మరో ఏడు

తేది: December 29, 2006 వర్గం: వర్తమానం రచన: చరసాల 1,741 views

మరో ఏడాది గడిచింది. భూమి మరో ప్రదక్షణం చేసేసింది.
ఈ ఏడు నా జీవితంలో జరిగిన ముఖ్యమైన మార్పులు.
1) బానిసలా పనిచేయించుకొనే Verizon నుండి సుఖవంతమైన DOTకి మరింత మెరుగైన జీతంతో మారడం.
2) బ్లాగడం మొదలు పెట్టడం. బ్లాగరులతో పరిచయాలు.

DOTకే మారకుంటే బ్లాగు మొదలెట్టే సమయమే దొరికేది కాదు. తీరా బ్లాగు కోసమే వెదకకుంటే బ్లాగరుల గుంపు గురించీ తెలిసేది కాదు.
“రెండు విమానాలు” అని అచ్చ తెలుగులో చెప్పినందుకే నా బావమరిది నవ్వాడు. “ఈ పనికిమాలిన కవిత్వాల బదులు ఏదైనా చదివి IAS అవ్వొచ్చుగా” అనే ఈసడింపులు పెద్దల నుంచీ. అసలు తెలుగులో ఏదన్నా రాస్తే ఎవరికీ చూపకుండా దాచుకోవాల్సిన రోజులు కొన్ని, ఎగతాళి చేస్తారేమొ నని! అయినా నాకు తెలుగు మీది వ్యామోహం వదిలేది కాదు. కాలేజీ రోజుల్లో నానా తంటాలూ పడి రాసుకొచ్చి ఆంగ్లంలో అనర్గళంగా కొందరు వుపన్యసిస్తే, రాసుకొచ్చింది చదవడానికీ కొందరు తడబడి.. అయినా ఆంగ్లోపన్యాసమే చేసి అందరి చేతా భేష్ అనిపించుకుంటుంటే నేను మాత్రమూ తెలుగులోనే ఉపన్యసించేవాన్ని. ఇందుకు కారణం నాకంతగా ఇంగ్లీషు రాకపోవడము, వచ్చిన మాతృ బాషలో మాట్లాడటం తప్పు కాదనే బలమైన భావన వుండటమూను.
ఎలాగోలా ఇలానే నా భాషనూ, నా అభిరుచినీ చంపుకుంటూ వస్తున్న రోజుల్లో నేనీ గవర్నమెంటు ప్రాజెక్టులో చేరడమూ, కావల్సినంత సమయం దొరకడంతో దీనికి తెలుగు బ్లాగరుల ప్రోత్సాహం తోడవ్వడంతో మళ్ళీ నా హృదయాన్ని ఆవిష్కరించుకునే అవకాశం కలిగింది.
నా కిష్టమయ్యిందే నా భార్యకు ఇష్టమవ్వాలని లేదు. నాకిష్టమయ్యిందే నా పిల్లలు ఇష్ట పడతారని లేదు. నా చుట్టూ వుండి నాకు తెలిసిన కొద్ది మంది మిత్రుల్లో నాకున్న భావాలే వుండాలనీ లేదు. మరి ప్రపంచమంతటా నా అభిరుచులే వున్న స్నేహితులను వెతుక్కోవాలంటే ఒక జీవితకాలం సరిపోతుందా? పది జీవిత కాలాలు కూడా సరిపోవు. కానీ ఈ ఇంటర్‌నెట్ మాయాజాలం వల్ల మనతో ఏకీభవించే వ్యక్తులు ప్రపంచంలో ఏమూల వున్నా ఇట్టే తెలిసిపోతున్నారు, దగ్గరవుతున్నారు, బాధలనూ, సంతోషాన్నీ పంచుకుంటున్నారు. మిగతా పరిచయాల్లో రూపం చూశాక, మాట విన్నాక మనసు తెలుస్తుంది. ఇదేం చోద్యమో గానీ ఇంటర్‌నెట్ పరిచయాల్లో మనసు తెలిశక మాటా, వీలయితే ఆపై రూపమూ తెలుస్తాయి. మనసులతో ముడిపడే ఈ బందాలే అసలైన బాందవ్యాలేమొ!
బ్లాగు ప్రపంచంతో, బ్లాగరులతో పరిచయం కలిగిన ఈ ఏడాది నాకు అరుదైన అద్బుతమైన కానుకను అందించిందనే చెప్పాలి.
మరి వస్తున్న సంవత్సరం నాకోసం ఏం తెస్తున్నదో!

మీకందరికీ కొత్త సంవత్సరం భోగభాగ్యాలను, సంతోషాలను తేవాలని కోరుకుంటూ…
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'మరో ఏడు' పై 8 అభిప్రాయాలు

'మరో ఏడు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: December 29, 2006 సమయము: 4:07 pm

  మీకు కూడా నూతన స0వత్సర శుభాకా0క్షలు

 2. అనిల్ చీమలమఱ్ఱి అభిప్రాయం,

  తేది: December 29, 2006 సమయము: 4:13 pm

  ప్రసాద్…

  మీకు రాబోయే సంవత్సరము ఇంకా ఎన్నెనో క్రొత్త అనుభూతులని, ఆనందాలనీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను..

  సదా మీ

  స్నేహితుడు

 3. విహారి. అభిప్రాయం,

  తేది: December 29, 2006 సమయము: 8:59 pm

  ప్రసాద్,

  మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  కళ్ళు మూసి తెరిచే లోగా కాల చక్రం గిర్రు మని తిరిగి పోతుంది. అందులోనూ ఈ అమెరికాలో మరీనూ. ఈ బ్లాగు ప్రపంచం కొత్త లోకాన్ని ప్రసాదించింది. మరింత మంది మిత్రులు తయారయ్యారు ఈ యాంత్రిక జీవనం నుండి ఉల్లాసం గా బయట పడ్డానికి.

  విహారి.

 4. శోధన అభిప్రాయం,

  తేది: December 31, 2006 సమయము: 11:35 pm

  మీకు మరికొన్ని క్షణాలలో నూతన సంవత్సరం ఆరంభమవబోతున్న తరుణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఇవే నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  మీ జీవితం ఇలానే హాయిగా మంచి పని-జీవితపు సమతూకంతో సాగిపోవాలని కోరుకుంటున్నాను.

 5. satyanaryana అభిప్రాయం,

  తేది: January 1, 2007 సమయము: 10:40 am

  మీ బ్లాగు నాకు నూతన స0వత్సర0 ఆన0ద0 కలిగిచి0ది….చాలా కస్థ పదుతునాను….తెలుగు లొ

 6. Dr. Mohamed Taher అభిప్రాయం,

  తేది: January 2, 2007 సమయము: 5:38 pm

  Hamari Hyderabadiz ki Team aap ke liye layi hai neye saal ka shandar tohfa:
  Happy 2007 – Have Fun with Hyderabad ka Paya Paya
  with full colors, animation and entertainment that is delicious too. Come on dig it now. http://hyderabadiz.blogspot.com/

  Please, leave your comments, suggestions, and ideas to improve this blog.
  This is a non-commercial, friendly message,
  from: Mohamed Taher and his Team of Hyderabadiz

 7. Skindia అభిప్రాయం,

  తేది: January 2, 2007 సమయము: 11:27 pm

  మీ భాషాభిమానానికి జోహార్లు.మీ అంతరంగాలు మది లోతుల్ని స్ప్రుశిస్తోంది.ఎప్పటి భావనలనో జ్నప్తికి తెస్తోంది.భావ సారుప్యతతో ఉన్నవాళ్లు మనకు దగ్గరలోనే ఉన్నారనిపిస్తోంది.ఆలోచనల జడివానకు ఇది ఓ సరస్సు లాంటిదనిపిస్తోంది.
  మదిలో ఎగసి పడే భావాలకి ఇది సరైన వేదిక.ఈ వేదిక ద్వారా మీ లోని సామాజిక స్ప్రహ తెలిసింది.
  చివరగా ఒక సలహా:ప్రస్తుతానికి ఆఫీసుకి టైం అయ్యింది.మొదటి సారి తెలుగులో రాస్తున్నాను.కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నాను.మరొక్కసారి కలిసినప్పుడు చెబుతాను.

 8. Nagaraja అభిప్రాయం,

  తేది: January 8, 2007 సమయము: 9:56 pm

  ఇంత మంచి బ్లాగును వ్రాస్తున్నందుకు థాంక్స్. మీ భాషాభిమానానికి జోహార్లు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో