నేను X గడియారము

తేది: December 28, 2006 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 1,878 views

గడియారము:తిరిగిన దారిలోనె రోజుకు రెండుసార్లు తిరుగుతుంది.
నేను:నాదైన దారిలో ఆఫీసుకు రావడానికి పోవడానికి రెండుసార్లు తిరుగుతాను. (కాకపోతే ఎదురెదురుగా)

గ:ప్రతిరోజూ ఉదయం 6 గంటలకి చిన్నముల్లు ఆరుమీద పెద్దముల్లు 12 మీద వుంటాయి.
నే:ఉదయం ఆరుగంటలకు ఒడెంటన్ మార్క్ రైల్వే స్టేషన్‌లో వుంటాను.

గ:ఉదయం ఏడింటికి చిన్నముల్లు ఏడు మీద పెద్దముల్లు 12 మీద వుంటుంది.
నే:ఆఫీసులో కూర్చుని కూడలి చూస్తూ వుంటాను.

గ:సాయంత్రం నాలుగింటికి చిన్నముల్లు ఎక్కడ వుంటుందో పెద్దముల్లు ఎక్కడ వుంటుందో మీరిప్పుడు చెప్పగలరు.
నే:మెట్రో స్టేషనులో మెట్రో కోసం చూస్తుంటానని నన్నెరిగిన ఎవరైనా చెప్పగలరు.

గ:బాటరీ శక్తి నశిస్తే నెమ్మదిగా నడుస్తుంది చివరికి ఆగిపోతుంది.
నే:అనారోగ్యం ఎదురయితే ఆఫీసుకు లేటుగా రావడమో లేక ముడుచుకొని పడుకోవడమో!

గ:ఏడాదికి రెండుసార్లు గడియారపు పండుగ వస్తుంది. (అదేనండి Daylight vs Standard time)
నే:ఏడాదికి రెండుసార్లు మా పిల్లల జన్మదిన పండుగలు వస్తాయి.

మ్మ్… గడియారాన్ని చూసి జాలిపడేవాన్ని ఏం బతుకురా నాయనా అని..తీరా చూస్తే నాబతుక్కీ దానికి పేపేపేద్ద తేడా ఏమీ లేదని తెలుస్తూనే వుంది.

జీవితం ఎంత యాంత్రికమైపోయిందిరా తండ్రీ!
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'నేను X గడియారము' పై 7 అభిప్రాయాలు

'నేను X గడియారము'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: December 28, 2006 సమయము: 12:16 pm

  హ హ…భలె పో ల్చారండి.మనకి విశ్రాంతి అయినా వుంటుంది.పాపం ఆ గడియారానికి అదికూడా వుండదు.

 2. రానారె అభిప్రాయం,

  తేది: December 28, 2006 సమయము: 8:43 pm

  అలా నిట్టూర్చడమేనా… ఈ యాంత్రిక జీవనం నుండి బయటపడే మార్గం కూడా మీరు ఆలోచించే వుంటారు, దానిగురించి కూడా కొంత …!!

 3. jyothi అభిప్రాయం,

  తేది: December 28, 2006 సమయము: 9:58 pm

  హా హా హా ఇలా ఎదో ఒక దానితో మన జీవితాన్ని అన్వయించుకొని అలా సాగిపోవడమే మన పని.అంతకంటే వేరే మార్గము లేదు .ఇంతేరా ఈ జీవితము తిరిగే రంగులరాట్నము లేదా గడియారము.

 4. vijaya అభిప్రాయం,

  తేది: December 29, 2006 సమయము: 1:54 am

  మరో పోలిక చెప్పనా? ఇది వరకు గడీయారాలు టంగు టంగు మంటూ గంటలు కొట్టేవి…అచ్చు దానిలాగే మనం కూడా ఇది వరకు గల గల మాట్లాడూతు సందడీగా ఉండే వాళ్ళం.ఇప్పుడవి మూగ పోయినట్టే మన జీవితాల్లో కూడా సందడే లేదు…

 5. satyanaryana అభిప్రాయం,

  తేది: December 29, 2006 సమయము: 9:38 am

  చాలా బాగుంది సార్ …..

 6. Dileep అభిప్రాయం,

  తేది: December 31, 2006 సమయము: 4:29 pm

  హ హ ఇక్కడ నా పరిస్తితి రొజుకు 12 గంటల ఆపిసు పని, అంటె రావడానికి పొవడనికి తయరవాడనికి ఇంకొ రెండు గంటలు తినడానికి గట్రా,,, ఇంక హమ్మయ అని ఇల్లు చెరెసరికి నిద్ర వస్తుంది, ఇంక రాత్రి పని దినల్లొ చెప్పక్కర్లెదు.. దీని బట్టి మీకు అర్తమయుంటుంది,బతుకు అపిసు, తినడం, పడుకొవడం తొనె సరిపొతా వుంది.. హూంచ్..

  చూస్తుంటె చలా మంది జీవితం యాంత్రికంగానె వుంది.

 7. lalitha అభిప్రాయం,

  తేది: January 4, 2007 సమయము: 11:09 am

  దీని తర్వాత, జీవితం యాంత్రికంగా కాకుండా ఇంకోలా ఉంటే ఏం చేసేవారో, దాని గురించి రాస్తే ఆసక్తికరంగా ఉంటుందని అనిపిస్తోంది. గడియారానికి లేదు కాని, మనకు కలలు కనే శక్తి ఉంది కదా.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో