ఎంతగా మారి పొయింది నా పల్లె చూస్తూ చూస్తుండగానె…!

తేది: October 22, 2006 వర్గం: వర్గీకరింపబడనివి రచన: dileep 2,211 views

మాది ఒక చిన్న పల్లెటూరండి.. పది సంవత్సరాల్లో   చూస్తూ చూంస్తుండగానే ఎంతగా మారిపొయిదంటె అంతగా, ఏదొ అభివృద్ది తో అని పప్పులో కాలేసేరు..
పాత పేరు అగ్రహరం అండి ,, ఆ పేరు ఎందుకొ మీకు తెలిసే వుంటుంది  అనుకుంటాను? ఏమి లేదండి పూర్వం మొత్తం ఆ ఉరిలో బ్రాహ్మణులు వుండేవారు అందుకే ఆ పేరు.. ఇప్పటి(చికెన్ గున్య ,డెంగు)లాగె అప్పుడు కలరా వచ్హి మొతం ఖాళి చేసి వెళ్ళి పోయారు.. తరువాత  పక్కనే ఊరు వెలసింది, కల్పనాయునిచెరువుగా. ఈ పెరులొనే వుంది,, పూర్వం కల్పనాయుడు అనే నామధేయుయుడు ఆ చెరువు కట్టించాడు. అందుకే ఆ పేరు. పేరుకు తగ్గట్టుగానే చెరువు పక్కనే ఊరు వుంటుందడి. ఊరిలోనుంచి అడుగేస్తే చెరువే. వర్షాకాలం లో చూడాలి ఆ అందం. చాల చాల అందంగా వుంటుందండి. చెరువు నిండా నీళ్ళు … ఆ నీళ్ళ మద్యలొ అక్కడక్కడ చెట్లు.. ఆ చెట్లపైన తెల్లటి కొంగలు, నీళ్ళ పైన నల్లటి బాతుకోళ్ళు, చెరువు కోళ్ళు. ఇంకా అలా ఒంపు సొంపుల వయ్యారంగా చెరువు కట్ట, కట్ట  ఎక్కడానికి ముందే జలజలా  పారే  నీటి వంకా, అలా చెరువు గట్టు పైకి ఎక్కగానే, కట్ట పైనే ఒక పెద్ద మామిడి చెట్టు, ఆ పక్కనే తెల్లటి రంగులొ మెరిసే శివాలయం, అ పక్కనుంచి చూస్తే చెరువు కింది భాగాన పచ్చటి పైర్లు, అక్కడ పాటలు పాడుతూ నాట్లు వేయడం, కలుపు తీయటాలు కనిపిస్తాయి. అలాగే మొగలి పొదల వాసనలు పీల్చుకోవచ్హు. అలాగే కొంచం దూరంగా మూడు దిక్కులా నల్లమల కొండలు, చెరువు పై బాగాన వేరుశనగ చేలు… అబ్బో…ప్రతి ఇంట్లో ఒక ఎడ్లబండి, పది ఆవులు పది బర్రెలు, మా ఇంట్లోనె ఎక్కువగా వుండేవి మొత్తం 50 ఆవులు 20 బర్రెలు వుండేవి… ఉదయాన్నే తా ఎంత సందడిగా వుండేదో ఉర్లో! సుబ్బిగా ఈరోజు మాకు తవ్వకానికి వస్తున్నావా లేదా అని ఒకవైపు, బర్రెలను తోలండని యానాది కేక ఒకవైపు, ఆవులను తొలండని ఒక వైపు కేకలు… అలాగె బట్టల మూటతో సాకలి, మంగలి డబ్బాతో మంగలి…అరెరెరె కొంచం ఈగడ్డం గీకురా పనికెల్లాలి…అలాంటి కేకలు…పొలాల దగ్గరా కొన్ని సార్లు తిట్టు మాటలు (వాల్ల పొలాలొ ఎవరైనా కనిపించినపుడు), మళ్ళీ సాయంత్రంగా అదే కోలాహలం…సాయంత్రంగా ప్రతిఒక్కరూ ఎద్దులబండి నిండా గడ్డి వేసుకొని…ఆ బండిపైన సాయంత్రం ఆచెరువు నీళ్ళలో నుంచి వస్తూ ఆ పక్షుల కిలకిలలు చాలా బాగా వుండేది. పొంగలి కంతా పాడు బడిన అగ్రహరాన్ని అందరు వేరుశనగ కుప్పలు వేసుకోవడానికి ఉపయోగిస్తారు, అలా పూర్తిగా బిజి బిజి గా వుండేది..
 కాని ఈ పది సంవత్సరాల్లో చాల మార్పు వచ్హిందండి. ఇప్పుడు ఆ చెరువు నిండడం మానేసింది. ఆ వేరుశనగ చేలు ఇప్పుడు ఎడారుల్లాగా కనిపిస్తాయి… ఒకప్పుడు ప్రతి ఇంట్లో వేరుశనగ కుప్పలో , వడ్లకుప్పలో కనిపించేవి కాని ఇప్పుడు అవేమి కని పించవు. ఎవరింట్లోనూ ఇప్పుడు ఆ ఆవులు లేవు, బర్రెలు లేవు, ఇప్పుడు ఆ అరుపులు (అంభా, మా మా) లాంటి శబ్దాలు వినిపించవు. ఒకప్పుడు వూర్లో రాజులు, బ్రామణులు, చాకలి, కంసలి అందరూ వుండే వాళ్ళు. ఒకరొకరె వూరినుంచి వెళ్ళిపోయారు. వారి తప్పు ఏమి లేదు. ఒకప్పుడు వీళ్ళకు ధనం ప్రతిఫలంగా ఇచ్చేవాల్లు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదుగా. వీళ్ళు పచ్చడికి కూడా శనకాయలు, మెరపకాయలు కూడా కొనాలి, ఇంక వాళ్ళకెక్కడ ఇస్తారు. ఊరిలొ జనాలుకూడా తగ్గారు వున్న వాళ్ళలొ మొగుడో పెళ్ళామొ ఎవరో ఒకరు ఏ కువైటో, సౌది అరేబియానో వెళ్ళారు. పెళ్ళాము వెళ్ళిన వాల్ల అవస్తలు
చూడాలి..
ఇంట్లో వంట ఛేయాలి (గొవిందు అనే అతనికి ముగ్గురు కూతుర్లు) నీళ్ళు పోయాలి, ఇంకా తినిపించాలి(ముడ్డి కడగాలి కూడా), జడలు వేయాలి, ఇల్లు అలకాలి, ముగ్గు వేయాలి (ఇది అంతా ఎందుకు చెపుతున్నా అంటే గత నెలలొ “చేయి కాల్చుకున్న రొజు” అనే బ్లాగ్ పైన చాలా పెద్ద చర్చే జరిగింది) అలా ఒకప్పుడు వూర్లో తిరుగుతూ కబుర్లు  చెప్పే గోవిందు ఇప్పుడు అన్ని  తానె చేస్తున్నాడు. ఎవరో అన్నటు ఈ సమాజం లో “ప్రతి బంధం ఆర్థిక పరమైన బంధమె”  ఎవరి పనులు ఎవరైనా చేయల్సి రావచ్హు, పరిస్థితులు అలా మారవచ్చు.
పోని అలా కువైటోటో, సౌది అరేబియానో వెళ్ళినవాళ్ళు సంతోషంగా వున్నారా అంటే అది కూడా లేదు. అక్కడ అంతా మోసాలంట. కొందరు ఒకసారి వెళ్ళివస్తే అందమైన జీవితం గడపొచ్చు అని వెళ్ళి శవాలుగా కూడా తిరిగి వస్తున్నారు. ఉరిలో వాళ్ళు కుడా అంతా ఎముకలతో తప్ప కండలతో ఎవరు లేరనే చెప్పుకోవాలి. ఈ మద్య మన దేశం లో స్థూలకాయుల  రేటు చాలా బాగ పెరుగుతున్నది అని ఈమద్య చదివాను.
ఎందుకు ఇంత మార్పు… ఈ వర్షాలు ఇంక  ఆలా కురవవా? మా చెరువు ఇంక అలా నిండదా? మా చేలు మళ్ళీ ఎప్పుడు అలా పచ్హగా పచ్చదనంతో పరుచుకుంటాయి? మళ్ళి ఎప్పుడు ఆ పశువుల అరుపులు, పక్షుల శబ్దాలు వింటాను?
లేక జ్ణాపకాల్లాగె మిగులుతాయా??????

–దిలీప్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'ఎంతగా మారి పొయింది నా పల్లె చూస్తూ చూస్తుండగానె…!' పై 4 అభిప్రాయాలు

'ఎంతగా మారి పొయింది నా పల్లె చూస్తూ చూస్తుండగానె…!'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Sudheer Kothuri అభిప్రాయం,

  తేది: October 22, 2006 సమయము: 7:43 pm

  అన్నీ ఊర్ల పరిస్థితి అలాగే ఉంది. చివరకి సెలయేటి కింద లేక బోరు పంపులున్న ఊర్లు కూడా వెల వెల బోతున్నాయి. కారణం అందరికీ ఏ సిటీ కో లేక సౌదీ కో వెళ్తే బాగా డబ్బు సంపాదించి హాయిగా బతకొచ్చనే తలంపు కలగటమే. పట్టణాల శివార్లలో ఉన్న వ్యవసాయ భూములైతే ఇప్పటికే ప్లాట్లుగా మార్చబడ్డాయి. ఇంకా ఈ పరిణామం గురించి ఎంతో చెప్పోచ్చు.
  మీ కోరిక తీరాలని ఆశిద్దాం.

 2. త్రివిక్రమ్ అభిప్రాయం,

  తేది: October 23, 2006 సమయము: 7:20 am

  పంటలు పండక ఆర్థికపరిస్థితులు అన్నిచోట్లా ఒకేలా దిగజారిపోతున్నా గల్ఫ్ దేశాలకు వలసల్లో మొదట్నుంచి కడపజిల్లాదే ప్రథమస్థానం. మా ఊళ్ళో కూడా ఇదే పరిస్థితి. చాలా కుటుంబాల్లో భార్యాభర్తల్లో ఒకరు లేక ఇద్దరూ గల్ఫ్ లోనే ఉంటున్నారు. ఇంకొక వైపు స్థూలకాయులరేటు పెరిగిపోతోందని మీరు చదివింది నిజమే. పల్లెటూళ్ళనుంచి తరలి వచ్చిన జనాలను జీర్ణించుకోలేక పట్టణాల పొట్టలుబ్బుతున్నాయి – నానారకాల తిండ్లు తిని, శారీరకశ్రమలేక అక్కడి జనాల శరీరాలూ ఉబ్బుతున్నాయి. కుటుంబాల సంఖ్య పెరగడం వల్లా, ఏటేటా ఇంట్లోని గింజలు మంట్లో పొయ్యలేకా మా ఊళ్ళో పంటపొలాలను ఇళ్ళస్థలాలుగా మార్చేశారు. ఇక “చెరువులెప్పుడు నిండుతాయి? పంటలెప్పుడు పండుతాయి? పిట్టలెప్పుడు వాలుతాయి? ఎప్పుడు ఎప్పుడు పేదప్రజల దేశాంతరవలసలు ఆగుతాయి?” ఇది అందరి ఆవేదన.

 3. venkataramana అభిప్రాయం,

  తేది: November 16, 2006 సమయము: 10:03 am

  మనమందరము సమస్యకు పరిష్కరమ కనుక్కొవలి

 4. cialis online అభిప్రాయం,

  తేది: March 3, 2007 సమయము: 10:51 am

  cialis online

  cialis online

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో