నేను (బహుశా మీరు కూడా) మరిచిపోతున్న తెలుగు పదాలు:

తేది: June 7, 2006 వర్గం: నా భాష రచన: charasala 6,449 views

చట్టి : మట్టీతో చేసిన చిన్న పాత్ర. కూరలు చేయడానికి ఉపయోగిస్తారు.మూకుడు: చట్టీ లేదా కుండ మీద మూయడానికి ఉపయోగించే మట్టితో చేసిన వృత్తాకారపు పాత్ర.

ఉట్టి: (బహుశా కృష్నాష్టమి పుణ్యమా అని ఇది మాత్రం గుర్తుండవచ్చు) తాళ్ళతో తయారుచేసిన వలలాంటి వస్తువు. దీన్ని ఇంటిలో పైన కర్రలకు వేలాడదీస్తారు. పిల్లులనుండీ, చీమల నుండీ, చిన్న పిల్లల నుండీ వంటలను కాపాడడనికి ఉపయోగిస్తారు. గోపికలు వెన్నని కృష్నుడికి అందకుండా వీటిమీద దాచేవారు. వాడుకలోని సామెత: ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఎక్కునా?

పొంత: పొయ్యిలో మూడవ రాయికి బదులుగా ఉపయోగించబడే నీళ్ళతో నింపిన కుండ. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే వంట అయేసరికి కుండలోని నీళ్ళుకూడా కాగి స్నానానికి ఉపయోగపడతాయి.

ముంత: మట్టితో చేయబడిన చిన్న పాత్ర, నీళ్ళు, మజ్జిగ, కల్లు లాంటి ద్రవాలు త్రాగడానికి ఉపయోగించేది.

తలుగు: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి వాడే తాడు.

చూరు: కర్రలతో కప్పబడిన ఇంటికి గోడ దాటి బయటకు వచ్చిన కప్పుభాగము. వాడుక సామెత: కాళ్ళు పట్టి లాగితే చూరు పట్టుకు వేలాడినట్లు.

వాసము: ఇంటి పైకప్పుకు వాడే పొడవాటి బలమైన కర్ర.

దూలము: ఇంటి రెండు గోడలను కలుపుతూ పైకప్పుకు ఆధారమైన పెద్ద బలమైన కర్ర.

నిట్రాయి: చుట్టిల్లుకు ఇంటి మద్యలో నాటబడి పైకప్పును మోసే పెద్ద దూలము.

చుట్టిల్లు: వృత్తాకారములో కట్టబడిన ఇల్లు.

నులక: కర్ర మంచాన్ని అల్లడానికి ఉపయోగించే సన్నటి తాడు.

నులక మంచము: నులకతో అల్లబడిన మంచము.

మంచంకోళ్ళు: మంచము యొక్క నాలుగు కాళ్ళు.

జాలాడు: స్నానం చేసే దొడ్డి.

పంచ: ఇంటి ద్వారము బయట ఇరువైపులా ఉన్న ప్రదేశము. సాధారణంగా ఈ ప్రదేశములో అరుగులు ఉంటాయి.

చటాకు: పావులో సగము. 0.125

బాన: పెద్ద కుండ.

దొంతి: కుండ మీద కుండ పెట్టి ఏర్పరిచిన కుండల వరస. కింద పెద్ద కుండ దానిమీద కొంచము చిన్నకుండ అలా పెట్టుకుంటూ పోతారు.

గుంజ: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి పాతిపెట్టబడిన కర్ర. పందిరికి ఆధారంగా పాతిన కర్ర.

ఎనుము: రాయలసీమలో గేదెను ఎనుము అంటారు.

పడ్డ: ఇంకా ఈనని వయసులో ఉన్న పడచు గేదె.

పరాందం కాయ: బొప్పాయి పండు.

కపిల: ఎద్దులు, బొక్కెన సహయముతో వ్యవసాయానికి బావి లోంచి నీళ్ళను తోడే పద్దతి.

బొక్కెన: ఎద్దుల సహాయముతో బావిలోంచి నీళ్ళను తోడటానికి ఉపయోగించే పెద్ద తోలు సంచి.

మోకు: బొక్కెన లాగడానికి ఉపయోగించే పొడవైన, లావైన తాడు.

కాడి: రెండు ఎద్దుల మెడ మీద ఉంచే కర్ర. దీనికి ఎద్దుల మెడకు కట్టాడనికి కావలిసిన పట్టెడలు ఉంటాయి.

పట్టెడ: తాళ్ళతో తయరి చేసిన బెత్తెడు వెడల్పు, మూరడు పొడవుండి కాడికి ఎద్దులను కట్టివేడానికి ఉపయోగించేది.

కుప్పె: ఎద్దు కొమ్ముల చివర్లకు తొడిగే లొహంతో చేసిన అలంకార వస్తువు. (ఎద్దు వాడైన కొమ్ముల నుండీ రక్షణ కొరకూ కూడా)

గాడి: ఎద్దులకు మేత వేయుటకు చుట్టూరా రాతి బండలతో గాని, కర్రలతో గాని ఏర్పరిచిన ప్రదేశము.

కుడితి: గేదెలు తాగే తవుడు, అన్నము, గంజి కలిపిన నీళ్ళు.

చిక్కము: ఎద్దులు పంటను తినకుండా మూతులకు కట్టే, తీగలతో చేసిన వస్తువు.

– ఇంక గుర్తు రావటం లేదు. ఈ పదాలు కడప జిల్లా, రామాపురం మరియు లక్కిరెడ్డి పల్లె ప్రాంతాలలో వాడె పదాలు. మీకు తెలిసినవి కూడ ఇందులో చేర్చండి. వీలైనప్పుడల్ల విటిని వాడండి. లేకపొతే కొన్నాళ్ళకు చాలా పదాలు మనకు కనపడకుండ పొయే ప్రమాదం ఉంది.

– ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'నేను (బహుశా మీరు కూడా) మరిచిపోతున్న తెలుగు పదాలు:' పై 5 అభిప్రాయాలు

'నేను (బహుశా మీరు కూడా) మరిచిపోతున్న తెలుగు పదాలు:'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. aandhrudu అభిప్రాయం,

  తేది: November 24, 2006 సమయము: 11:53 am

  avunanDi….konni padaalu chadutunTae chinnappaDu oorloa maaTlaaDutukunae maaTalu gurtochchcaayi…bath room anae padam ee madhy avaaDutunnaam gaaani chinnappuDu anta familiar word kaadadi…jaalaaDu anna padam marchae poayaamu..

  good work…


 2. తేది: December 19, 2006 సమయము: 2:37 am

  [...] చరసాల ఆలోచనా శక్తికి, పరిశీలనా పటిమకు మరో తార్కాణం.. అక్రమంలో క్రమం ( http://www.charasala.com/blog/?p=116)! “ బొంగరం తిప్పినపుడు అది మొదట్లో బాగానే స్థిరవేగంతో తిరుగుతున్నట్లు అనిపించినా క్రమక్రమంగా దాని వేగాన్ని పోగొట్టుకొని చివరికి పడిపోతుంది. అది తిరిగిన మొత్తం కాలంలో ఒక చిన్న డెల్టాX కాలం లో అది స్థిరవేగంతో తిరిగినట్లే అనిపిస్తుంది అంతమాత్రాన అది ఎప్పటికీ స్థిరవేగంతో తిరిగినట్లు కాదుకదా!” సృష్టిలో క్రమమనేది లేదనే తన వాదన కోసం చరసాల ఈ పోలిక చూపుతాడు. ఇలాంటి పోలికలు మరికొన్ని ఉన్నాయా జాబులో. అత్యుత్తమ జాబుల్లో ఇంకోటి. [...]


 3. తేది: August 15, 2011 సమయము: 12:59 am

  [...] పటిమకు మరో తార్కాణం.. అక్రమంలో క్రమం ( http://www.charasala.com/blog/?p=116)! “ బొంగరం తిప్పినపుడు అది మొదట్లో [...]

 4. వేంకటేశ్వర యాదవ్ అభిప్రాయం,

  తేది: June 26, 2014 సమయము: 1:28 am

  ప్రసాద్ గారు ! ధన్యవాదములులుఎ
  తెలుగు భాష తరువాతి తరాలకు తీసుకెళ్ళే మీ ప్రక్రియ చాలగుబాగుందండి, ప్రస్తుతం వాడుకలో లేని చక్కని పదాలను తెలిపి ఎంతో భాషకు ఎంతో మేలు చేసారు.

  - వేంకటేశ్వ యాదవ్

 5. కొండుభొట్ల. చంద్రశేఖర్ అభిప్రాయం,

  తేది: March 20, 2018 సమయము: 1:10 pm

  చాలా చక్కని వుద్దేశ్యం. మంచి ప్రయత్నం.
  అభినందనలు, ప్రసాద్‌గారూ.
  మనవంతు కృషి మనమందరం తప్పక చేద్దాం.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో