ఎందుకు ఈ అపనిందలు ఎంకొకరి జీవితాలపై…

తేది: November 12, 2006 వర్గం: వర్గీకరింపబడనివి రచన: dileep 1,777 views

గత వారం ఒక వార్త చూశాను, కరీంనగర్ జిల్లాలో 12 సం! అమ్మాయికి పెళ్ళి చేసి కాపురానికి పంపి, జ్వరం వస్తే అది కాస్తా దెయ్యం అని కర్రలతో బాదితే చనిపోయిందని! అది వాళ్ళ మూర్ఖత్వమా లేక తెలియని తనమా? ఏమనాలి..? ఆ ఊరు గురించి నాకు తెలియదు కాని మా ఊర్లో ఇలాంటిదే ఒక సంఘటన.        

       ఒక పుకారు షికార్లు చేసింది, అది ఏందంటే, దయ్యం కాదు కాని పులిరాజ అని. ఆ కుటుంబంలో ఈమె చివరిది, అన్న ఇల్లు వదిలి పట్నం చేరాడు, అక్కకేమొ తన సంసారం తన పిల్లలు, ఆమె ఎక్కడో వుంది, ఈమెకు కూడా పెళ్ళి  చేశారు కాని కొంచం గారాబంగా పెంచడం వలన పనికి వెళ్ళేది కాదు. పెళ్ళి తరువాత ఆ గారాబం అత్తవారింట సాగలేదు. సరె అని అమ్మ ,నాన్న దగ్గరే వుండేది. కొంత కాలానికి వాళ్ళు తనువు చాలించారు. ఆమెకు అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి. పనికి వెళ్ళదు. వయసులో కూడా ఆమె ఆరోగ్యంగా వుండగా నేను చూడలేదు. సరైన తిండి లేక ఆరోగ్యం ఇంకా క్షీణిచింది… ఈ సాకుతో ఊర్లోవాళ్ళు ఆమెకు పులిరాజు వేషాన్ని  వేశారు. అంతకు మునుపు ఎవరో ఓక్రి ఇంట్లొ అంతో ఇంతో దొరికింది తినేది. ఇప్పుడు అదికాస్తా దూరమయింది. తనకేమొ పులిరాజు లేదు అని ఈ ప్రపంచానికి నిరూపించడానికి కావల్సినంత స్థోమత లేకపోయె!
అన్నో, అక్కో, నేనో ఊరికి వెళ్ళినప్పుడు ఏ యాబయ్యో, వందో ఇస్తే తీసుకొనేది. ఈ పులిరాజు పుకారు  గురించి నాకు ఈమధ్యే తెలిసింది. సరే అని మా అక్కతో మాట్లాడి డాక్టర్తో పరిక్షలు జరిపిస్తే, అందులో తనకు అలాంటి భూతమేది  లేదని తేలింది. వున్నదంతా రక్తం తక్కువుగా వుండడమే. ఇప్పటికి ఎన్.సి.సి విధ్యార్థుల సహాయంతో రెండు సార్లు రక్తం ఎక్కించడం జరిగింది. ఇంకా ఈ పని రెండు మూడు సార్లు జరగాల్సి ఉంది. ప్రతి ఊరిలొ అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు వుంటారు గదా..  కాని ఎందుకు ఇలా అసత్య ప్రచారాలతో ప్రాణాలు తీస్తున్నారు. ఈ పులిరాజు  సంగతి ప్రజల వద్దకు అయితే వెళ్ళింది కాని, దానిపైన సరైన అవగాహన కలిగించడంలో విపలమయ్యారు అని అనుకుంటా. ఈ అవగాహన లోపమె ఇలాంటి అమాయకుల చావుకొచ్చిపడుతున్నది.
మహా అంటె  ఇప్పటికి పదిహేను వందలు కర్చు అయ్యుండొచ్చు. ఇంకా రెండుసార్లకి ఇంకంత కావచ్హు. ఒక మనిషి ప్రాణం విలువ, ఆత్మాభిమానాల విలువ అంతేనా??     

–దిలీప్  

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'ఎందుకు ఈ అపనిందలు ఎంకొకరి జీవితాలపై…' పై 1 అభిప్రాయము

'ఎందుకు ఈ అపనిందలు ఎంకొకరి జీవితాలపై…'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. venkataramana అభిప్రాయం,

    తేది: November 12, 2006 సమయము: 9:29 am

    ప్రతి మనిషి లొ వుంధెదీ భగవంతుని ఆత్మ యె అని ప్రతి మానవుదు తెలుసుకొన్న నాడే నీవు కొరుకున్నా సమాజాము స్ద్సా

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో