వేగం

తేది: November 24, 2006 వర్గం: వర్తమానం రచన: charasala 1,982 views

ప్రతిదానిలోనూ వేగం! పనిలో వేగం, ప్రయాణంలో వేగం, ఎదగడంలో వేగం, ఎగరడంలో వేగం! అన్నింటా వేగం. “ఎదగడానికెందుకురా తొందరా?..ఎదర బతుకంతా చిందరవందర..” అన్న కవి మాటల్ని పట్టించుకునేవారెవ్వరు? ప్రతిదీ వేగంగా జరగాలనుకోవడం ద్వారా మనిషి కొత్తది సాధిస్తున్నాననుకుంటున్నాడే గానీ వున్నది కోల్పోతున్నాననే స్పృహ వుండటం లేదు. కాన్సర్ కణం అభివృద్ది వేగం దేహానికి ప్రాణాంతకమైనట్లే మనిషి అభివృద్ది వేగం భూమికి ప్రాణాంతకమైపోయింది. కానీ ఒక తాడు ముక్కను గట్టిగా లాగేకొద్దీ అది తెగిపోవడానికి దగ్గరైనట్లు మనం అభివృద్ది చెందేకొద్దీ మన వినాశనానికి రోజులు మరింత దగ్గరైనట్లే! జీవుల మధ్య బలాబలాల సమతౌల్యతను చెడగొట్టాం. నీళ్ళలో ముంచినా, గాల్లో విసిరినా బ్రతకడం నేర్చుకున్నాం. అడవిలో జీవిని, నీటిలో జీవిని తినడం నేర్చుకున్నాం. దొరికే ప్రతిదాన్నీ తగలబెట్టి భూగోళాన్ని నిప్పుల కుంపటిగా మార్చేసి సముద్రాల సహనాన్ని పరీక్షిస్తున్నాం. కర్ఫూరం కాసేపు కాంతిమంతంగా వెలిగి ఆరిపోయినట్లు, మానవ అభివృద్ది వేగం కూడా ఉవ్వెత్తున ఎగసి ఒక్కసారిగా పతనమవుతుందేమొ!
ప్రకృతి ఒడిలో ఒద్దికగా ఇమిడిపోయి బతికిన ఆదిమానవుడికీ దాన్ని ఎదిరించి బానిసగా మార్చుకున్న ఇప్పటి మానవుడికీ సంతోషంలో తేడా వుందా?
ఏమొ! నామట్టుకు నా పల్లెటూరు అభివృద్దిని చూడని రోజుల్లోనే పచ్చగా, కళాకాంతులతో అందంగా ఆత్మీయంగా వుండేది. పేడతో అలికిన ముంగిటలు, ఆకులతో వేసిన పందిర్లు, నులకతో అల్లిన మంచాలు, మట్టితో చేసిన కంచాలు, ఇంటి ముందర పాడి, ఇంటెనుక మల్లెపాదు. మధ్యాహ్నం పొలాల్లో ఆముదాకు మీద అన్నాలు, రాత్రిల్లు వెన్నెల్లో డిన్నర్లు. మట్టితో చేసిన ఇంటి గచ్చు, బోదతో వేసిన పైకప్పు. చల్లని మట్టి కుండలో నీళ్ళు.
అలా ప్రకృతిలో మమేకమైన జీవితం.
ఇప్పుడు..పెంకులతోనో రేకులతోనే కప్పిన వాసారాల కింద ప్లాస్టిక్ నవారుతో అల్లిన ఇనుప మంచాలు. ఫానులు, గ్యాసు స్టవ్వులు, కరెంటుకు తిరిగే ఫ్యానులు, వెలిగే బల్బులు. మోటారు సైకిలు ప్రయాణం లేదంటే బస్సుకోసం నిరీక్షణం. ఆత్మీయతలు ఆ యింటినుండి ఈ యింటికి కారకుండా సిమెంటు గోడలు. ఏ ఇంటి ఆనందం ఆ యింటికే పరిమతమన్నట్లు ఇంటింటికో టివి. పాలు కావాలంటే పట్నానికెళ్ళి పాకెట్ తెచ్చుకోవాలి, చల్ల నీళ్ళు కావాలంటే కరెంటు వుండివుంటే ఫ్రిజ్ లోంచి నీళ్ళు తాగాలి. ఇప్పటిదంతా విద్యుత్తోరణాల కృత్రిమ అందం. తెచ్చిపెట్టుకున్న నవ్వే కానీ హృదయంలోంచీ రాదు.
ఈ వేగం అప్పుడు లేకపోయినా అప్పటిదే ఆనందం అనిపిస్తుంది. ఈ వేగం వచ్చి మరిన్ని వెతలు తెచ్చిందే గానీ సంతోషాన్ని తేలేదు.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'వేగం' పై 5 అభిప్రాయాలు

'వేగం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Sudheer Kothuri అభిప్రాయం,

  తేది: November 24, 2006 సమయము: 5:12 pm

  మార్పొక్కటే స్థిరం! మార్పు అనివార్యం! మార్పు వినాశకరం!-మనం అభివృద్ది చెందేకొద్దీ మన వినాశనానికి రోజులు మరింత దగ్గరైనట్లే!- అని మీరన్నట్లు

 2. radhika అభిప్రాయం,

  తేది: November 24, 2006 సమయము: 10:00 pm

  అవునండి.అంతా క్రుత్రిమం అయిపొయింది.

 3. రానారె అభిప్రాయం,

  తేది: November 24, 2006 సమయము: 10:39 pm

  నేనూ కొంత అంగీకరిస్తాను. కానీ, అలా ప్రకృతిలో మమేకమైన జీవితం సమకూర్చుకోవటానికి మనకు స్థోమత వున్నా, అటు వెళ్ళం. కారణం – ఒక్క గాలి వచ్చిందంటే ఒళ్ళంతా దుమ్ము, నులకలో నల్లుల భయం, శరీరం బాగా అలసివుంటేగానీ అందులో నిద్రరాదు,పాడి పంట మల్లెపాదు వుంటే తేళ్ళు జెర్రులు పురుగులు, వీటీకోసం కప్పలు, వీటికోసం పాములు, విద్యుత్ వెలుగు లేక్పోతే అవి కుట్టి చస్తామని భయం, మట్టితో చేసిన ఇంటి గచ్చులో జెర్రులకు కందిరీగలకు చోటులేకుండా పదేపదే జాగ్రత్తపడాలి, ఎండకు బాగా ఎండిన బోద తొలివానకు చిట్లి ఇంట్లో వానపొటుకులు పడుతుంటే అవి నేలపై ఆరేసిన వడ్లను తడపకుండా మనం పడే అవస్థ కంటే పట్నం బతుకు ఏంత సుఖం అనిపిస్తుంది. నామటుకు నేను అందుకు భయపడే, బాగా చదివి వుద్యోగం సంపాదించాలని పెద్దలు చెప్పినమాటను శిరసావహించడం. ఈ రెండు జీవితాలు చూడగలగడం నాకెంతో ఉపయోగపడుతోంది.

 4. సత్యసాయి అభిప్రాయం,

  తేది: November 25, 2006 సమయము: 1:30 am

  రానారె చెప్పింది సరైంది. పల్లెల్లో వాళ్ళకి పట్నజీవనం హాయనిపిస్తుంది. చాలా మటుకు మనిషి మనిషిగా బతకటం మర్చిపోవటం వల్ల వచ్చిన సమస్యలు, అనిపిస్తుంది.

 5. charasala అభిప్రాయం,

  తేది: November 28, 2006 సమయము: 12:31 pm

  సుధీర అభిప్రాయముతో నేను ఏకీభవిస్తున్నాను. “మార్పొక్కటే స్థిరం! మార్పు అనివార్యం! మార్పు వినాశకరం!” మార్పు తప్పదు, కానీ అదే వినాశ హేతువు కూడాను. రానారె చెప్పింది వాస్తవం. నా మట్టుకు నాకూ ఇది అనుభవమే! వరిమడికోసం బురదలో దున్నుతున్నప్పుడు ఏ రక్షణా లేక పాదాలు చీరుకుపోయేవి. వరిమడికి నీళ్ళు పెట్టడానికి గట్టువేంట వెళ్ళినప్పుడూ ఆకుల కరుకుదనానికి కాళ్ళకి గీతలు పడి వేడినీళ్ళతో కడుకుంటున్నప్పుడు మంట పెట్టేది. ఎండిన చెనక్కాయ ఒలిచిన తర్వాత దాన్ని వామి వేస్తుంటే చెమటా, దాని దుమ్ము కలిసి ఒంటిమీద పేరుకు పోయినప్పుడు, ఎండ చిరుబురులు తోడయితే ఆ బాధ అనుభవించాల్సిందే గానీ చెప్పత్రం కాదు. అప్పుడే అనుకునే వాన్ని పల్లె అందాలు సినిమాలో అందంగా వుంటాయే గానీ నిజానికి కాదు అని. వాటినుంచీ బయట పడాడానికి మనిషి ప్రయత్నం చేస్తూనే వుంటాడు. అందువల్ల మార్పు అనివార్యం. అయితే ఆ మార్పే వినాశనానినికి దగ్గరి దారి. అది తప్పదు.
  అప్పుటిలా ఇప్పుడూ కష్టపడి ఆ చిన్న బాధలని అనుభవించగలిగితే మనుగడ ఎక్కువ రోజులు. ఇక తేళ్ళూ, జెర్రులు అంటే నిజానికి వాటితో సహజీవనం చేస్తూ వారిబాటిన మనం మన బాటిన అవి పడుతూ వుంటేనే కదా సమతూకం. అది దెబ్బతిని మనిషి బలం ఎవ్వరూ ఎదిరించలేనంతగా పెరిగిబోబట్టి కదా ఈ దుస్థితి!

  –ప్రసాద్

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో