గండికోట సాహసయాత్ర

తేది: December 12, 2006 వర్గం: వర్గీకరింపబడనివి రచన: charasala 3,359 views

ఆరోజు రిపబ్లిక్ డే, కాలేజీకి సెలవు. ఏమి చేయాలా అని నేను, రూమ్ మేటు మరియు స్నేహితుడు రంగనాయకులు ఆలోచించాము. చివరికి జమ్మలమడుగు తర్వాత 10/20 కిలోమీటర్ల దూరంలో వున్న గండికోట చూచిరావాలని అనుకున్నాం. కానీ అలా బస్సులో వెళ్ళి ఇలా వచ్చేస్తే మజా ఏముంటుందని ఇద్దరం సైకిళ్ళపై వెళ్ళి రావాలని నిర్ణయించుకున్నాం. మా సాహస యాత్ర అలా మొదలయ్యింది.

ఉదయాన్నే లేచి అద్దె సైకిళ్ళు తీసుకుని మా సైకిల్ యాత్ర మొదలు పెట్టాం. ప్రొద్దటూరు నుండీ జమ్మలమడుగుకు మధ్యాహ్నానికల్లా చేరుకున్నాం. అక్కడ భోజనం చేసి మళ్ళీ బయలుదేరి బహుశా రెండింటికల్లా గండికోట చేరాం. దానిపైకి సైకిలు తొక్కడం వల్ల కాలేదు. నడిపించుకుంటూ వెళ్ళాం. పైన ఏదో గుడి వుంది. దేవుళ్ళని మాయం చేశారు. ఇంకా ఎవైనా కట్టడాలకు పనికివస్తాయనుకున్న పెద్ద రాళ్ళనూ బండలనూ కూడా దోచుకెళ్ళారు. గుడి ఆకారమంతా వున్నా లోపలంతా డొల్ల. అక్కడినుంచీ మసీదు దగ్గరకెళ్ళాం. దాని తలుపులు మూసి వుండడంతో పక్కనున్న ఏదో గోడనెక్కి కిటికిలోంచి లోపలికి తొంగిచూసినట్లు జ్ఞాపకం. ఆ పక్కనే రెండు కొండలనూ వరుసుకుంటూ వెళ్తున్న పెన్న. ఇవతలి ఒడ్డుపైనుంచీ చూస్తే ఆవలి తీరం దగ్గరగా వున్నట్లే వుంటుంది గానీ ఎంత శక్తిమంతుడైనా ఆవలి ఒడ్డుకు రాయి విసరలేడని ప్రతీతి.
కొండలో పెన్న చేసిన ఆ గండి వల్లనే దానికి “గండి కోట” అని పేరొచ్చిందట.
ఇక చుట్టూ వున్న కోట గోడ చూడాలని వున్నా అప్పటికే చీకటి ముసురుతూ వుండటం వల్ల ఇక తిరుగు ప్రయాణమయ్యాం.

తిరుగు ప్రయాణంలో కొండమీద నుండి సైకిళ్ళపై చాలా వేగంగా దిగుతున్నాం. కనిపించీ కనిపించని ఆ చిరుచీకటిలో ముళ్ళవల్లో లేక వాడైన రాళ్ళ వల్లో లేక కొండమీదనుండి దూకుతున్న వడి వల్లో మా సైకిళ్ళు పంక్చర్ అయ్యాయి. ఎలాగోలా కొండదిగి నడక మొదలు పెట్టాం. జమ్మలమడుగు చేరేటప్పటికి బహుశా రాత్రి 8 గంటలయ్యిందనుకుంటాను. అక్కడేమయినా తిన్నామో లేదో గుర్తులేదు. సైకిళ్ళకు పంక్చర్ వేసే షాపు ఏదీ కనిపించలేదు. అలాగని సైకిళ్ళపై వెళ్ళి రావాలన్న మా ఆకాంక్షను వదులుకొని బస్సుపై వెళ్ళడానికి మా పట్టుదల అంగీకరించలేదు. (బహుశా బస్సులో వెళ్ళాలని మనుసులో వున్నా ఎవరమూ బింకంతో బయట పడలేదు.) మళ్ళీ నడక మొదలెట్టాం. జమ్మలమడుగు నుండీ ప్రొద్దుటూరు 20 కిలోమీట్ర్లనుకుంటాను. సగం దూరం పౌరుషంగా నడిచినా ఇక కాళ్ళు సహకరించడం మానేశాయి. కానీ బలహీనత చెప్పుకోవడానికి సిగ్గు. మా కాళ్ళ బరువుకు తోడు మాకు సైకిళ్ళు తోయాల్సిన బాధ. దూరంగా ఎక్కడో ప్రొద్దటూరు లైట్ల వెలుతురు….వచ్చినట్లే వుందిగానీ వూరెంతకూ దగ్గరికి రాదు. పది మీటర్ల దూరం లోని మైలురాయి చేరాలన్నా ఎంతో కష్టం. అదెంతో దూరంలో వుండి కవ్విస్తున్నట్లు….. తీరా ఆ మైలురాయి చేరాక ఏదొ సాధించిన తృప్తి. ఇన్ని అడుగులు వేశాం ఇంకొన్నే కదా..అని మనసులోనే అనుకుంటూ ఒకరి కష్టం ఇంకొకరికి కనపడనీయకుండా ఎంతో ఓర్పుతో ఏ అర్ధరాత్రి దాటాకో ఇళ్ళు చేరాం. ఒక అడుగు దూరమే మైలు దూరంలా అనిపించిన ఆనాటి నడక మళ్ళీ ఇంతవరకూ అవసరం రాలేదు.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'గండికోట సాహసయాత్ర' పై 4 అభిప్రాయాలు

'గండికోట సాహసయాత్ర'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: December 12, 2006 సమయము: 12:44 pm

  బాగుంది మీ సాహస యాత్ర.అప్పుడు అంత కష్ట పడ్డా ఇప్పుడు అదొక మంచి జ్నాపక0 లా మిగిలిపొఅయింది కదా..అందుకె అంటారు ఒకప్పటి చేదు అనుభవ0 నేటి తీపి అనుభూతి అని

 2. cbrao అభిప్రాయం,

  తేది: December 12, 2006 సమయము: 1:35 pm

  అమెరికా వెళ్ళాక Great Smoky Mountains National Park లో గల బోల్డంత trekking అవకాశాలు ఉపయోగించుకున్నారా?

 3. vihaari అభిప్రాయం,

  తేది: December 15, 2006 సమయము: 7:33 pm

  ప్రసాద గారూ,

  ఓ చిన్న రాయి విసురుతున్నా. మీ రంగ నాయకులు ప్రొద్దుటూరు వాడా? నా క్లాసుమేటు వుండే వాడు. అతను ఆదొని లొ పాలిటెక్నిక చదివాడా?

  విహారి.

 4. Purushottam అభిప్రాయం,

  తేది: May 15, 2020 సమయము: 12:33 pm

  మా రంగా మరంతే. Braveheart.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో