బానిసత్వం నాటి నుండీ నేటి వరకు

తేది:March 28, 2007 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 2,654 views

 

పొద్దు“లో ప్రచురింపబడీన నా వ్యాసం “బానిసత్వం నాటి నుండీ నేటి వరకు” చదవండి.

–ప్రసాద్
 

ఇది మన జాతి లక్షణమా?

తేది:March 27, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 3,314 views

గత వారాంతం ఇక్కడి శివ-విష్ణు దేవాలయానికి వెళ్ళాను. చెప్పులు విడిచే ప్రదేశంలో అవి సర్దడానికి కావలిసినంత ఖాళీ జాగా వుంది. అయినా ఎక్కడ విడిచినవి అక్కడే వదిలేసి దేవుడి సమక్షంలో ముక్తిని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు.

వికలాంగులకు కేటాయించిన పార్కింగులో సాధారణ వాహనాలు ఆపడం కూడా చూశాను. అదే ఇలాంటి అతిక్రమణ ఇంకో చోట చెయ్యరు. మన భారతీయులే అత్యంత బుద్దిమంతులమన్నట్లు ప్రవర్తిస్తారు.
ఇక భోజన శాల లో చూడండి. తిన్న ప్రతి చోటా మురికి చేస్తారు. ఇది మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటం అన్న ధోరణి కనిపిస్తుంది.
ఇంకా పని చేసే చోట్ల చూడండి. ఎక్కువ మంది భారతీయులు వున్నారంటే ఇక అక్కడి మైక్రోవేవ్ ప్రతి గోడా కూరలు చిమ్మి వుంటాయి. దాన్ని శుబ్రం చేయాలన్న తలంపే వుండదు.
ఇక ఏ ఇండియన్ గ్రోసరీ కన్నా వెళ్ళండి. సాధారంగా రెస్ట్‌రూమ్ వుండదు. వుండిందా ఇక అది వుపయోగించ వీలులేనంతగా దుర్గంధభూయిష్టంగా వుంటుంది. మొన్ననే ఇక్కడ పేరు మోసిన పటేల్ బ్రదర్స్‌కి వెళ్ళాను. కొనడానికి ఎప్పుడూ లైనులో నిలబడి వుంటారు. బాగా జరుగుతుందని ఆ లైను చూస్తే చెప్పొచ్చు. కానీ రెస్ట్‌రూమ్ మాత్రం భయంకరంగా వుంది. నేనయితే వెనక్కి వచ్చేవాన్నే! నా నాలుగేళ్ళ కూతురుకు అవసరమయింది. వాడక తప్పదు… చక చకా ఓ క్లోరాక్స్ కొనుక్కొచ్చి శుభ్రం చేద్దామా అన్నంద ఆవేశం వచ్చింది.
మనం చూపించేదంతా ఇతరులకోసమేనా? నిజంగా మనకి క్రమశిక్షణ, శుభ్రత లేవా? ఇది మన జాతి లక్షణమా?

–ప్రసాద్

జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్

తేది:March 23, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 2,735 views

జోకులు ఇతరులను పీడించి వేసుకొనేవిగా వుండకూడదు. మన నవ్వు ఇంకొకడికి విషాదమవ్వకూడదు.

మనం ఎవ్వరి మీదయినా జోకు వేసే ముందు ఆ స్థానంలో మనలను వూహించుకొని చూసుకోవాలి ముందు.
గత ఆదివారం జెమినిలో “జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్” చూశా! కళ్ళు చిదంబరం కనపడగానే “నువ్వు నన్ను చూస్తున్నావా? ఆమెని చూస్తున్నావా?” — ఇది జోకు నేను నవ్వాలి. ఇంత తలతిక్క ఎందుకుంటుందో జనాలకు అర్థం కాదు.
ఆ తర్వాత ఇద్దరు బధిరులు కలిస్తే ఎలా సంబాషణ వుంటుందో చూపడం! అదీ జోకే! వైకల్యం వాళ్ళకా వైకల్యం మీద జోకులేసుకొనే మనకా?
ఇంకా హైలెట్టు ఏమిటంటే గుడ్డివాడు ఒంటరిగా వున్నప్పుడు ఏమని ఆలోచిస్తాడు (లేదా ఏదో ఇలాంటిదే) అని చూపించడం జోకు!
గుడ్డివాడి వ్యధా, బాధా ఈ గాదిద కొడుకలకు జోకు! ఇంతకంటే జోకులెయ్యడం రాకుంటే మన తెలుగు బ్లాగరులను చూసి నేర్చుకోరాదూ!

నల్లగా వున్న బాబూమోహన్ మీద లెక్క లేనన్ని జోకులు. ఆతన్ని ఎంత నీచాతినీచంగా అసహ్యంచుకుంటే మనకు అంత తృప్తి, నవ్వు! కాకిలా వున్నావనడం, బర్రెలా కుడితి తాగుతున్నావనడం, కోటతో తన్నించడం.. ఇదీ మన తెలుగు సినిమా నవ్వులాట! బాబూమోహన్ అనాకారి తనం, కళ్ళ చిదంబరం కళ్ళూ, ఎవీయస్ నత్తీ మనకు నవ్వుకొనే విశయాలు.
–ప్రసాద్

వనజ — అద్భుతమైన తెలుగు సినిమా

తేది:March 21, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 3,145 views

నేనింకా ఈ సినిమా చూడలేదు. చూడాలని వువ్విళ్ళూరుతున్నా! కిరణ్ గారి తెలుగుదనం బ్లాగులో మొదట దీని గురించి చదివి ఈ సినిమ సైటుకు వెళ్ళి వివరాలు చూశా!
Trailer చూస్తే ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమ అయ్యుంటుందనుకుంటున్నా! కానీ విచారకరమైన విశయం ఏంటంటే ఈ సినిమాను ఆంద్రదేశంలో ఆడించడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావట్లేదట!
చూశారా? మంచి సినిమాలు తీయరంటారు తీరా కనీసం స్వంత అభిరుచితో తీసిన ఇలాంటి ఆణిముత్యాలను ఎలా ఆదరిస్తున్నారో!

–ప్రసాద్
http://blog.charasala.com

తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలు

తేది:March 21, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,670 views

ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమా, వ్యతిరేకమా అనిగాకుండా నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఈ అసమ్మతి ఎమ్మేల్యేలు చేస్తున్నది అక్షరాలా అక్రమం.
గులాబీ కండువా పైన వేసుకుంటారు. లోపల కాంగ్రెసు వాదిలా ప్రవర్తిస్తారు. కారు చిహ్నంతో గెలిచారు, కెసీయార్ నాయకత్వాన్ని నమ్ముకున్నారు, ఎన్నికల్లో మీరు తెరాసవాదులనే ప్రజలు గెలిపించారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక అటు ప్రజలనూ మోసం చేసి ఇటు కేసీయార్‌ను మోసం చేసి రాజశేఖరరెడ్డి వెనకాల తిరగడం ఏ విధంగా న్యాయం.
సరే మీకు కేసీయార్ నచ్చలేదు. ఆయనకంటే మీకే ప్రత్యేక తెలంగాణా మీద ప్రత్యేక అభిమానం వుంది. మరి ఇంకా ఆ గులాబీ కండువానే ఎందుకు? దానితో గెలిచిన ఎమ్మెల్యే గిరీ ఎందుకు? రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. ఒకరిమీద ఒకరు తొడలు చరుచుకున్నందుకే ప్రజలు ఎన్నికలు భరించారు. మీరు రాజీనామా చేస్తే మాత్రం భరించలేరా? ఇలా అటూ ఇటూ గాని మద్యెరకం గాళ్ళలా ఈ వేషాలెందుకు?

–ప్రసాద్