నా కళ్ళముందర పుట్టింది, పోనూ పోయింది

తేది:May 31, 2007 వర్గం:చరిత్ర, వర్తమానం రచన:చరసాల 704 views

లక్కిరెడ్డి పల్లె శాసనసభా నియోజక వర్గం నాకు వూహ తెలిసాక పుట్టింది. ముందది సమితిగా వుండేది. ఆ తర్వాత తాలూకా కేంద్రంగా, నియోజక కేంద్రంగా అయ్యింది. ముందునుంచీ కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కువ సార్లు గెలిచాడనుకుంటాను. సమితి ప్రెసిడెంటుగా ఒకసారి గెలిచిన గడికోట మోహన్ రెడ్డి ఈ ఒక్కసారే శాసన సభ్యుడుగా గెలిచారు. రామసుబ్బా రెడ్డి, రామసుభ్భా రెడ్డి కొడుకు హరినాధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కొడుకు రమేశ్ రెడ్డిల యుగం వచ్చింది.

మాలల గోల దేనికి?

తేది:May 30, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 645 views

మాదిగల పోరాటం ఎందుకో తెలిసిందే. SC రిజర్వేషన్లలో అధిక భాగం మాలలే అనుభవిస్తున్నారని తమ వాటా తమకు దక్కటం లేదని వారి బాధ. నిజంగా అలా జరుగుతుంటే వాళ్ళ గోడు వినవలసిందే. ఒకవేళ జరగట్లేదని అనుకుంటే ఇప్పుడు వర్గీకరణ వల్ల పోయేదేమీ లేదు. జరుగుతూ వుంటే వర్గీకరణ ద్వారా మాదిగల వాటా మాదిగలకు ఇచ్చినట్లవుతుంది.

దీని భావమేమి తిరుమలేశా?

తేది:May 29, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 622 views

అమెరికాలో ప్రతి ఆహార సంబంధ ఉత్పత్తికీ, దాన్ని ఎప్పటి వరకూ వాడవచ్చో(expiration date) ప్రముఖంగా ముద్రిస్తారు.

కానీ ఏ భారతీయ ఉత్పత్తిని తీసుకున్నా దాని మీద ఉత్పత్తి రోజు (manufactured date) వుంటుందే కానీ expiry date వుండదు. ఎందువల్ల?

అది ఎప్పుడు తయారయ్యుంటే నాకెందుకు? ఎప్పటి వరకూ వాడుకోవచ్చో తెలియాలి గదా? ఈ కిటుకు వెనకాల ఏవైనా దురుద్దేశాలు వున్నాయా?

డేరా సఛ్ఛా సౌద్

తేది:May 24, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 513 views

అసలేమి జరుగుతోందక్కడ? ఈ గుర్మీత్ రామ్ రహీం సింగ్ గానీ, డేరా గానీ అసలు అవేంటో ఈ అల్లర్లు జరిగేదాకా తెలియదు. తీరా ఏంటని కాస్తా చరిత్ర పరికిస్తే 1978లో జరిగిన ఇలాంటి అల్లర్లే ఖలిస్తాన్ వుద్యమానికి వూపిరులూదాయని తెలిసింది. కాకుంటే ఇప్పుడు డేరా అప్పుడు నిరంకారి. ఇప్పుడు గుర్మీత్ రామ్ రహీం సింగ్ అప్పుడు బలదేవ్ సింగ్.

మన దారెటు

తేది:May 24, 2007 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 652 views

మొన్న చంద్ర మోహన్ అన్న చిత్రకళను అభ్యసిస్తున్న తెలుగు విధ్యార్థిని గుజరాత్‌లో అరెస్టు చేసి నాలుగు రోజులు జైలులో పెట్టారట! కారణం అతను ఎవర్నో కొట్టాడనో, రాగింగ్ చేసి వేధించాడనో, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేశాడనో కాదు. అతను వేసిన చిత్రాలు హిందూ చాందసవాదులకు నచ్చక పోవడం వల్ల.