నేను “The Indian Express” North Amrican Edition తెప్పిస్తాను. ఆఫీసులో కూర్చొని అన్నీ చూడటం కుదరదు కదా అందులోనూ ఇది అమెరికాలో భారతీయుల విషయాలను బాగా చూపిస్తుంది అనే వుద్దేశ్యంతో రైలులో చదువుకోవచ్చు కదా అని దీనిని రెండేళ్ళుగా తెప్పిస్తున్నా. దేసీలకే ప్రత్యేకమైన బోలెడన్ని వ్యాసాలు వుంటాయి. మొన్న తానా సమావేశాలు జరిగాక వాటిమీద తప్పక ఓ వ్యాసం లేదా వార్తా విశేషం వస్తుందని ఆశించాను. కానీ ఇప్పటికి రెండు వారాల పత్రిక వచ్చింది కానీ ఎక్కడా తానా అన్న నాలుగక్షరాలు కనపడలేదు. ఫోటోల విభాగంలో ఓ చోట క్లింటన్, బాబు ప్రసంగిస్తున్న ఫోటో ఇంకా మరికొన్ని ఫోటోలయితే వున్నాయి గానీ కనీసం ఆ సందర్బంగా ఓ చిన్న వ్యాసమైనా లేక పోవడం నన్ను భలే ఆశ్చర్యపరిచింది.
తెలుగు వాళ్ళకు సంబందించిన ఇంత పెద్ద విశేషాన్ని పట్టించుకోలేదంటే ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా లేక నార్త్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా? ఒక నార్త్ ఇండియా విశేషాలే చెప్పే పక్షమైతే దీన్ని నేనెందుకు తెప్పించాలి. దానికి ఈ సంవత్సరంతో వీడ్కోలు చెబుతున్నా. తెలుగు వాడి గురించి చెప్పని పత్రికకు తెలుగు వాడి చందా మాత్రం ఎందుకు?
–ప్రసాద్