమయినంత త్వరగా నీకు పంపే యేర్పాటుచేస్తాను. నీ కవితలు గురించి నీ జాబులు చదివినవారు ఇప్పటికి చెబుతుంటారు.

 14. Prasanthi అభిప్రాయం,

  తేది: February 27, 2007 సమయము: 8:50 am

  నాకు చాలా బాగా నవ్వొచ్చీంది ఇవి చదివి. మీ శ్రీమతి గారికి చూపించారా అని అడుగుదామని అనుకున్నాను :) ప్రశ్న, సమాధానము కూడా ఉన్నాయి. నేను అంత మనసు పెట్టి చదవలేదు. కాబట్టి అభిప్రాయం చెప్పలేను.

 15. Jhansi R అభిప్రాయం,

  తేది: March 7, 2012 సమయము: 5:42 am

  చాలా బాగున్నాయండీ మీ కవితలు…

  న పెరు: ఝన్సి

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో