చదువుల్లో పోటీ, బాల్యం లూటీ

తేది: October 18, 2006 వర్గం: నా ఏడుపు రచన: charasala 3,416 views

చదువు, చదువు, చదువు ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. మంచిదే అందరూ చదువుకుంటే అంతకన్నా మంచేముంది. కాకపోతే అత్యాశ పనికిరాదు. అందరూ కలెక్టర్లో, డాక్టర్లో, ఇంజనీర్లో అవ్వలేరు కదా! కానీ ప్రతి తల్లిదండ్రుల ఆశా తమ పిల్లలు మాత్రం అలా ఏదో ఒకటి కావాలనే. ఒక మంచి సమాజసేవకుడుగా, సత్‌ప్రవర్తన కలవాడుగా, బాద్యతగల పౌరుడుగా తమ పిల్లలని తయారుచేయడం కంటె గూడా బాగా సంపాదన ఆర్జించగలవాడిగా, లంచాలు బాగా వచ్చే పోస్టు తెచ్చుకోగలిగే వాడిగా, అధికారం, దర్పం వుండే ఉద్యోగం చేయగల్గే వాడిగా తమ పిల్లలు తయారుకావాలని ఆశిస్తున్నారు. మంచిగా, నిజాయితీతో బతికేవాన్ని తల్లో నాలుకలేని వాడని, చేతకాని వాడని ఎద్దేవా చేస్తున్నారు. అదే లంచాలు మరిగిన కొడుకును చూసి “రెండు చేతులా ఆర్జిస్తున్నాడని” గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా సంపాదనే లక్ష్యంగా మన చదువులు వుంటున్నాయి తప్పితే, విలువల లక్ష్యంగా లేవు.
పిల్లల కిష్టమయిన చదువులు కాక భవిష్యత్తులో బాగా సంపాదించడానికి వుపయోగపడే చదువులు చదివిస్తున్నాం.
భవిష్యత్తు పేరుతో పిల్లల వర్తమానాన్ని పాడు చేస్తున్నాం. ఎంతో అమూల్యమయిన బాల్యాన్ని చదువుల పేరుతో చెరబడుతున్నాం. అసలు అయిదేళ్ళు వచ్చేవరకు బడిలో చేర్పించడాన్ని నిశేదించాలి. పాలుతాగే వయసులో పుస్తకాలు తినడం ఏంటి. ఎదురింటి, పక్కంటి పిల్లలతో పోల్చి వాళ్ళలో అసూయ, స్పర్థ బీజాలు నాటడమెందుకు?
ఏ పిల్లాడికయినా తనకంటూ కొన్ని పరిమితులు వుంటాయి. వాటిని మించి వాళ్ళను చదివి ర్యాంకులు సాధించమంటే అది చివరికి బెడిసికొట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఎదురు తిరగుతారు లేక పోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. (http://www.prajasakti.com/headlines_14.htm)
ఇంటర్ చదువుతున్న మా వదిన కూతురుని అడిగితే వారమంతా పాఠాలట, శనివారం, ఆదివారం పరీక్షలట! వారమంతా చదువే అయితే ఇక బయటి విషయాలు వాళ్ళకెలా తెలుస్తాయి. ఆటలు లేవు, పాటలు లేవు, ఓ నవల చదివేది లేదు, సాహిత్యమంటే ఏంటో తెలియదు. ఇదేనా జీవితం!
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'చదువుల్లో పోటీ, బాల్యం లూటీ' పై 4 అభిప్రాయాలు

'చదువుల్లో పోటీ, బాల్యం లూటీ'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. naveen garla అభిప్రాయం,

  తేది: October 18, 2006 సమయము: 12:37 pm

  “నా ఏడుపు” అన్నారు. మీరు మాత్రమే ఎందుకు? ఇది పిల్లలు, అసలు ఆనందం అంటే ఏమిటో రుచి చూపించని తల్లితండ్రులు చెయ్యాల్సిన పని. ఉన్న విషయాన్ని సూటిగా చాలా బాగా చెప్పారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాను. అప్పుడప్పుడూ అనుకొంటా… అనవసరంగా చదువులో లీనమైపోయి 20 సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసామా అని.. ఎందుకంటే.. ఇప్పుడు చేసే ఉద్యోగానికి నేను చదివిన చదువుకు అంత సంబంధం లేదు. ఐతే నేను చదుకోవద్దనటం లేదు. హై స్కూల్లోనే పొద్దున్నే 3 గం|| కు లేచి, సాయంకాలం రెండు మూడు ట్యూషన్లకు వెళ్ళి…….అవసరమా ?? జీవితం లో తరవాత ఎలాగు భాధ్యతలు వస్తాయి. కనీసం బాల్యం అయినా పూర్తిగా అనుభవించకుంటే ఎలా.

 2. కిష్టయ్య అభిప్రాయం,

  తేది: October 18, 2006 సమయము: 1:38 pm

  మంచి విషయాన్ని ప్రచురించారు. చిన్న పిల్లల విషయంలో నేను మీతో సమ్మతిస్తాను. కానీ పెద్ద పిల్లల విషయంలో నా అభిప్రాయం వేరే. వత్తిడి సమాజం నుంచి కూడా ఉంది కదా. జీతం ఎక్కువ ఇచ్చే కంపెనీలలో పని చెయ్యలి అనే కదా ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. మంచి ఉద్యోగం ఉన్నా కూడా, దానిని వదులుకుని విదేశాలకు పరుగులెడు తున్నారు. ఈ విధంగా చూస్తే తల్లితండ్రులదే కాదు సమాజానిది బాధ్యతే.

 3. vijaya అభిప్రాయం,

  తేది: October 19, 2006 సమయము: 6:30 am

  లేదు, పిల్లలు ఇలా చదువు పేరిట రోబోల్ల తయరు కావడానికి తల్లిదండ్రులదే భాద్యత.
  జీవిత లక్ష్యాన్ని కేవలము డబ్బుతో ముడి పెట్టడముతో వస్తోంది ఈ చిక్కంత.మొదట రాంకు తెచ్చుకోకపోతే తప్పు చేశాము అన్న భావన కలగ చేసి మార్క్ ల కోసమె చదివేలా చేస్తున్న ది పెద్దవాల్లె కదా.ఆటలు పాటలు లాంటి విషయాలలో ముందు వున్న అబ్బాయి/అమ్మయి ఒక 2-3 రాంకు లు తక్కువ తెచ్చుకొంటే మాత్రము ఏమ్అంత నస్టము?మనకి ఏది ఇస్టమో పిల్లల చేత కూడా అదే చేయిస్తాము.కాబట్టి మన ఇస్టాలను మార్చుకోవడము ముఖ్యము.

 4. Sudheer Kothuri అభిప్రాయం,

  తేది: October 20, 2006 సమయము: 6:05 pm

  బాగా చెప్పారు. అసలు పిల్లల మనసు తెలుసుకోకుండా వారి భవిష్యత్తును తల్లిదండ్రులే నిర్ణయించేస్తున్నారు. సమాజం సంస్కృతుల ప్రభావంతో, తల్లిదండ్రులు, తోటివారి ఆలోచనా సరళితో చిన్నారి మనసులుకూడా రాజీపడిపోతున్నాయి. పిల్లలు పెరిగి చివరకు వారి పిల్లల్ని కూడా తమలాగా బానిసలుగానే మారుస్తున్నారు. వ్యకి వికాసం జరగాలంటే ముందు వ్యక్తిత్వ వికాసం జరగాలి. మన వ్యక్తిత్వాలు మనమేర్పరచుకొన్న అనేక చట్రాలలో బంధీలుగా వున్నాయి- సంస్కృతి, రాజకీయం లాంటివనేకం మనం సృష్టించుకొన్నవే. అందుకే భారతీయులు Jack of all trades but king of non అన్నట్లుగా మిగిలిపోతున్నారు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో