Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » 2007 » May

తల్లుల్ని తయారుచెయ్యాలి

తేది:May 18, 2007 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 4,631 views

“తల్లుల్ని తయారుచెయ్యాలి” — అన్న ఈ అంభానాధ్ గారి మూల వ్యాసం మీరిక్కడ చదవచ్చు. ఏ విషయమైనా ఈయన కుండ బ్రద్దలు కొట్టినట్లు ఏ సంకోచమూ లేకుండా రాసేస్తారు. నాకు ఈయనలోని ఈ సుగుణాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అయిటే ఈ గుణం వల్ల ఈయనలోని కుళ్ళు, అమాయకత్వం అన్నీ బట్ట బయలు అవుతాయి. ఈ మధ్య ఈయన రాసిన “భీమవరం బిక్కుబిక్కు” అనే కథనం చదవండి. ఈయన ఏ అభూత కల్పనలో నివసిస్తున్నారో అర్థం అవుతుంది. ఇక “ముంచుకొస్తున్న ముప్పు” చదవండి. కంప్యూటర్ విజ్ఞానం, కంప్యూటరీకరణ ఎలా చెడుపు చేస్తుందో చెప్పే శాస్త్రజ్ఞుడి అవతారం ఎత్తుతారు. అలాగే రెండు రోజుల వ్యవధిలో ఈయన రాసిన పరస్పర విరుద్దమైన “తూర్పు తిమోర్ తీరంలో శాంతి సూర్యోదయం” గురించి “మిత్రస్య చక్షుషా సమీక్షా మహే” చూడండి. ఒకచోట తెలుగు వాళ్ళకి ప్రత్యేక దేశం గురించి మాట్లాడుతూనే ఇంకో చోట తెలంగాణావాదుల ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని చెడుగుడు ఆడేస్తారు. ఈయన టపాలనీ క్రమం తప్పకుండా చదివేవారినీ, ఆయనమీద గొప్ప ఆశలు పెట్టుకున్న పాఠకులనీ “గోడల్లోంచీ నడిచేవాన్ని” అని చెప్పి నిర్ఘాతపోయేట్లు చేశారు. ఇక ఇంతకు మించి అంభానాధ్ గురించి పరిచయం లేని వాళ్ళకు చేయక్కరలేదు.

ఇక వీటన్నిటికీ తలమానికం ఈయన తల్లుల దినోత్సవం రోజు రాసిన “తల్లుల్ని తయారు చెయ్యాలి”. ఇది చదివి తండ్రినైన నేనే కుతకుత వుడికిపోతే పాపం తమ సర్వస్వమూ బిడ్డలకప్పగించి వారి అభ్యున్నతిలో తన ఆనందాన్ని చూసుకునే తల్లుల మనో వేదన ఎలా వుంటుందో ఆలోచిస్తే ..మ్మ్.. ఆ బాధ ఆ తల్లులే చెప్పగలరు.

సమాన న్యాయమా?

తేది:May 17, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,241 views

రాజుకైనా, రైతుకైనా ఒక తప్పుకు ఒకే శిక్ష అని మన వాళ్ళు బల్లలు బద్దలు చేసి చెబుతూంటారు. నిజానికి ఇది ఎలాగూ అమలవదని అందరికీ తెలిసిందే అయితే అసలు ఆ రకమైన నీతిమీదే నాకు అసహ్యం. రాజైనా, రైతైనా ఒకే తప్పుకు ఒకే శిక్ష ఎలా వేస్తాం. ఇది పూర్తిగా అసంబద్దం.
పోలీసు హత్య చేసినా, కిరాయి హంతకుడు హత్య చేసినా శిక్ష ఒకటేనా?
ధనవంతుడు దొంగతనం చేసినా, బీదవాడు దొంగతనం చేసినా శిక్ష ఒకటేనా?
తండ్రే చెరిచినా, ఎదురింటివాడు చెరిచినా శిక్ష ఒకటేనా?
కంచె చేను మేసినా, ఆవు మేసినా శిక్ష ఒకటేనా?
ఎమ్మెల్యే తప్పుడు పాస్‌పోర్టూ పొందినా, మోనికా బేడి పొందినా శిక్ష ఒకటేనా?

ఛా ఎవడయ్యా ఈ భారతీయ శిక్షాస్మృతి రాసింది? వాడికెయ్యాలి శిక్ష ముందు.

–ప్రసాద్

చేతబడి

తేది:May 4, 2007 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 3,176 views

ఎంత మూర్ఖత్వం ప్రజల్లో! చేతబడి వాత బడి మరణించిన వృద్ద దంపతులు!

ఎవరైనా నా మీద చేతబడి చేయాలనుకుంటే నా గోళ్ళూ, వెంట్రుకలూ ఇంకా ఏమేమి అవసరమో అవి నా సొంత ఖర్చులతో పంపుతానని ఇందుమూలంగా తెలియజేస్తున్నానహో!
–ప్రసాద్

మన రాతా? విధి వ్రాతా?

తేది:May 3, 2007 వర్గం:వర్తమానం రచన:dileep 2,544 views

మనము అంత క్రూరులమా అనిపిస్తోంది. ఎందుకు అంటారా, లేకపోతే ఎందుకు మనలో కదలిక లేదు? ఎందుకు ఎటువంటి చర్యలూ లేవు? అధిక జనాభా ఒక కారణం కావచ్చు. అయితే మాత్రం ఇంత నిర్లక్షమా? మన దేశములో వున్నన్ని మరణాలు రోజుకు ఇక ఏ దేశంలోనూ లేవేమొ అనిపిస్తా వుంది. ఈ నిర్లక్షము ఒక ప్రభుత్వాలదే కాకుండా మన వైపు కూడా చాలా వుంది. లేకపోతే రోజుకు ఎన్ని వందలు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా కొంచము కూడా చలనము లేదు. మొన్న బి.బి సి చానల్లో చెప్పిన ప్రకారము మన దేశం లోనే అదికంగా సం.కి 90 వేల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారంట. ఇందులో మన రాష్ట్రానిది ఒకటో ర్యాంకేమొ అనిపిస్తుంది.

లేకపోతే ఎన్ని మరణాలు, ఎన్నెన్ని మరణాలు రోజుకు ?  అయ్యో!!! ఇందులో ఎంతమంది వున్న ఒక ఆసరానూ కోల్పోయి రోడ్డున పడుతున్నారో లెక్కే లేదేమొ అనిపిస్తుంది. ఇది అంతా మనము, ఈ చెత్త ప్రభువులు “వారి కర్మ వాళ్ళు అలా చచ్చారు” అని ఊరుకుంటున్నారే తప్ప మరి ఏమి పట్టదా మనకు?

దీనికి సవాలక్ష ఉదాహరణలు.

గత సంవత్సరం మురుగు కాలువలో పడి నాకు తెలిసి నలుగురు ఒక హైదరాబాదులోనె మరణించారు. అది వారి కర్మా??
ఇక బోరు గుంతల్లో పడి మన ఒక రాష్త్రంలోనె ఈపాటికి ఐదుగురుకంటె ఎక్కువే మరణించి  వుంటారు. ఇది ఎవరి కర్మ??

ఇక రోడ్డు మరణాలకు వస్తే మరీ దారుణం, ఇందులో ఎంతమంది తమకు వున్న ఒక్క దిక్కును, ఆసరాను కోల్పోయి దిక్కులేని వారిగా తయారు అవుతున్నారో లెక్కేలేదె? దీనికి అడ్డుకట్ట వేయవలసిన ప్రభుత్వాలు అలాచెయ్యకపోగా పరోక్షంగా సహకరిస్తుండటం సిగ్గుచేటు, సహకారం  ఏమిటి అంటారా? మన రోడ్ల పక్కగా చూడండి. ఆ చుట్టుపక్కల జనాలు తిరగని ప్రదేశంలో కూడా మందుషాపులు దర్షనం ఇస్తాయి. మరి ఇవి ఎవరిని వుద్దరించడానికో?

ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా పటిస్టం చేయవలిసిన డ్రైవింగ్ లైసెన్సు విధానాన్ని మరి దారుణంగా గాలికొదిలేయడం. ఆపైన దారులపై శ్రద్ద ఇక చెప్పక్కరలేదు.

ఇక్కడ ఒక ఉదహరణ. అది కడప-బెంగుళూరు దారి మీద కడప పట్టణానికి అర కిలోమీటరు కూడా వుండదు. పేరు మూలవంక బ్రిడ్జి. ఇది ఎన్ని ప్రాణాలను బలి తీసుకుందో లెక్కలేదనుకోండి. ఎప్పుడన్నా ఆ దారిన వెళ్ళండి, ఖచ్చితంగా ఒక పడిపోయిన వాహనం మరియు నెత్తుటి మరకలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఒకటి కంటె ఎక్కువా కనిపిస్తాయి. కాని ఏమి చేయలేని నిస్సహాయులు మన నాయకులు…చక్కగా రోడ్డు వేయడానికి ఏ ఆటంకాలు లేవక్కడ! ఇలాంటి రాక్షస మార్గాలెన్నో, ఎన్నెన్నో. ఇందులో బలయిన వారు కొందరు, వారిని కోల్పోయి ఇంకా బలి అవుతున్నవారు చాలామంది. ఇందులొ మావూరిలోనె కొన్ని కుటుంబాలు.

కూతురును చూడడానికని వెళ్ళి మార్గం మధ్యలో అలా వెళ్ళిపోయాడు. వీళ్ళేమొ కూతురు వద్ద వున్నాడు అనుకున్నారు. చనిపోయిన 14 రోజులకు తెలిసింది. తరువాత అతను పోయాక వారి కుటుంబంలో చాలా మార్పులొచ్చాయి. కొన్ని జీవితాలే మారిపోయాయి. ఇంకా ఇలా ఎన్ని జీవితాలు మారిపోతున్నాయొ?????

ఇంతకంటే దారుణంగా బలి అయిన ఇంకో కుటుంబం వుంది. తనకు ఒకరి తరువాత ఒకరు ముగ్గురు పెళ్ళాలు అలా చనిపోతుంటే చేసుకున్నాడు లెండి. చివరికి నాల్గవ పెళ్ళాము బతికుంది. అలాగే ఒక కొడుకు కూడా పుట్టాడు.  అల్లారు ముద్దుగా ఒంటికి మట్టి అంటకుండా పెంచాడు. ఇంక తను కూర్చొని కొడుకుపైన ఆధారపడే వయసులో వున్న ఒక్కకొడుకుని పొగొట్టుకున్నాడు. ఇక వారికి అన్నీ కష్టాలె. కూలికెల్తే గాని గడవని బతుకు. ఇంకా ఎన్నాళ్ళు వెల్తారు కూలికి?
                 
ఇందులో మన పాలకుల పాత్రే కాకుండా మనది కూడా చాలానే వుంది. మ్యాన్‌హోలు మూతలు తొలగించడం అయితేనేమి, సిగ్నల్ రెక్కలు తొలగిచడం అయితేనేమి, బోరు గుంతలు పూడ్చక పోవడం అయితేనేమి. ఇక మనవాళ్ళు రోడ్డు దాటుడు చూడాలి, అబ్బో వద్దులెండి.

మొన్న పెళ్ళి అయి కాళ్ళ పారాని ఆరకముందే మరణం! నిన్న పెళ్ళికి వెళుతూ మరణం! ఇంకా ఎన్నో!

వీటిలో రోడ్డుపైనే ఆపిన వాహనాలని గుద్ది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు  కొంచము రోడ్డు పక్కగా వదలరు. అలా వదిలారు బాగుంది, కనీసము సిగ్నల్సు వేసి వుంచచ్చు కదా అదికూడా వేయరు. ఎప్పుడు మారతారో ఏమొ!

మలేసియాలో పెద్దగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటరు. జీబ్రా క్రాసు వద్దే దాటుతారు. కాని మన వాళ్ళు ఎక్కువగా బ్రిక్ ఫీల్డ్స్ అనే ఏరియాలో వుంటారు. ఇక్కడ మాత్రము మన బుద్ది పోనిచ్చుకోలేదు. అందుకే మొన్న ఆమధ్య పొలీసులు వచ్చి అలాదాటే వాళ్ళకు ఒక్కొక్కరికి 50 మలేసియా రింగెట్లు జరిమానా వేశారు. అంటే దాదాపు 600  రుపాయలు పైనే.

– దిలీప్