కిం కర్తవ్యం

తేది: November 24, 2006 వర్గం: వర్తమానం రచన: charasala 1,764 views

నక్సలైట్లు ఇప్పుడేం చేస్తున్నారు? ప్రభుత్వ బలం ముందు మోకరిల్లినట్లే అనిపిస్తోంది. మొదట్లో ఇది నాకు బాగానే నచ్చింది. కానీ ఇప్పుడిప్పుడే నాకు ఇంకోలా అర్థమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరిమీద ఇంకొకరికి బలాబలాల సమతుల్యత వుండాలి. కార్యనిర్వాహక, న్యాయ, చట్ట సభల మద్య ఇలాంటి బలాబలాల సమతుల్యత అవసరం. అలానే ఏ ఇతర వ్యవస్థలోనైనా ఇలాంటి సమతులనం దెబ్బతింటే ఏదో ఒక వర్గం అలవిగాని బలమైపోతుంది.

అన్యాయం ప్రబలమైన చోట న్యాయం కోసం పోరాటం వుంటుంది. రోగం వున్నచోటే నిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది. పోలీసు అకృత్యాలైతేనేమి, “స్టేట్” చేసే అరాచకమైతేనేమి అదెక్కడుంటుందో దానికి వ్యతిరేకంగా పోరాటం కూడా అక్కడ వుంటుంది.
మన దగ్గర నక్సలైట్లు వున్నారంటే దానర్థం మనదగ్గర భూస్వామ్య దోపిడీ వుందని. నక్సలైట్లు అప్రతిహత రాజ్య అధికారానికి, అహంకారానికి ప్రతిపక్షంలా వ్యవహరించాలి. ఆవిధంగా బలాబలాల సామ్యం ఏర్పడాలి. కానీ నక్సలైట్ల పోరాటం వాళ్ళ సిద్దాంతానికి కాకుండా ఇతరుల సిద్దాంతాన్ని వ్యతిరేకించడానికో లేక పోలీసుల మీద వ్యక్తిగత పోరాటంగానో పరిణమించింది. ఈ దారితప్పిన పోరాటంలో వాళ్ళు ఎవరికోసమని తుపాకులు పట్టారో వాళ్ళ మీదనే అవి ప్రయోగిస్తున్నారు. ఇన్ఫార్మర్లనో ఇంకొకటో ముద్ర వేసి అచ్చం పోలిసుల మాదిరే వాళ్ళూ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు సిద్దాంతపరంగా పోరాటం చేసినన్నాల్లూ వారికి ప్రజల మద్దతు దొరుకుతుంది గానీ స్వార్థపూరితంగా పోరాటం చేస్తే ప్రజల మద్దతు ఎలా వస్తుంది?
నిజానికి ప్రజల మద్దతు పొందాలంటే వాళ్ళు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికై పోరాటం చేయాలి. ఠాగూర్ లాంటి చిత్రాలే ప్రజలని అంతగా కదిలించగలుగుతూ వుంటే అలాంటి పనిచేసి నక్సలైట్లు మాత్రం ఎందుకు పేరు తెచ్చుకోకూడదూ? ఇన్ఫార్మర్ అని ఒక పేదవాన్ని చంపేబదులో లేక హత్యకు హత్య బదులని ప్రభుత్వం ఒకన్ని చంపితే వీళ్ళు ఇంకొకన్ని చంపేబదులు ఆ “ఆకుల రాజయ్య”నో లేక అవినీతితో కోట్లు కూడబెట్టిన ఇంకో వుద్యోగినో భయపెట్టో, హతమార్చో న్యాయం కోసం ధర్మం కోసం ప్రజల్లో భీతి కల్పించవచ్చు కదా? సినిమాల్లో వీరోచిత కార్యాలు చేసి న్యాయం పక్షాన నిలబడే హీరోనే ముఖ్యమంత్రిని చేయగా లేంది ఇలాంటి పనులు నిజ జీవితంలో చేస్తే అధికారంలోకి రావడం నక్సలైట్లకైనా ఇంకో గ్రూపుకైనా ఎంతసేపు?
నాకెందుకో ఈ నక్సలైట్లు అధికారానికి ఇలాంటి రాచమార్గము వుండగా అరాచకమార్గాన్ని ఎన్నుకున్నారనిపిస్తోంది. వీళ్ళు తలుచుకుంటే కాంట్రాక్టర్లని ఇసుక కట్టడాలు నిర్మించకుండా అడ్డుకోవచ్చు. రాజకీయనాయకులు చేసిన వాగ్దానాలను అమలు చేసేటట్లు నిర్బందించవచ్చు. అధికారులను అవినీతిని చేయకుండా ఆపవచ్చు.
ఇదంతా నా అత్యాశేమొ!

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'కిం కర్తవ్యం' పై 4 అభిప్రాయాలు

'కిం కర్తవ్యం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. రానారె అభిప్రాయం,

  తేది: November 24, 2006 సమయము: 10:06 pm

  అత్యాశ కాదు. అన్యాయం చేసిన వాడిని, సామాన్య ప్రజలను పీడించే ఆధికారిని వదిలేసి పోలీసుల కానిస్టేబుళ్ళ మీద ప్రతాపం చూపుతున్నారు. అదొక ఉద్యమంలా అనిపిచటం లేదిపుడు.

 2. చదువరి అభిప్రాయం,

  తేది: November 25, 2006 సమయము: 4:21 am

  మీది ఖచ్చితంగా హేతుబద్ధమైన, న్యాయమైన ఆశే. కాకపోతే కాంట్రాక్టర్లను భయపెట్టి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసుకునే వీళ్ళు, వాళ్ళచేత సక్రమంగా పనులు చేయించలేరనేది వాస్తవం. నక్సలైట్లు సమాజంతోటీ, ప్రజలతోటీ సమీకరణాన్ని ఎప్పుడో కోల్పోయారు.

 3. venkataramana అభిప్రాయం,

  తేది: December 6, 2006 సమయము: 8:37 am

  మన సమాజం వొకరినొక రు దోచుకొవద్ద్ద్దద్ద్ద్దద్ద నక్సలైట్లుకూడఆ దోపిడీలో భాగం గానే ఆ పద్ద్తిస అవలంభిస్తున్నారు. మరొకతి కాదు.

 4. Ravikiran అభిప్రాయం,

  తేది: December 8, 2006 సమయము: 11:50 am

  చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు కాంట్రాక్టర్లు నక్సలైట్లకు భయపడాల్సిన అవసరంలేదు. లంచగోండులు, నల్ల బజారు వ్యాపారులు, రియలెస్టేటు గూండాలూ ఇంకా అనేక రాకాలుగా ప్రజల్ని దోపిడికి గురిచేసే వారూ ఎవరికి నక్సలైట్ల వలన నష్టం లేదు.

  మరీ ముఖ్యంగా గ్రామాల్లో భూసామ్య దోపిడికి వారివల్ల ఎలాంటి ముప్పూ లేదు. ఎవరైనా సరే, కమీషన్ చెల్లించుకోగలిగితే నక్సలైట్లు వారిచూపును మరోప్రక్క తిప్పుకుంటారు. సిద్దాంతాలు, సిద్దాంత పోరాటాలు, మందికి మంచి చెయ్యాలనే భావన (మాటల్లో కాదు), సిద్దాంత మంచి చెడులను తీసెయ్యండి, నమ్మిన సిద్దాంతం కోసం గాడి తప్పని దీక్ష ఇవన్నీ ఎప్పుడో, ఎక్కడో జారిపోయాయ్.

  ఐతే ఇక్కడొక విషయం ఏవిటంటే, నక్సలైట్లు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం కాదు. ప్రభుత్వం లో భాగవైనటువంటి పోలీసులు, తామే జడ్జి, జూరీ, ప్రాసిక్యూటర్లలాగా వ్యవహరించి, నక్సలైట్లని ఎన్కవుంటర్ల పేరుతో ఖూనీ చేయడం, దానినే ప్రభుత్వ పోలసీలా అమలు చేయడం, మన సంఘం దిగజారుడు తనాన్ని తెలియచేస్తుంది. వొక్క విషయం మరచిపోకండి, ఆ సంఘంలో మనవందరం వున్నాం, మౌనంగానో, లేకపోతే వినిపించీ వినిపించని, సన్నని, అతిచిన్నని పిల్లికూతలు పెడ్తూ, మనవూ వున్నాం.

  రోడ్డు మీద ప్లాస్టీక్ సంచి గాలికెగిరితే సూమోటోగా స్వీకరించి కేసులు విచారించగలిగిన మన న్యాయ వ్యవస్థ, మనుషుల్ని విషం పెట్టి, పాఇంట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపినా, ఆ ఎగిరే ఖాలీ ప్లాస్టీక్ బేగ్కిచ్చిన విలువకూడా ఇయ్యదు.

  సరే ప్రభుత్వమైనా, న్యాయ వ్యవస్థ ఐనా, రాజకీయనాయకులైనా మరోలోకాల్నించి రాలేదు కదా. మనల్లోనించే వచ్చిన మనవేకదా. వాళ్ళు కక్యూమనలాగే ఇలాగే దాదాపు నిశ్శభ్ధంగా తమ అసమ్మతిని ప్రకటిస్తున్నారేవో.

  రవికిరణ్

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో