నా బ్లాగుకు ఏడాది!
చూస్తూ చూస్తుండగానే ఓ ఏడు దొర్లి పోయింది. బ్లాగు మొదలెట్టి సంవత్సరం అయింది. అసలు మొదట బ్లాగు మొదలు పెట్టాలని అనుకోలేదు. మా పిల్లలకు తెలుగు నేర్పించాలంటే తెలుగులో ఏమైనా మంచి ఆటాపాటలు వున్నాయా అని గూగుల్ చేయడం మొదలెట్టాను. ఆ ప్రయత్నంలో చావాగారి బ్లాగు తగలడం, ఆయన బ్లాగు తీగ పట్టుకు లాగితే బ్లాగురుల గుంపు డొంక తగలడం జరిగింది. అప్పటికే మనసులో పేరుకుపోతున్న, మాయమవుతున్న రకరకాల భావనలను బ్లాగుపెట్టెలో పేరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను.










