ఎవర్రా బేవకూఫ్ మతాన్ని కించపరిచింది?

తేది:August 9, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,892 views

ఒరే ఒవైసీ, నీకు గానీ నీకు వంతపాడుతున్న ఆ వానరమూకకుగానీ అసలు బుద్దన్నది వుందా? ఓ మహిళ మీద అదీ విదేశీ మహిళ మీద భౌతికంగా దాడికి దిగి ఆ మతపు ప్రతినిధిగానో లేక ఆ మతావలంబుల ప్రతినిధిగానో చెప్పుకునే సిగ్గులేని XXX నీకు మతి అన్నది వుందా?

“రానారె” కథ తెచ్చిన స్మృతి

తేది:August 7, 2007 వర్గం:అనుభవాలు రచన:dileep 1,887 views

ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు. ఈ కథకు కథలోని పాత్రకు నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడే కళ్లల్లో కనిపించాడు. మాకు చాలా ఆవులు వుండేవి. వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటె దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. పనికూడా బాగ హుషారుగా చేస్తాయి.

అమెరికా రాజధానీ ప్రాంతీయ తెలుగు సంఘము(theUSCats.org)తో సమావేశం

తేది:August 6, 2007 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 2,376 views

ఉపోధ్ఘాతము:
ముందనుకున్నట్లే నిన్న సాయంత్రం 4 గంటలకి చిత్తరంజన్ (theuscats chairman) గారింటికి చేరుకున్నాను. అక్కడ ఆయనతో పాటు మురళి, మయూర్ మరియు చైతన్యలు వేచివున్నారు. మంచినీళ్ళు తాగి, తేనీరు తీసుకున్నాక సమావేశం ప్రారంభించాం.

వైరం వర్ధిల్లు గాక!

తేది:August 1, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,418 views

ఈనాడు, కాంగ్రెస్‌ల మద్య ఇంచుమించు యుద్ద వాతావరణం నెలకొన్నట్లే వుంది. దాడులు, ప్రతి దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఈ వినోదం మనకు చూడటానికి బాగానూ వుంది. నాకైతే ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఆరోగ్యకరం అనిపిస్తోంది.