స్టాలిన్

తేది: October 5, 2006 వర్గం: సేవ రచన: charasala 3,156 views

మొత్తానికి మా పిల్లలతో ఆడుకొనే గొప్ప క్షణాల్ని త్యాగం చేసి స్టాలిన్ చూశాను. నేను ఏ నటుడికీ అభిమానిని కాను. నాకు నచ్చిన సినిమాలో ఏ హీరో వున్నా నాకనవసరము. ఈ pay it forward పద్దతి గురించి ఈ సినిమా అనేసరికి నాకు తెలిసిన వాళ్ళు అది ఎంత చెత్తగా వుందని చెప్పినా వినకుండా వెళ్ళాను. సినిమాకు వెళ్ళడానికి నాకున్న కారణాలు రెండు.

 • అంత మంచి concept ని ఎలా మలిచాడో చూడాలనే తహ తహ
 • అంత మంచి concept తో వున్న సినిమా గనుక అలాంటి సినిమాలను ప్రోత్సహించాలనే దీక్ష.
 • మొత్తం సినిమా చూశాక క్లాస్‌ని మాస్‌ని తృప్తిపరచబోయి దేనికి కాకుండా అయ్యిందనిపించింది. అసలు ఈ pay it forward ని ముందుకు తీసుకుపోదలిస్తే త్రిష ఈ సినిమాకి అవసరమా అనిపించింది. అసలు ఎందుకూ పనికిరాని కారక్టర్ త్రిషదేనేమొ!
  చెప్పాల్సిన మాటను మూడుముక్కల్లో చెప్పేసి మిగతా అంతా పాటలు, ఫైటులు అన్నట్టు అనిపించింది.
  ఒక్క చేతులు లేని అమ్మాయి వృత్తాంతము తప్పితే మనసుల్ని మెలేయటానికి ఇంకెన్ని వుదాహరణలు చెప్పించకూడదు అనిపించింది. చెప్పగలిగింది చెప్పినా ప్రతిభావంతంగా, మనసుకు హత్తుకునే విధంగా చెప్పలేదనిపించింది.
  ఏదైతే ఏం ఒక మంచి పాఠాన్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నమయితే జరిగింది కదా. అందుకు సినిమా నిర్మాతలకూ, దర్శకులకూ, చిరంజీవికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
  ఈ సినిమా ద్వారా పదిమంది వుత్తేజితులై ముప్పై మందికి సహాయం చేసినా “it makes a difference” కదా!  

  –ప్రసాద్

  ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
  1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
  Loading ... Loading ...

  'స్టాలిన్' పై 4 అభిప్రాయాలు

  'స్టాలిన్'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.


  1. తేది: October 5, 2006 సమయము: 10:54 pm

   మొట్ట మొదట సారిగా స్టాలిన్ గురించి ఓ మంచి మాట విన్నానండీ! సంతోషం – ఎవరికైనా ఆలోచించగల (హృదయంతో) వారికి చూడమని సలహా ఇవ్వచ్చన్నమాట. (నేను థియేటర్లో సినిమా చూడనని 10 సం. క్రితం ఒట్టు పెట్టుకున్నానండీ – అందుకే చూట్టం లేదు.)

  2. సుధాకర్ అభిప్రాయం,

   తేది: October 6, 2006 సమయము: 5:05 am

   నాకయితే ఈ సినిమా చాలా నిరాశ పరిచింది. అయితే నేను పెద్దగా ఆశలు పెట్టుకోలేదనుకోండి. ఆర్ణవాన్ని మించిన అతిశయం అన్ని మాధ్యమాలలో పొంగి పొరలితే వెళ్ళా! చాలా వరకు ఈ సినిమా చిరంజీవి “ఇమేజు” ని పెంచేదే…కధ మొత్తం అలానే (బలవంతంగా అని వార్త) మలచబడింది. చిరంజీవికి నటనే మంచిది.దర్శకత్వం పనికిరాదు. :-)

  3. ప్రసాద్ అభిప్రాయం,

   తేది: October 6, 2006 సమయము: 9:04 am

   ఇది చిరంజీవి దర్శకత్వమా!! చాలా పేలవంగా వుంది.
   చాలా సన్నివేశాలు అసంబద్దంగా వున్నాయి, అయినా ఒక మంచి మాటకు ప్రాచుర్యం కల్పిస్తున్నారంటే దాన్ని ప్రోత్సహించాలి గదా అనే సినిమాకు వెళ్ళాను.

   –ప్రసాద్

  4. సుధాకర్ అభిప్రాయం,

   తేది: October 6, 2006 సమయము: 2:05 pm

   దర్శకుడు మురుగదాసేనండి…కాక పోతే అతన్ని కాస్త పక్కన పెట్టి సొంత దర్శకత్వం చేసుకున్నారంట. అతను చెన్నయి వెళ్ళి సినీ ఛాంబరు లో ఫిర్యాదు కూడా చేశాడు.

  మీ అభిప్రాయం తెలియచేయండి

  (కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


  a

  aa

  i

  ee

  u

  oo

  R

  Ru

  ~l

  ~lu

  e

  E

  ai

  o

  O

  au
  అం
  M
  అః
  @H
  అఁ
  @M

  @2

  k

  kh

  g

  gh

  ~m

  ch

  Ch

  j

  jh

  ~n

  T

  Th

  D

  Dh

  N

  t

  th

  d

  dh

  n

  p

  ph

  b

  bh

  m

  y

  r

  l

  v
   

  S

  sh

  s
     
  h

  L
  క్ష
  ksh

  ~r
   

  తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో