ఇదేం రోగం?

తేది:July 16, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 1,462 views

నేను గత ఏడాది బ్లాగు మొదలెట్టినపుడు తెలుగు బ్లాగులు క్రియాశీలకంగా వ్రాస్తూ తెలుగు బ్లాగుల గుంపులో పాల్గొనే వాళ్ళు పట్టుమని పదిమందో, ఇరబై మందో వుండే వాళ్ళు. ఆ బ్లాగులంటినీ క్రమం తప్పక చదివే వాన్ని. కూడలి వచ్చాక ప్రతి బ్లాగుకూ వెళ్ళే బెడద తప్పింది. అయితే మాటిమాటికీ కూడలిని refresh చేయడం, కొత్త పోస్టు లేకుంటే నిరాశ పడటం జరిగేది. వుంటే కళ్ళు ఆనందంతో వెలిగేవేమొ ఆ సమయంలో మా ఆవిడ చూసివుంటే చెప్పుండేది. చదివాక అదెలా వున్నా ఓ వాఖ్య తప్పక రాసేవాన్ని.

రామ రాజ్యం

తేది:July 16, 2007 వర్గం:చరిత్ర, నా ఏడుపు రచన:చరసాల 2,332 views

విజయ నగర సామ్యాజ్యంలో రత్నాలు రాశులు పోసి అమ్మారని, రాయల వారు కావ్యాలు రాసి కవులను, పండితులను ప్రోత్సహించారని…ఇలాంటివే చెబుతుంటారు ఎవరైనా ఆ రాజ్యం సుఖ శాంతులతో వర్ధిల్లిందని చెప్పటానికి. ఒక సామాన్య రైతు ఎలా బతికేవాడో, ఒక సామాన్య పనివాడి రోజువారీ జీవితమెట్లుండేదో ఎవ్వరూ ఎక్కడా చెప్పరు. యుద్దాలు, పెళ్ళిళ్ళు, కుట్రలు, సానివాడలు ఇవే కనిపిస్తాయి సాధారణంగా.

న్యూయార్క్ ప్రయాణం

తేది:July 16, 2007 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 1,752 views

ఎప్పట్నుంచో రండి రండి అంటూ ఆహ్వానిస్తున్న మితృలను కాదనలేక ఎట్టకేలకు గత వారం న్యూయార్క్ వెళ్ళాం. అసలు ఎక్కడికయినా కాస్తా దూర ప్రయాణం చేయాలంటే మా పిల్లలతో ఎలా పడాలో అని చచ్చేంత బెరకు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని శుక్రవారం సాయంత్రం భోజనం కానిచ్చి ఏడింటికి బయలు దేరాం. మా చిట్టిది ప్రణతి, చిన్నొడు ప్రధం హుషారుగానే వ్యానెక్కారు. ఆమెకు చిరుతిళ్ళు, వాడికి పిడియాస్యూర్ ఇంకా డయాపర్లు, తుండు గుడ్డలు, ఒక్కొక్కరికి మూడేసి జతలు బట్టలు వగైరా, వగైరా అన్నీ సర్దుకొని బయలుదేరాం.

తానానందకరం

తేది:July 13, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 1,543 views

అన్నీ అవకతవకలేనా తానాలో అంటే కానేకాదు. నాకు భలే నచ్చిన విశయం నందమూరి బాలక్రిష్ణ స్వచ్చమైన తెలుగు పదాల్లో వుపన్యసించడం. అలాగే తనను సన్మానించిన తర్వాత గుమ్మడి తన గొంతు బాగోలేక పోయినా అచ్చ తెలుగులో మాట్లాడటం. దగ్గుబాటి పురంధరేశ్వరి పసందైన తెలుగులో మాట్లాడటం. (చివర్లో ఆగ్లం రాదనుకుంటారనో, తెలుగు రానివాళ్ళకోసమో గానీ ఆంగ్లంలోనూ మాట్లాడారు. కానీ తెలుగులో ఆగ్లం కలపలేదు.)
జంపాల చౌదరి వాఖ్యానాలు హాస్యభరితంగా వుండి ఆహ్లాదపరిచాయి.

పురంధరేశ్వరి విశయం ఇంకోటి చెప్పాలి. మైకు తీసుకున్న వెంటనే తనకిచ్చిన సమయం 10 నిమిశాలు అని ఆమే చెప్పారు. అయినా మొదలెట్టడం భారీగా ఐతరేయ బ్రాంహ్మణంలో ఆంద్రుల ప్రసక్తి నుంచీ మొదలెట్టారు. అలా ఆంద్రుల గుట్టంతా విప్పుకుంటూ వచ్చేసరికి పది నిమిశాలు ఎప్పుడో ఖర్చయ్యాయి. ఈమె వరుస చూసి కొంపదీసి తెలుగుకు ప్రాచీన హోదా కేంద్రం తరుపున ఇక్కడ ప్రకటించదలచిందా అని నాకు అనుమానమేసింది. ఉహు. ఆమె అనర్గళంగా తన వుపన్యాస ప్రతిభను చూపుతుంటే ఇక లాభం లేదని సభా నిర్వాహకులు వచ్చి సమయం గుర్తు చేశారు. అయినా సంకోచించకుండా, “మా బావ (మరిదా?) బాబుకు గంట పైనే ఇచ్చారు, నా సోదరుడు బాలయ్యకూ గంట పైనా ఇచ్చారు మరి నేనెందులో తక్కువని పది నిమిశాలు ఇచ్చారు” అనుకున్నారో ఏమో గానీ మైకు వదల్లేదు. నాకయితే ఈమె కొంపదీసి భారత పార్లమెంటులో ప్రసంగిస్తున్నానని భ్రమపడుతోందా అనిపించింది. ఇక ఇలా కాదని సభా నిర్వాహకుడు ఆమె పక్కనే వచ్చి నిలుచునే సరికి ఇక మర్యాద కాదనుకుందేమొ మైకు మీద పట్టు సడలించి వుపన్యాసాన్ని ముగించారు.

–ప్రసాద్

నేను మోసపోయానా?-2

తేది:July 11, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 1,735 views

తానా సభల్లో భాగంగా ఏర్పాటయిన దుకాణాల్లో ఒక పుస్తక దుకాణం చూసి ఎక్కడలేని ఆనందంతో వుబ్బితబ్బిబ్బయ్యాను.
పిల్లల కొరకు మంచి రంగుల బొమ్మలతో వున్న కథల పుస్తకాలు కొన్నాను. అక్కడే కార్టూన్లతో “పిల్లల రామాయణం” CD మంచి అందమైన ముఖచిత్రం ఒకవైపు వివిధ రామాయణ ఘట్టాల చిన్న చిన్న చిత్రాలు మరో వైపు వుంటే అది తప్పక పిల్లలకు ఆసక్తికరంగా వుండి రామాయణం మీద పిల్లలకు ఆసక్తిని కలిగిస్తుందని ఆశపడ్డాను. పైగా “తెలుగులో వెలువడిన మొట్టమొదటి రామాయణ సిడి” అని తాటికాయలంత కాకపోయినా వక్కపలుకులంత అక్షరాలతో ముద్రిస్తే అది తప్పకుండా ఒక మంచి సిడి అయివుంటుందని అబ్బురపడి కొనేశాను.