“మీ లే” ఊచకోత

తేది: December 6, 2006 వర్గం: చరిత్ర రచన: charasala 3,330 views

 ప్రశాంతి పంపిన “ఒక దళారి పశ్చాత్తాపము” పుస్తకం చదువుతూ అందులో వివరించబడిన అమెరికా కుట్రల గురించి మరింత వివరంగా చదువుదామని వికీ పేజీలు తిరగేయడం మొదలెట్టాను. ఒక లంకెను పట్టుకొని మరో లంకెకు అలా గెంతుతూ గెతుంతూ వుంటే నాకు ఈ దురంతాలు కన్నీళ్ళు తెప్పించాయి. నేను చదివిన ఇలాంటి అన్ని దుర్మార్గాలలోకి ఇది విభిన్నమైంది.
ఉత్తర వియత్నాం గొరిల్లాలతో పోరాటం చేస్తూ వాళ్ళు దాక్కున్నారనే సాకుతో ఉదయాన్నే గ్రామాలమీద పడి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలనూ, ముసలి వాళ్ళనూ, పసిపిల్లలనూ వధించారు.
జనవరి 1968 లో ఉత్తర వియత్నాం గొరిల్లాలు కాంగ్ నై(Quang Ngai) మీద దాడి చేసి దక్షిణ వియత్నాం మిలటరీ ఆఫీసర్ల ఇళ్ళమీద పడ్డారు. వాళ్ళ కుటుంబాలను చంపారు. మిలటరీ గూడాచారులు గొరిల్లాలు వెళ్ళి సాంగ్ మీ అనే వూరులో దాక్కున్నారని సమాచారం ఇచ్చారు. సాంగ్ మీ అనే వూరులో నాలుగిళ్ళను గుర్తించి అందులో దాక్కున్నారని చెప్పారు. అంతకు ముందు వియత్నం గొరిల్లాల దాడిలో నష్టపోయిన అమెరికా సైనికులు ఆ గుడెసెలమీద దాడిచేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 7 గంటల తర్వాత అందరూ బయటకు పనులకు వెల్తారనీ ఆ తర్వాత గుడిసెల్లో ఎవరున్నా వారు గొరిల్లాలో లేక వారి సానుభూతిపరులో అయివుంటారనీ వాళ్ళ నాయకుడు వూహించి 7 గంటల తర్వాత దాడి చేసి కనిపించిన అందరినీ చంపేయమన్నాడు. మరెందుకో ఆయనకు పసిపిల్లలు, వృద్దుల మాట గుర్తుకు రాలేదు.
ఊచకోత

మర్నాటి వుదయమే మార్చి16, 1968న అమెరికన్ సైనికులు ఆ వూరిమీద విరుచుకు పడ్డారు. అక్కడ వీరికి గొరిల్లాలు ఎవరూ కనిపించలేదు. అయినా వాళ్ళు గొరిల్లాల అచూకి చెప్పమని వేధించి కాల్చి చంపారు. ఆడవారు, పిల్లలూ, వృద్దులు అందరినీ వూరిబయట గోతుల వద్దకు నడిపించి ఆటోమాటిక్ గన్స్‌తో కాల్చి చంపారు. ఇది ఇంకా కొనసాగేదే ఒక ధైర్యవంతుడైన హెలికాప్టర్ పైలట్ దీన్ని చూడకపోయివుంటే!

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'“మీ లే” ఊచకోత' పై 5 అభిప్రాయాలు

'“మీ లే” ఊచకోత'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: December 6, 2006 సమయము: 12:31 pm

  ఎంత అమానుషం.వీళ్ళకి జాలి,దయ అనెవి వుండవా?

 2. vihaari అభిప్రాయం,

  తేది: December 6, 2006 సమయము: 3:08 pm

  వియత్నాం ఊచకోత తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. అగ్ర రాజ్యమని చెప్పబడే ఏ దేశము తక్కువ తినలేదు.ఎప్పుడో కమ్యూనికేషన్స్ సరీగ లేనప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలు కొన్ని మాత్రమే బయట పడ్డాయి. బయటకు రానివి కోకొల్లలు. ఇంకా ఇరాక్ లో జరుగుతున్నవి ఆల్ జజీర టీ.వి చూస్తే కానీ తెలీదు.

 3. రానారె అభిప్రాయం,

  తేది: December 6, 2006 సమయము: 10:23 pm

  ఆదిమ మానవుడినుండి మొదలుకొని నేటికీ ఏనాటికైనా బలవంతునిదే రాజ్యం, ఆటవికమే న్యాయం. ఆంక్షలు విధించేదీ, ఎత్తివేసేదీ బలవంతుడే. అంతా చేతిలో పని. అందుకే మన కలాం మన బలగం శక్తివంతం చేయటానికి అంత ప్రాముఖ్యతనిస్తారు. బలమైన దేశమై వున్నంతకాలమే ఆ దేశాన్ని మరో బలమైన దేశం గౌరవిస్తుంది. కదా!?

 4. charasala అభిప్రాయం,

  తేది: December 8, 2006 సమయము: 8:20 am

  నిజమే సాంకేతికత పెరిగే కొద్దీ మనిషి ఇంకో మనిషిని ఎంత క్రూరంగా లేక ఎంత సులభంగా చంపొచ్చో నేర్చుకుంటున్నాడు. క్రూరత్వంతో పాటే మానవత్వమూ పెరిగినా క్రూరత్వమే ఎప్పుడూ విజయం సాధిస్తోంది.

  –ప్రసాద్

 5. murali krishna అభిప్రాయం,

  తేది: August 17, 2010 సమయము: 4:56 am

  అమెరిక వియత్నాంలొ చేసిన ఎన్నో ఊచకోతలలొ ఇది ఒకటి. నిజంగా అమానుషత్వం వాళ్ళ అధికార దాహం ఎలాంటి పనులకు ఉసిగోలుపుతుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో