వేరు పడటం

తేది: October 25, 2006 వర్గం: వర్తమానం రచన: charasala 2,581 views

ఇది తెగని చాంతాడు. నాది, నీది అనేవి చచ్చుబారు వాదాలు. నాది అంటే చివరికి మిగిలేది నేనే. “నా” అనే మాయపొర నుండీ బయటకు వస్తే తప్ప మనం చేసే వాదనలో అసంబద్దత అర్థం కాదు. ఒకచోట వెనుకబాటు వుంటే ఆ వెనుకబాటును సరిదిద్దటానికి పూనుకోవాలి. ఒక యాసో, మాండలికమో అవహేళనకు గురవుతూ వుంటే దాన్ని సరిదిద్దాలి. ఇది నా బాష, ఇది నా ప్రాంతము, ఇది నా దేశము ఇవన్నీ మాయా భేదాలు. ఆ మధ్య మా తమ్ముడు ఇండొనీషియాలో వాళ్ళ మిత్రులని స్థానిక తమిళులు కొట్టారని చెప్పాడు. వాళ్ళంటే వీరికి భయం కూడానట (అమెరికాలో నల్లవాళ్ళను చూసి భయపడినట్లు). అంటే ఏమిటి, ఇక్కడున్నప్పుడు వాళ్ళే మన సోదర భారతీయులు, తీరా అక్కడికెళ్ళాక వాళ్ళు స్థానిక తమిళులు!
ఈ రాయలసీమ, తెలంగాణా ఈ గీతలు ఎవడు గీశాడు. ఆ గీతకు ఆవల నిలబడితే వాడు వేరు, ఇవతల నిలబడితే వీడు వేరు. బళ్ళారి మనతో కలిసివుంటే తెలుగు వాళ్ళు, కన్నడంతో కలిశారు గనుక కన్నడిగులు, లేదా కన్నడతెలుగు వాళ్ళు.
బాబర్ రాకముందు వరకు వాళ్ళూ హిందువులే కాకపోతే మరో భారతీయ మతం వాళ్ళు. కానీ ఆ మతం పుచ్చుకున్నాక (వంటి రంగు మాత్రం మార్చు కోలేదు) మాత్రం వాళ్ళు ముస్లిములు. ప్రతి హిందూ కుటుంబమూ పెద్ద కొడుకును సిక్కుగా మార్చేదట! లేకుంటే సిక్కులు ఆకాశం నుండీ వూడి పడ్డారా? ఇప్పుడు వాడు సిక్కు, నేను హిందువు!!
ఎక్కడన్నా అంతముందా ఈ విభజనకి? ఈ భేదాలకి? ఆంద్రాతో పోలిస్తే రాయలసీమ వెనుకబడింది. సీమతో పోలిస్తే తెలంగాణ వెనుకబడింది. రంగారెడ్డితో పోలిస్తే నల్గొండ వెనుకబడింది. నల్గొండలో ఆ వూరితో పోలిస్తే X వూరు వెనుకబడ్డది. ప్రత్యేకం అయిపోవడమే మందయితే పంజాభ్ కంటె వెనుకబడ్డందుకు ఆంద్రప్రదేశ్ ఇండియా నుండీ వేరుపడాలి. ఆంద్రా కంటె వెనుకబడ్డందుకు బీహార్ వేరుపడాలి. ఇంత పెద్ద దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్దికి నోచకున్నా అందరమూ కలిసివున్నప్పుడు ఆంద్రాలో అసమానతలున్నప్పుడు మాత్రం కలిసి వుంటే తప్పేంటి?
ఇక భాష. ఒక ఇంట్లో వున్నవారే ఒకలా మాట్లాడలేరు. మా నాన్న మాట్లాడినట్లు నేను మాట్లాడలేను. నాలా మా అన్న మాట్లాడలేడు. అయినా ఒకరు మాట్లేడేది ఇంకొకరికి అర్థం అవుతూనే వుందిగా! ఎక్కడైనా వున్నట్లు అభివృద్ది చెందినవాడి మాటే వేదవాక్కు అవుతుంది. అందరూ అంగీకరించిందే ఇష్టమున్నా లేకున్నా మిగతావారూ అంగీకరించాలి. లేకుంటే అవ్యవస్థ అవుతుంది. నిజాం పరిపాలనతో తెలంగాణ తెలుగు, ఒరియా, మరాఠీ, తమిళ, కన్నడ బాషల సంకరంతో సరిహద్దు జిల్లాల భాషలూ తమతమ అసలు రంగును వెలియించుకున్నాయన్నది బహిరంగ సత్యము. నేను ప్రొద్దుటూరులో చదువుతున్నప్పుడు అక్కడి హాస్టల్లో మజ్జిగను మోర్ అంటుంటే ఇదేం భాషరా బాబూ అనుకున్నా. నాదీ కడప జిల్లానే మరి. ఇంకా ఆశ్చర్యమయిన సంగతి ఏంటంటే “తీసుకుపో” అనడానికి అక్కడ “కొండుబో” అంటున్నారు. అలాగే మాకు కేవలం 50 మైళ్ళు కూడాలేని మా బందువుల వూరిలో చిత్తూరు యాస మాట్లాడతారు. ఆ వూరిలో వున్న మా అక్క “ఏందప్పా ఎప్పొడొచ్చినావు?” అంటే నాకు ఆమెలోని ఆప్యాయత కనిపిస్తుందే కానీ బాషలోని యాస కాదు. ఒక జిల్లాలోనే ఇన్ని తేడాలుంటే ఇక దేన్ని నాదనాలి దేన్ని నీదనాలి? ఇక సముద్రజలాలకే సరిహద్దులైన క్రిష్నా జిల్లా తెలుగే మిగతా వాటి కంటే అంతో ఇంతో శుద్దైన బాష అంటే మనకు అభ్యంతరమెందుకు?
నాకు అర్థం కాని ఇంకో విషయమేమిటంటే తెలంగాణ ప్రత్యేక రాష్త్ర మయినంత మాత్రాన కోస్తా జిల్లాలవారు అక్కడికి తమ నివాసం మార్చి వాళ్ళతో పోటీపడకుండా ఆపుటెట్లు? కాశ్మీరుకు ప్రత్యేకాధికారాలున్నట్లు తెలంగాణకు ఇవ్వడం సాధ్యమయితే తప్ప అక్కడ ఇతరులు అస్తులు కొనకుండా, వుద్యోగాలు సంపాదించకుండా ఆపటం ఎలా?
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 1.00)
Loading ... Loading ...

'వేరు పడటం' పై 11 అభిప్రాయాలు

'వేరు పడటం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. cbrao అభిప్రాయం,

  తేది: October 25, 2006 సమయము: 10:43 pm

  ఎందుకు ఆపాలి?

 2. Balasubrahmanyam అభిప్రాయం,

  తేది: October 26, 2006 సమయము: 8:29 am

  Prasad Gaaroo ! సదరు Reservations Topic మీద చర్చ ప్రారంభించిన వాళ్ళం మనమే దాన్ని ఒదిలేసి చాలా రోజులయింది కదా ! ఈ శ్పాము వీరులు ఎవరబ్బా ? వాళ్ళ బ్లాగు లంకెల్లోకి వెళ్ళి కడిగేయ్యాలి. అసలు వాళ్ళు బ్లాగర్లేనా ?

 3. నాగరాజా అభిప్రాయం,

  తేది: October 26, 2006 సమయము: 8:48 am

  కలగూర గంపాయనమ:

 4. ramulu అభిప్రాయం,

  తేది: October 29, 2006 సమయము: 7:03 pm

  ప్రసాదు గారు,
  వేరుపడటంపిపైన మీరుప్రస్తావినచిన లేక ప్రవచించిన సూత్రాలన్ని మద్రాసురాస్ట్రం నుండి ఆంధ్ర-సీమలను వేరైన , లేక పంజాబు నుండి హర్యానా లేక ఇతర హిందీ రాస్ట్రాల వేరైన విషయంలొ కూడ వర్తిస్తాయి.మా తెలంగాణా వారి అసలు బాధంతా కొల్ఫోయిన లక్షలాది ఉదోగాలు మరియు లెక్క లేకుండా దోచుకోబడుతున్న నీళ్ళూ,మిగతా అంశాలన్నీ తరువాత లెక్క్ల లోకివస్తాయి.వీటిని ఇవ్వ కుండ యెన్ని యెవరు చెప్పినా ,రాసినా మావారికి గాలి కబుర్ల కిందే లెక్క. ఇకముందఐనా అవి దక్కా లంటే వేరుకావడ మొక్కటే మార్గం . ఐతే అదంతసులభం కాదని మాకూ తెలుసు .ఇంకా మావాళ్ళ లోనె ఐక్య తరాలేదు ,ఇతరులను అనేం లాభం . కస్ట తరమని మన స్వతంత్ర యోధులు అనుకుంతే భారతావనికి స్వ తంత్రం వచ్చేదా? మా పోరూ అంతే. ఇటువంటి చర్చ మన సాధారణ&మధ్య తరగతి తెలుగు ప్రజల మద్య్హ జరగడానికి మన తెలుగు పత్రికలు ప్రోత్సహించివుంటే వేర్పాటువాదానికి ఇంత మద్దతు వచ్చేది కాదేమో బహుశ:.

 5. charasala అభిప్రాయం,

  తేది: October 30, 2006 సమయము: 10:26 am

  రాములు గారూ,
  మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.
  అవును మద్రాసునుండీ ఆంద్ర వేరైనా పంజాబు నుండీ హర్యానా వేరైనా నా ఆబిప్రాయమదే. కాకపోతే నీళ్ళకోసం హర్యానా, పంజాబ్‌లు గొడవపడినట్లు రేపు తెలంగాణ మిగిలిన ఆంద్ర గొడవపడి నీళ్ళను సముద్రం పాలు చేయవు గదా!
  నిజానికి వేరుపడినా, కలిసివున్నా నాకు పెద్ద తేడా లేదు. అలా అయినా ఇలా అయినా అందరూ సహృదయంతో సోదరత్వంతో పగలు సెగలు లేకుండా వుంటే చాలు. తెలంగాణ విడిపోవడం అభివృద్ది కోసమే అయితే, అభివృద్ది చెందితే అంతకంటే కావలిసింది ఏముంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి అభివృద్ది మంత్రంగా ఒకరికి ఒకరు సాయపడుకుంటూ మెలిగితే నష్టమేముంది.
  కాకపోతే నీవు నేను అనే భేదాలతో నష్టపోతారేమొననే నా దిగులంతా!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. ramulu అభిప్రాయం,

  తేది: October 30, 2006 సమయము: 5:56 pm

  ప్రసాద గారు,
  దొంగలుబడ్డ ఆరు నెల్లకు కుక్కలు మొరిగినట్టు అనెఅ ది సామెత . ఐతే మేము (తెలంగాన వాళ్ళొం)మొరుగుతున్నది మొదలుబెట్టింది ఆ.ప్ర. 1969లొ అంటే 13 సం.ల తరువాత అన్నమాట. అప్ప టినుండి ఇప్పటి వరకు ఆగకుంట కూస్తునే వున్నాం. కాని సమస్య ఎంతకూ తేలుత లేదు. ఏరాస్ట్ర విభ్జనలో లేని సమస్యలు తెలగాణ విషయంలో మాత్రమే యెందుకు ఎదురౌతున్నయి ? . ఎందుకంటే ఏరాస్ట్రంలో గూడ పెద్ద విభాగం(పెద్ద ప్రాంతపు భాగస్తులు) మన రాస్ట్రం లో లాగ అడ్డు పడలేదు,ఆటంకాలను కలిగించలేదు. ఎండిఎ కాలంలో ఏర్పడిన 3 రాస్ట్రాలను చూడండి . ఝార్ఖండ్లో కొద్దిగా లాలు కొంతకాలం అడ్డుపుల్లలు వేసినా ,తరువాత పక్క కు తప్పుకున్నాడు. ఐతే మన రాస్ట్రంలో అట్లా ఎందుకు జరగటలోలేదు. ఎందుకంటె కొద్దిమంది ఇతర ప్రాంతీయులు తెలంగాణలో తా ము అన్ని మార్గాల్లో సంపాదించుకున్న వేలకోట్ల రూపాయిలను పరిశ్రమలరూపంలొ,భూములరూపంలో,భవనాలరూపంలో,స్టూడియోలరూపంలో ,ప్రైవేటు విద్యాసంస్థల్రూపంలో,ప్రైవేతు ఆస్పత్రులరూపంలలోకలిగివుండడమే ప్రధాన కారణం. ఇట్లా దండుకున్న వాళ్టిల్లో మా తెలంగాన వాళ్ళకు రావాల్సిన వుద్యోగాలను కొట్టేసి , అడ్డంగా మేసేసి సంపాదించుకున్న వాళ్ళు కూడా వున్నారు . వాటినన్నిటిని కూడా ఆ.ప్ర.ను ఒకటిగా వుంచగలిగితేనే కాపాడుకో గలుగుతామనే భయం వారిని పట్టి పీడిస్తున్నది. అడ్డు తగిలేది వారు , వారిపరివారమే. కొంతమంది మా తెలంగాణ వారి స్వార్దం కూడా తోడయ్యింది.జరిగిందంతా మన తెలుగు వాళ్ళం ఒక్క దగ్గర కలిసి వుండ్లేని పరిస్తితిని కల్పంచాయి. రాస్ట్రం వెరుకావలని అందరితోపాటు డిమాండ చేయడం నాకు కష్టంగానే వుంది.

 7. ramulu అభిప్రాయం,

  తేది: October 30, 2006 సమయము: 6:42 pm

  మన ప్రాంత కాంగ్రేసు నాయకులు69 నాటి ఉద్యమరోజుల్లో యెలా ప్రవర్తించారొ కాళోజి వ్రాసిన్ కవిత్వంలోని కొన్ని చరణాలు నాలు ఇప్పటికంగ్రేస్ నాయకులను చూస్తుంటే పదే,పదే గుర్తొస్తుంటాయి ,వాటిని మీరందరు కూడా గుర్తుంచుకుంటే (ప్రస్తుత ఉద్యమ సందర్భంలో)బాగుంటుందని ఇస్తున్నాను.
  ఎవరనుకున్నారిట్లౌనని-ఎవరనుకున్నారిట్లౌనని
  అంకెలగారడిచేస్తూ-చంకలెగురవేస్తారని
  ప్రాంతాన్ని పాడుచేస్తు-శాంతి,శాంతి అంటారని —”ఎవరనుకున్నారు”
  ముఖ్యమంత్రే స్వయంగ సఖ్యత ఛేదిస్తాడని
  ప్రాంతీయాద్యక్షుండే పక్క తాళమేస్తాడని –”ఎవరనుకున్నారు”
  కావలి కుక్కలు దొంగల-గంజికాశపడ్దతాయని
  కావలి వాడే దొంగల-కావళ్ళు మోస్తాడని —”ఎవరనుకున్నరు”
  కడుపుల్లొ చిఛుబెట్టి-కళ్ళు తుడువ వస్తారని
  ప్రజాస్వామ్య విదానాన్నె-బదనాము చేస్తారని –”ఎవరనుకున్నరు”
  నమ్మక ద్రోహంచేస్తు గూడ-గమ్మునగూర్చుంటారని
  శాసన సభ ఉండి కూడ-మోసమే చెస్తారని —”ఎవరనుకున్నారని”
  కాళోజి వ్రాసిన వ్యాఖ్యలన్ని మన తెలంగాణ కాంగ్రేసు వాళ్ళని మరియు ఆంధ్ర కాంగ్రెసువాళ్ళని కలిపిరాశాడు –ఈ వాఖ్యలు ఇప్పటికి వర్తిస్తాయి.
  Bye

 8. ramulu అభిప్రాయం,

  తేది: October 31, 2006 సమయము: 4:35 pm

  ప్రసాదుగారు,
  తెలంగాణ వేరైతే తదుపరి అభివ్రుద్ది సాధిస్తే అంతకంటే కావలసిందేముందని నామొదటి అభిప్రయానికి జవాబుగా రాశారు . ఐతే మేము చెప్పేదేమంటే మాతెలంగాణ ప్రాంతంమీద జరిగే దోపిడీ ఆగిపోతే అభివ్రుద్ది ఎంత తక్కువ ,ఎంత నిదానంగా జరిగినా ఇప్పటికంటె బాగుంటుందని మావాళ్ళలో ఎక్కువమంది నమ్ముతున్నారు. అది మీరు అర్దం చేసుకుంటే మీ వ్యాసం బహుశ: మరోతీరుగా ఉండేదని నా అభిప్రాయం.

 9. charasala అభిప్రాయం,

  తేది: November 1, 2006 సమయము: 2:24 pm

  రాములు గారూ,
  మీ అభిప్రాయాలకు కృతజ్ఞతలు.
  ఇతర ప్రాంతీయులు సంపాదించుకోవడం తప్పంటున్నారా? లేక సంపాదించిన దాంతో పరిశ్రమలు, స్టూడియోలు, భవనాలు కట్టడం తప్పంటారా? కట్టిన పరిశ్రమలు, స్టూడియోలు ఇతర ప్రాంతీయులకు మాత్రమే వుద్యోగాలు ఇస్తామంటున్నాయా? లేక తెలంగాణీలకు కూడానా?
  కోస్తావాళ్ళు ఆపని చేయకపోతే మరాఠీలి చేస్తారు లేదా MNCలు చేస్తాయి.
  మౌగ్గురు ఓ వరుసలో నడుస్తున్నారంటే ఖచ్చితంగా ఒకడు ముందు, ఒకడు వెనుక, ఇంకోడు మధ్యలో నడుస్తుండాలి. ఇందులో కోస్తా వాళ్ళు ముందులో వుండడం చరిత్రలో జరిగిన ఎన్నో సంఘటనల వల్ల జరిగింది. తెలంగాణా వుద్యోగాలను ఇతరులు ఎలా కొట్టేశారు? అందుకేమైనా ప్రత్యేక చట్టాలు తెచ్చి అధిక శాతం వుద్యోగాలు తెలంగాణేతరులకే చెందాలన్నారా? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద వుండటం వల్లనో లేక మరొకందుకో చారిత్రకంగా ఇతర ప్రాంతాల వారి కంటె విద్యలో, ఆస్తుల్లో ముందున్నారు గనుక రాయల సీమ కంటె తెలంగణా కంటే ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళలోనైతే నేమి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళలోనైతే నేమి కోస్తావాళ్ళు ఎక్కువమంది వున్నారు. 70లలో అమెరికా వెళ్ళిన దాక్టర్లలో ఎక్కువ తెలుగు వాళ్ళెవరు? అలానే విద్యలో వెనుక బడిన (నైజాము వల్లైతేనేమి, భూస్వాముల వల్లైతేనేమి) తెలంగీణీయులపై కోస్తా వాళ్ళు పైచేయి సాధించి ఎక్కువ వుద్యోగాలు సంపాదించారు. ఇదంతా చట్టబద్దంగా సాగిందేకదా? ఇప్పుడు కావల్సిందేమిటి..సామాజికంగా బలహీన వర్గాలకిచ్చినట్లుగా.. తెలంగాణాకి ప్రాంతీయ రిజర్వేషను కల్పించడం. అది చిత్తశుద్దితో నెరవేర్చే నాయకులు వుంటే చాలు.
  ఇక మీరు మా వనరులు కొట్టగుంటా వుంటే చాలు అభివృద్ది నిదానంగా జరిగినా చాలు అంటున్నారు. ఇదెలా వుందంటే నేను తినకున్నా ఫర్వాలేదు వాడు తినకూడదు అన్నట్లుంది. కెజి బేసిన్ వున్న చమురు, గ్యాస్ వాళ్ళే తింటున్నారా? తెలంగాణలో బొగ్గంతా తెలంగాణకే సరిపోతుందా? ప్రపంచమంతా ఒకరిమీద ఒకరు ఆధారపడుతున్న రోజుల్లో ఒక భాష మాట్లేడేవాళ్ళు ఎందుకు ఆధారపడలేరు? మీ వూర్లో కోస్తావాడు పరిశ్రమ పెట్టి బాగుపడేదానికి ఒక తెలంగాణా వాడూ బాగుపడేదానికి తేడా ఎక్కడ వచ్చింది? వాడైనా వీడైనా “నీవు” కానంత వరకు అది వేరే వాడే కదా?
  ఇక మీరు హైదరాబాదులో ఆస్తులు కొనడం గురించి అంటారా? డబ్బులు చేతిలో వున్నవాడు తెలుగు రాజధానిలో కొనక కన్నడ రాజధానిలో కొంటాడా?
  నేనొప్పుకుంటాను…అంతకుముందే అధికులైన(విద్య, ఆస్తి) వారి సరసన ఇప్పుడప్పుడే పైకి వస్తున్న వాళ్ళు పోటీపడాలంటే ఆదిలో కొన్ని రక్షణలుండాలి, కానీ ప్రత్యేక రాష్ట్రం కాదు.
  ఇక ప్రత్యేక రాష్త్రానికి ఇతరుల వ్యతిరేకత అంటారా? నిజానికి కలిసుండాలనే ఆశ వారికుందేగానీ, నిజంగా తెలంగాణా ఏర్పడక వుండని పరిస్థితులు వస్తే వద్దే వద్దని వాల్లు వుద్యమాలు చేస్తారా? అదెప్పటికీ జరగదు. వారి వ్యతిరేకత సైద్దాంతికమే గానీ ఆచరణం కాదు.

  –ప్రసాద్

 10. ramulu అభిప్రాయం,

  తేది: November 2, 2006 సమయము: 3:20 pm

  మీ జవాబులకు క్రుతజ్ఞతలు.
  ప్రపంచములోని అన్ని దేశాలకు అమెరికాతోసహ మా తెలంగాణవాళ్ళు పనికి వస్తారు,సోమరులుగా వారికి కనిపించరు,కాని ఆంధ్ర-రాసీమలకు మాత్రం మావరెందుకూ పనికిరారు.ఐతే తెలుగు సోదరులైన పాపానికి తెలంగాణా వారికి ఆ.ప్ర.లోని ఇతర ప్రాంతాల్లో వుద్యోగాలు ఇవ్వరు.పోనీ మా తెలంగాణాలో పెట్టిన పలు రకాలైన సంస్థలలోనైన ఇస్తరేమోనంటే అక్కద కూదా ఇవ్వరు.ఈ సాఫ్ట్వేర్ ఉదోగాలొచ్చి,ఔట్ సోర్సింగ్ ఉదోగాలు దేసంలోని ఇతర రాస్ట్రాలలో దొరికి ,గల్ఫ్ దేశాలకు పొయ్యి కొన్ని వేలమంది తెలంగాణవళ్ళు బతకకుంటే ఇంతకుముందు జరిగిన ఆత్మహత్యలకు మరికొన్ని వేలు తోడై వుండేవి .అదే జరిగివుంటే మీరేది రాసినా స్పందించేవాళ్ళుకూడ కరువై ఉండేవాళ్ళు .
  తెలంగాణకు రాజ్యాంగ బద్దంగా ఉండిన ముల్కి నిబందనలు,ప్రాంతియ బోర్డులు ఎవరు తొలగించారో తెలుసుకోండి.ఆ.ప్ర.ఏర్పడి నప్పటినుండి ఇంతవరకు ప్రాంతేతరులు కైవసం చేసుకున్న లక్షలాది ఉద్యోగాలు యెవరి తోడ్పాటుతో, ఏఅధికారంతో జరిగాయో తెలుసుకోండి.పెద్దమనుషుల ఒప్పందము ప్రకారంగా జనాభా ప్రాతిపదికన 44 శాతం కొత్తగా వచ్చిన వుద్యోగాలలోగాని,పదవుల విరమణతో కాళీఈ ఐన వాటిలోగాని తెలంగాణ వాళ్ళ్కు వాటా ఇచ్చారా మీ ప్రాంతపు నిపుణులను ,చరిత్రకారులను కనుక్కోండి. ఇదంతా ఇక్కడ వాదించాల్సిన ,రాయల్సిన అవసరం లేదు.మీరు తెలుసుకుని సంత్రుప్తి చెందితే చాలు.


 11. తేది: June 4, 2007 సమయము: 10:15 am

  [...] వేరు పడటం [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో