ఉత్తరాలు

తేది: December 12, 2006 వర్గం: వర్గీకరింపబడనివి రచన: charasala 2,262 views

ఒక జీవితకాలంలోనే ఇన్నిమార్పులు జరగడం బహుశా ఈ తరంలోనే జరిగిందేమొ! మొన్నటికి మొన్న ఓ 7 సంవత్సరాల క్రితం వరకూ కూడా పోస్టుమాన్ వస్తున్నాడంటే ఎంత ఆనందమో! తను తెచ్చిన ఉత్తరాల మీద ఎంత ఆపేక్షో! అందులో మనకోసం ఓ ఉత్తరముంటే ఎంత తుళ్ళింతో! ఇంటికొచ్చిన దినపత్రిక గానీ, వార పత్రిక గానీ, ఓ కొత్త నవల గానీ అంత సంతోషాన్ని ఇస్తుందా?? అందునా మన శ్రేయోభిలాషి, మంచి దోస్తు రాసిన వుత్తరమయితే చదువుతున్నంతసేపూ నవనాడులూ, పంచేంద్రియాలూ ఆ వుత్తరం మీదే కేంద్రీకరించి చదువుతున్నంతసేపూ వచ్చే ఆనందం! హా!!! ఇప్పుడేదీ ఆ ఆనందం?

ఇప్పుడంతా ఫోన్లు, ఎస్సెమ్మెస్సులూ, ఈమెయిల్లూ, చాట్‌రూం సంభాషణలూ. పొదుపైన పదాలూ అందుకోసం ప్రత్యేకంగా.. సమాచారం చేరవేయడం బోలెడంత సుళువైపోయింది. ఎకాఎకిన మా అమ్మకు ఫోన్ చేసి ఎలావున్నావని అడగొచ్చు లేదా అటు ఇటూ కెమారాలుంటే ఇద్దరం ఒకరినొకరు రోజూ ఇరుగు-పొరుగుల్లా చూసుకోవచ్చు. ఈ టెక్నాలజీ తెచ్చిన విప్లవం అంతాఇంతా కాదు. అయితే దీనితో కొన్ని అందమైన అలవాట్లు మరుగున పడిపోతున్నాయి. కాలేజీలో చదివేరోజుల్లో మా నాన్న నాకు వ్రాసిన మొదటి వుత్తరం నాలో ఎదో ఉత్తేజాన్ని కలిగించింది. ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా ఆ అనుభూతి రావట్లేదు.
అప్పట్లో నేను నా మిత్రునికి రాసిన 7 పేజీల లేఖే పెద్దదనుకుంటే దానికి తగ్గట్టుగా శ్రీకాళహస్తి నుంచీ అతను రాసిన పద్నాలుగు పేజీల (అన్నీ ఆ4 సైజు ఠావులే) లేఖ నన్ను ఆశ్చర్యపరచింది. అందులో శ్రీకాళహస్తిలో కూరగాయల రేట్ల దగ్గరనుండీ స్థానిక రాజకీయాల వరకు, తన వివిధానుభవాలనుండి తన మిత్రులతో చర్చల వరకూ అన్నీ వున్నాయి.
నన్నందరూ వుత్తరాలు కవితాత్మకంగా రాస్తాననే వాళ్ళు. కాలేజీ చదివే రోజుల్లో నెలకో వుత్తరమైనా ఇంటికి రాయకపోతే మా చెల్లి కొట్లాడేది. అసలు వాళ్ళు నన్ను గాక నా వుత్తరాలనే ప్రేమిస్తున్నారా అనిపించేది. ఇప్పటికీ మా అమ్మ నువ్వెన్ని సార్లు మాట్లాడినా మాకు తృప్తిలేదురా ఒక్క వుత్త్రం రాశావంటే మాకు నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చదువుకొని తృప్తి పడతాం అంటుంది.
మా మిత్రత్రయం (రంగా, రెడ్డి, రేణుక) విజయవాడలో ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మా స్నేహుతురాలొకామే ఉత్తరాలు రాసేవారు. మేమూ ఆమెకు రాసేవాళ్ళం. మా ప్రతి వుత్తరానికి ప్రత్యుత్తరం వస్తుందని మేమెంత ఆతృతగా ఎదురుచూసేవాళ్ళమంటే .. కొన్నింటికి పదాల్లేవ్.
మీక్కూడా వుత్తరాల జ్ఞాపకాలున్నాయా? పంచుకోండి. దాచుకున్న వుత్తరాలుంటే అభ్యంతరం లేనివైతే ప్రచురించడానికి ప్రయత్నించండి.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'ఉత్తరాలు' పై 14 అభిప్రాయాలు

'ఉత్తరాలు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: December 12, 2006 సమయము: 3:31 pm

  ఉత్తరాలు రెండు మనసులను కలిపె పూల వ0తెనలట.మాటల్లొ చెప్పలేని అనుభూతి కలిగినప్పుడు పంచుకునే నే స్త0 తో కళ్ళు ఎలా మట్లాడతాయో ,దగ్గరగా లే ని నేస్త0 తో కళ్ళు మాట్లాడలేనివి ఉత్తరాలు అలా మాట్లాడతాయి.నాకు ఈ అనుభూతి చాలా నచ్చుతుంది.అందుకె ఇప్పటికి మా మిత్రులందరము ఉత్తరాలు రాసుకుంటూ వుంటాము.కాలెజి లొ వున్నప్పుడు అరుణ రాసె ఉత్తరాలకోస0 ఎదురుచూసెదానిని.పెళ్ళయ్యాకా అత్తవారింటికి వెలుతున్న రోజు వస్తానని చెప్పి రాలెక[బాధ తొ]అప్పటి వరకు పంచుకున్న అనుభూతులు,పెంచుకున్న అనుబంధాలు, కలసి కలలుగన్న క్షనాలు కాగిత0 పైన పెట్టి ప0పి0ది తులసి.అప్పటి వరకు సరదాగా ఆటపట్టిస్తూ నవ్వించడమె తెలుసు అనుకున్న దొరబాబు[అన్నయ్య]ప0పిన ఉత్తర0 చెప్పింది తనకూ ఏడవడ0 వచ్చని.ఈ ఉత్తరాలన్ని నాకు చాలా అపురూప0.వాటికన్నా విలువైనవాటిని ఇప్పటి వరకూ నేను స0పాదించలెదు.

 2. cbrao అభిప్రాయం,

  తేది: December 12, 2006 సమయము: 11:01 pm

  ఆంగ్లంలో , తెలుగులో లేఖా సాహిత్యం కొన్ని కొత్త గవాక్షాలను తెరిచింది జ్ఞాన ప్రపంచానికి. సంజీవదెవ్ లేఖలంటే నాకు ప్రాణం.

 3. రానారె అభిప్రాయం,

  తేది: December 12, 2006 సమయము: 11:35 pm

  ఈ ఆలోచనే నాకూ వస్తుంటుంది. నా వ్యక్తిత్వపు ఏర్పాటులో మా నాయనకు నాకు మధ్య నడచిన వుత్తరాల ధారావాహిక పాత్ర చాలా వుంది. నేను దగ్గరున్నపుడు చెప్పేకన్నా ఆ చెప్పాలనుకున్నది చేతిరాత రూపంలోకి మారి వుత్తరంగా నాకు చేరినపుడు చాలా శక్తిమంతంగా పనిచేసింది. మా వుత్తరాలన్నీ పదహైదు పైసల పోస్ఠుకార్డు మీదే, అది ఆమధ్యనే పావలా కార్డు అయింది. ముక్కావారిపల్లెలోని ఆం.ప్ర. గురుకుల పాఠశాలలో ప్రతి మధ్యాహ్నం భోజనానికి ముందు జరిగే ఆనందకరమైన తొక్కిసలాట నుంచి మా నాయన నుంచి వచ్చిన జాబుతో బయట పడటం ఎంత శక్తినిచ్చేదో మీ టపా చదివి మరొక్కమారు గుర్తొచ్చింది. ధన్యవాదాలు.

 4. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 12:32 am

  ఉత్తరాల విషయమెత్తొద్దు ఇప్పుడే నా కళ్లో నీళ్లు తిరుగుతున్నాయి. టెక్నాలజీలెన్నున్నా మేలు ఉత్తరాల విలువ అసమానమే. ఫోను కంటే ఉత్తరాలలోనే అర్ధవంతమైన చర్చలు సాగుతాయని నాకనిపిస్తుంది. ఎదో కుశల ప్రశ్నలకు, సమాచార మార్పిడికి ఫోనుకానీ..భావ ప్రకటనకు ఉత్తరాన్ని మించింది లేదు అందుకే నా బ్లాగు ఉత్తరం ముక్క. నేను అమెరికా వచ్చిన కొత్తలో మా నాయినకు, అమ్మకు 10 పేజీల ఉత్తరం రాసిన. దానికి మహానుభావుడు మా నాయిన ఒక ముక్క కూడా తిరుగు టపా రాయలేదని బాధ తన్నుకొచ్చింది.

 5. సత్యసాయి అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 1:00 am

  కబుర్లని ఆలష్యంగా చేరవేసినా, మనుషుల మధ్యనున్న దూరాన్ని ఇట్టే మరపించేవి ఉత్తరాలు. ఇప్పుడు సమాచారం చాలా త్వరితంగా పోతోంది. కాని మనస్సుకు చేరటంలేదు.

 6. jyothi అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 6:21 am

  అవునండి మనము మాటలకంటే రాతలలోనే మన ఆలోచనలన్నీ రాయగలుగుతాము.ఈ రోజుళ్లో ఉత్తరం రాయడం దానికోసం వేచి చూసే ఓపిక తగ్గిపోయింది జనాలకి.ఓ ఫోన్ కొట్టేస్తే చాలు అనుకుంటున్నారు. కాని మనం ఈ మెయిల్ లో కూడా అలానే రాసుకోవచ్చేమో.

 7. Sudheer Kothuri అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 6:23 am

  ఉత్తరం కోసం అసహనంగా ఎదురుచూస్తూ పడే తీపి బాధ ఇంకెందులోనూ లేదు. మా పెళ్ళవకముందు మా మధ్య ఒక నాలుగేళ్ళు ప్రేమ లేఖలు నడిచాయి. అమ్మ చెతికెక్కడ చిక్కుతుందో అని పోస్ట్ మాన్ ని మా ఇంటికొచ్చేలోపే వీధి చివరిన కలిసి నా ఉత్తరాలు తీసుకొనేవాడిని. ఇప్పటికి నా వైఫ్ వ్రాసిన ఉత్తరాలు చదవడమంటే నాకెంతో ఇష్టం. ఎన్నో జ్ఞాపకాలను నిమిరిన ప్రసాద్ గారి “ఉత్తరాలు” కి చాలా థాంక్స్!

 8. kondaveeti satyavati అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 7:00 am

  నాకు ఉత్తరాలంటె చాలా ప్రేమ.నా మిత్రులకు తరచుగా రాస్తుంటాను.నేను నా రాసిన ఉత్తరాలు ప్రచురిస్టే ఒకపెద్ద పుస్టకమౌతుంది.ఇప్పటికిక నేను ఈ అలవాటు మానుకొ లెదు.మానుకొబొవడంలేదు.

 9. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 7:45 am

  నాకు ఉత్తరాలు ఎలాంటి అనుభూతినిచ్చేవో అచ్చంగా మళ్ళీ అలాంటి రసానుభూతి మీ వాఖ్యలు చదువుతూ వుంటే కలిగింది. మీకు ఋణపడివున్నాను.
  రాధిక గారు స్నేహంపై మళ్ళీ ఒకవిత రాసినంత దగ్గరగా వచ్చారు. దొరబాబు పంపిన వుత్తరం చెప్పింది తనకూ ఏడవడం వచ్చని అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి ఎందుకో మరి.
  రావ్ గారూ “సంజీవ్ దేవ్ లేఖల”ను నా wish listలో చేర్చాను. AVKF.orgలో దొరికితే తెప్పించుకుంటాను.
  రానారె, మీరు అదృష్టవంతులు. మీ నాన్న గారిని నాన్నగా పొందినందుకు. ఎందుకంటె చాలామంది నాన్నలకు పుత్రప్రేమ కడుపుదాటి బయటపడదు. మా నాన్న నుండి నేనందుకున్న ఉత్తరం ఒకేఒక్కటి మొత్తం నా విద్యార్థి జీవితంలో. పెళ్ళయ్యాక అమెరికా వచ్చాక బహుశా రెండు వుత్తరాలనుకుంటాను. ఆయనలోని ప్రేమను ఆయన ఎప్పుడూ వ్యక్తపరిచేవారు కాదు. కానీ ఆయనలోని ప్రేమ నాకు రెండు సందర్భాలలో ప్రగాఢంగా వ్యక్తమయ్యింది. లక్కిరెడ్డిపల్లెలో నా పదవతరగతి పరీక్షలు రాస్తున్నప్పుడు నాన్న గానీ అమ్మ గానీ బాగా పరీక్షలు వ్రాయనిగానీ, పరీక్షలకు చదవమని గానీ అనలేదు( ఆ అవసరం మేము కల్పించలేదు కూడా). అయితే ఒకరోజు మా అమ్మ చెప్పింది “రాత్రి మీనాన్న “బాగా రాయి, బాగా రాయి” అని కలవరిస్తున్నాడురా నిద్రలో” అని.
  ఇక రెండొ సందర్బం. అయిదున్నరేళ్ళ తర్వాత మొదటిసారి అమెరికా నుండి ఇండియా వెళ్ళినప్పుడు ఆయన తన బావోద్వేగాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చేశాడు. నా చిన్నప్పటినుండీ ఎంతో గంభీరంగా వున్నాయన అలా గుండెలు ఎగదన్ని ఏడుస్తుంటే తొలుత మాంపడిపోయినా ఆ తర్వాత గుండెలకాంచుకొని ఓదార్చాను.
  రవీ,
  రానారె కామెంటు చదివి వెంటనే మీది చదివితే, మీ బాధా నా బాధా ఒకటే కదా అని నవ్వొచ్చింది. నేను వుత్తరాలు రాయాలంటారే గానీ మా వాళ్ళు కూడా వుత్తరాలు రాయరు.
  సత్యసాయి గారూ,
  నిజమేనండి. ఇప్పటి సమాచార మార్పిడిలో సమాచారమే ంచేరుతోంది గానీ, మనసు చేరడం లేదు.

  జ్యోతి గారూ,
  మీరు చెప్పిందీ నిజమేనండి. ఎదో కట్టె, కొట్టె, తెచ్చె లా గాకుండా ఇమెయిల్ వుత్తరాలు గూడా ఉత్తరాల్లా రాయడానికి ప్రయత్నించాలి.

  సుధీర్ గారూ,
  నాలుగేళ్ళ ప్రేమలేఖల అనుభూతిని స్వంతం చేసుకున్న మీ జీవితం మధురామృతభాండం.

  సత్యవతి గారూ,
  అడొ పెద్ద కళ అండి. ఇప్పటికీ మీరు వుత్తరాలు వ్రాస్తున్నందుకు సంతోషం. మీలాంటి స్నేహితురాలున్నందుకు మీ స్నేహితులు అదృష్టవంతులు. మీ అలవాటును కొనసాగించండి.

  మీ మీ ఆలోచనలను అనుభూతిని పంచుకొని నాకు వుదయాన్నే పరిమళ ప్రసాదం పెట్టిన మీకందరికీ నా వందనాలు.

  మీ
  ప్రసాద్

 10. vihaari అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 4:51 pm

  ప్రసాద్ గారూ,

  కందిరీగల తొట్టె లాంటి ఉత్తరాల తలపుల పెట్టె పగల గొట్టారు మీరు. ఈ ఉత్తరాల గురించి రాస్తూ పోతే అసలు మనకు సమయముండదేమో. అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది ఆ విద్యార్థి జీవతం మళ్ళీ వస్తే ఎలావుంటుంది అని. నేను కూడా తెగ ఉత్తరాలు రాసే వాడిని. ఒక సారి నా స్నేహితుడు ఉద్యోగం కోసం బాంబే వెళితే వాడికి ఉత్తరం రాయడానికి మా స్నేహితులు ఏడు మందిని నా ఇంకో స్నేహితుడి మందుల షాపులో కూర్చోబెట్టి బలవంతంగా ప్రతి వాడితోనూ రాయించిన వైనం. నేను రాసే ప్రతి ఉత్తరాన్ని పగల్బడి నవ్వుతూ మురళి చదువుకోవడం, శ్రీహరి రాసే ప్రతి దాన్లో ఎంతో గూడార్థాన్ని వెతుక్కోవడం. ఇంటి గ్రిల్స్ లోనుంచి ఉత్తరాన్ని పోస్ట్ మ్యాన్ గిరాటేసే సన్నివేశం. అన్నీ గుర్తుకు వస్తున్నాయి. సమయాభావం వల్ల అన్నీ రాయలేకపోతున్నా ( కనీసం చదవడానికి కాస్త తీరిక దొరికింది ఇప్పుడు)

  మీకోక వార్నింగ్: మళ్ళీ ఇలాంటివి రాయకండి. గుండె చెరువయి పోతోంది:-)

  విహారి.

 11. uday అభిప్రాయం,

  తేది: December 13, 2006 సమయము: 7:55 pm

  బాగ చెప్పరండి ప్రసాదు గారు. నెను కాలేజీ చదివె రొజుల్లొ వారనికి ఒక వుత్తరం రాక పొయినా నెను పెద్ద గొడవ పెట్టెవాడిని మా అమ్మ తొ. అలాగె, మా అమ్మ రాసిన వుత్తరం ఒక 5 సార్లు అయినా చదువుకునె వాడిని. ఆ వుత్తరం లొ ‘బాగున్నావ, బాగ చదువుతున్నావ, బాగ తింటున్నావా’ అనె మాదుర్యం ఈ కొత్త మార్పులు తొ ఎవరు చెరుపలెరు.

  ఎంతయిన ఆ రొజులు బంగారం..ఒకొక్కసారి అనిపిస్తుంది మనకి మనం యాంత్రికము గా మారిపొతున్నాము ఎమొ అని.

 12. varaprasad అభిప్రాయం,

  తేది: December 19, 2006 సమయము: 1:29 am

  నె ను కూ డ ఛాల శా రు లు అనుకొన్నను, ఎంతయిన ఆ రొజులు బంగారం.ఒకొక్కసారి అనిపిస్తుంది మనకి మనం యాంత్రికము గా మారిపొతున్నాము అని. నేను కూడా తెగ ఉత్తరాలు రాసే వాడిని. నీకు గుర్థుంద మనం రాసుకున్న ఉత్త రాలు,ఇక్క డ అంద రు శార్ శార్ నేను శార్. నేను బాగ ప్రయ్తనం చెసి నికు మరల ఇంకొక శారి నా అబిప్రాయం తేలియజేస్తాను

 13. venkataramana అభిప్రాయం,

  తేది: December 20, 2006 సమయము: 11:17 am

  ప్రసాదు గారి అభిప్రాయముతో ఏకీభవించనివారు వుండరంటే అతిశయోక్తి కాద్ల్లేమో! మారే కాలాన్ని మనము ఆపలేము కదా! ఈమెయిల్సు ద్వారా మనము మళ్ళీ గత వైభవాన్ని అనుభవిద్దాం. కేవలం పోస్టుమాను మాత్రము వుండడు. నాకు మాత్రం మెయిల్సు చూడబోయేముందు పోస్టుమాను కోసము ఎదురుచూసినట్లుంది. మరి కాలానుగునంగా మారకతప్పదుకదా!


 14. తేది: June 4, 2007 సమయము: 10:16 am

  [...] ఉత్తరాలు [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో