వేరు పడటం

తేది:October 25, 2006 వర్గం:వర్తమానం రచన:charasala 4,012 views

ఇది తెగని చాంతాడు. నాది, నీది అనేవి చచ్చుబారు వాదాలు. నాది అంటే చివరికి మిగిలేది నేనే. “నా” అనే మాయపొర నుండీ బయటకు వస్తే తప్ప మనం చేసే వాదనలో అసంబద్దత అర్థం కాదు. ఒకచోట వెనుకబాటు వుంటే ఆ వెనుకబాటును సరిదిద్దటానికి పూనుకోవాలి. ఒక యాసో, మాండలికమో అవహేళనకు గురవుతూ వుంటే దాన్ని సరిదిద్దాలి. ఇది నా బాష, ఇది నా ప్రాంతము, ఇది నా దేశము ఇవన్నీ మాయా భేదాలు. ఆ మధ్య మా తమ్ముడు ఇండొనీషియాలో వాళ్ళ మిత్రులని స్థానిక తమిళులు కొట్టారని చెప్పాడు. వాళ్ళంటే వీరికి భయం కూడానట (అమెరికాలో నల్లవాళ్ళను చూసి భయపడినట్లు). అంటే ఏమిటి, ఇక్కడున్నప్పుడు వాళ్ళే మన సోదర భారతీయులు, తీరా అక్కడికెళ్ళాక వాళ్ళు స్థానిక తమిళులు!
ఈ రాయలసీమ, తెలంగాణా ఈ గీతలు ఎవడు గీశాడు. ఆ గీతకు ఆవల నిలబడితే వాడు వేరు, ఇవతల నిలబడితే వీడు వేరు. బళ్ళారి మనతో కలిసివుంటే తెలుగు వాళ్ళు, కన్నడంతో కలిశారు గనుక కన్నడిగులు, లేదా కన్నడతెలుగు వాళ్ళు.
బాబర్ రాకముందు వరకు వాళ్ళూ హిందువులే కాకపోతే మరో భారతీయ మతం వాళ్ళు. కానీ ఆ మతం పుచ్చుకున్నాక (వంటి రంగు మాత్రం మార్చు కోలేదు) మాత్రం వాళ్ళు ముస్లిములు. ప్రతి హిందూ కుటుంబమూ పెద్ద కొడుకును సిక్కుగా మార్చేదట! లేకుంటే సిక్కులు ఆకాశం నుండీ వూడి పడ్డారా? ఇప్పుడు వాడు సిక్కు, నేను హిందువు!!
ఎక్కడన్నా అంతముందా ఈ విభజనకి? ఈ భేదాలకి? ఆంద్రాతో పోలిస్తే రాయలసీమ వెనుకబడింది. సీమతో పోలిస్తే తెలంగాణ వెనుకబడింది. రంగారెడ్డితో పోలిస్తే నల్గొండ వెనుకబడింది. నల్గొండలో ఆ వూరితో పోలిస్తే X వూరు వెనుకబడ్డది. ప్రత్యేకం అయిపోవడమే మందయితే పంజాభ్ కంటె వెనుకబడ్డందుకు ఆంద్రప్రదేశ్ ఇండియా నుండీ వేరుపడాలి. ఆంద్రా కంటె వెనుకబడ్డందుకు బీహార్ వేరుపడాలి. ఇంత పెద్ద దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్దికి నోచకున్నా అందరమూ కలిసివున్నప్పుడు ఆంద్రాలో అసమానతలున్నప్పుడు మాత్రం కలిసి వుంటే తప్పేంటి?
ఇక భాష. ఒక ఇంట్లో వున్నవారే ఒకలా మాట్లాడలేరు. మా నాన్న మాట్లాడినట్లు నేను మాట్లాడలేను. నాలా మా అన్న మాట్లాడలేడు. అయినా ఒకరు మాట్లేడేది ఇంకొకరికి అర్థం అవుతూనే వుందిగా! ఎక్కడైనా వున్నట్లు అభివృద్ది చెందినవాడి మాటే వేదవాక్కు అవుతుంది. అందరూ అంగీకరించిందే ఇష్టమున్నా లేకున్నా మిగతావారూ అంగీకరించాలి. లేకుంటే అవ్యవస్థ అవుతుంది. నిజాం పరిపాలనతో తెలంగాణ తెలుగు, ఒరియా, మరాఠీ, తమిళ, కన్నడ బాషల సంకరంతో సరిహద్దు జిల్లాల భాషలూ తమతమ అసలు రంగును వెలియించుకున్నాయన్నది బహిరంగ సత్యము. నేను ప్రొద్దుటూరులో చదువుతున్నప్పుడు అక్కడి హాస్టల్లో మజ్జిగను మోర్ అంటుంటే ఇదేం భాషరా బాబూ అనుకున్నా. నాదీ కడప జిల్లానే మరి. ఇంకా ఆశ్చర్యమయిన సంగతి ఏంటంటే “తీసుకుపో” అనడానికి అక్కడ “కొండుబో” అంటున్నారు. అలాగే మాకు కేవలం 50 మైళ్ళు కూడాలేని మా బందువుల వూరిలో చిత్తూరు యాస మాట్లాడతారు. ఆ వూరిలో వున్న మా అక్క “ఏందప్పా ఎప్పొడొచ్చినావు?” అంటే నాకు ఆమెలోని ఆప్యాయత కనిపిస్తుందే కానీ బాషలోని యాస కాదు. ఒక జిల్లాలోనే ఇన్ని తేడాలుంటే ఇక దేన్ని నాదనాలి దేన్ని నీదనాలి? ఇక సముద్రజలాలకే సరిహద్దులైన క్రిష్నా జిల్లా తెలుగే మిగతా వాటి కంటే అంతో ఇంతో శుద్దైన బాష అంటే మనకు అభ్యంతరమెందుకు?
నాకు అర్థం కాని ఇంకో విషయమేమిటంటే తెలంగాణ ప్రత్యేక రాష్త్ర మయినంత మాత్రాన కోస్తా జిల్లాలవారు అక్కడికి తమ నివాసం మార్చి వాళ్ళతో పోటీపడకుండా ఆపుటెట్లు? కాశ్మీరుకు ప్రత్యేకాధికారాలున్నట్లు తెలంగాణకు ఇవ్వడం సాధ్యమయితే తప్ప అక్కడ ఇతరులు అస్తులు కొనకుండా, వుద్యోగాలు సంపాదించకుండా ఆపటం ఎలా?
–ప్రసాద్

ఆడబాప

తేది:October 25, 2006 వర్గం:నా ఏడుపు, పుస్తకాలు రచన:charasala 4,106 views

సౌమ్య గారి సమీక్షలతో ఉక్కిరి బిక్కిరయ్యి నేను కూడా అంపశయ్య నవీన్ పుస్తకాలు (http://www.avkf.org ద్వారా) తెప్పించుకొని చదివాను. తెలంగాణ మీద సర్వత్రా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లా దాని చరిత్ర చదవాలనే వుత్సాహము కూడా నాకుంది. అయితే నవీన్ నవలాత్రయం(కాల రేఖలు, చెదిరిన స్వప్నాలు, బాందవ్యాలు) అంతగా తెలంగాణా చిత్రాన్ని చిత్రించలేకపోయిందనేది నా అభిప్రాయము. ఈ నవలాత్రయములో మొదటి నవల కాలరేఖలు చదువుతూ వుంటే చాలా చోట్ల చదవకుండా పేజీలు తిప్పేద్దామనే బోర్ కొట్టింది. రచయిత తనకు గుర్తున్న బాల్యాంశాలతోనే పెద్దగా కృషి చేయకుండా వ్రాశాడనిపించింది. చెప్పిందే పదే పదే చెప్పడం చిరాకు తెప్పించింది. “ఊరు మీద ఊరు పడేయడం” ఎన్నిసార్లు వుంటుందో లెక్క లేదు. ఇంకా కాలరేఖలులో హీరో “రాజు” చిన్నపిల్లవాడు గనుక, నవల అంతా అతని దృక్కోణము నుండీ చిత్రీకరించడం వల్ల లోతైన విషయాలు చెప్పలేకపోయారు (పిల్ల వాళ్ళకు పెద్ద విషయాలు ఏమి తెలుస్తాయి). అలాగే పిల్లాడికి బస్సును చూడటం ఒక అద్భుతం, రైలు చూడటం ఇంకో అద్భుతం. కానీ ఇవన్నీ ఇప్పుడు చిరపరిచయాలయిపోయాక వాటిని గురించి ఏమి చదవాలనిపిస్తుంది? ఇక మాట్లాడితే ఎద్దులబండి సవారీ, ఇది కూడా పలుమార్లు అదేవరసలో వివరించడం. ఇంకా కొన్నిసార్లయితే నవలలో ఇంతకుముందే చర్చించిన విషయాన్ని చర్చించామన్నది గుర్తుకు లేక మళ్ళీ రాసినట్లు వుంది. రజాకార్ల ఆగడాలు, కమ్యూనిస్టు వుద్యమము, ఫ్యూడల్ కట్టుబాట్లు వీటిగురించి ఇవ్వాల్సినంత సమాచారము ఇవ్వలేదనిపిస్తుంది.
ఇక నాకు నచ్చిన విషయం ఏంటంటే నవలంతా అసలైన తెలంగాణా మాండలికంలో సాగడం. ఆ నవల చదువుతున్నన్ని రోజులూ నేను ఇంట్లో కూడా ఆ యాసలోనే మాట్లాడటం నాలుకపైకి వచ్చేసేది.
నన్ను కదిలించిన నేను కొత్తగా ఈ నవలనుంచి తెలుసుకొన్న అంశము “ఆడబాప” గురించి. అప్పుడెప్పుడొ రాజుల కాలంలో రాజకుమారితో పాటు ఆమె చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపేవారని తెలుసు. కానీ నిన్నమొన్నటి దాకా తెలంగాణలో వున్నదని తెలిసి మూగపోయాను. జోగిణి ఊరి ఆస్తి అయితే ఈమె ఇంటి ఆస్తి. ఇంటికొచ్చిన అథిధుల కోర్కెలు, ఇంటి పెద్ద కోర్కెలు (ఇల్లాలు బహిష్టు అయినప్పుడట) తీర్చాలట. ఈమెకు పుట్టిన ఆడపిల్లలు ఇంకో ఇంటికి ఆడబాపలుగా వెళ్తారట! మగవాళ్ళైతే జీవితకాలం పాలేరుగా పనిచేస్తాడట! ఎంత అన్యాయమని రాజు వాళ్ళ అత్తయ్య దగ్గర ఘోషిస్తే, ఆడబాప అలాగాక ఇంటిముత్తైదువలా వుంటుందా అంటూ తెగ ఆశ్చర్యపడిపోతుంది. ఆమె కర్మ అలావుంది, లేదా ఆమె రాత అలా వుంది అని సరిపెట్టుకుంటే, ఆచారం యొక్క బలం మామూలు విచక్షణా జ్ఞానానే హరించివేస్తుందంటే, ఈ ఆచారాలు ఎక్కడ సృష్టింపబడ్డాయో గానీ ఎంత బలంగా పాదుకొనబడ్డాయి!!
ఈ ఆడబాప గురించి బుర్రంతా తెగ బాధపడిపోతున్నప్పుడు తీవ్రంగా ఆలోచిస్తే ఈ సాంప్రదాయపు పెళ్ళిల్లు కూడా అలాంటివేనా? సాంప్రదాయపు కోరల్లో చిక్కుబడి రాజు అత్తయ్య అమాయకంగా ప్రశ్నించినట్లే పెళ్ళి చేసుకున్నాక అతనితో గాక ఇంకెవరితో సంసారము చేస్తుంది అని మనం సాప్రదాయపు పెళ్ళి ఉచ్చులో చిక్కుబడ్డ అబల గూర్చి ఆలోచిస్తున్నామా అని పిస్తుంది. లేకపోతే ఒక్కసారి పెళ్ళయిందంటే ఇక అతనే నీ మొగుడు అని కానీ లేదా ఆమే నీ పెళ్ళాం అని గానీ అనడం సంస్కారం కాదేమొ అనిపిస్తోంది. ఆడబాపగా పుట్టినందుకు నీకిక అదే జీవితం అనడానికి ఇష్టమున్నా లేకపోయినా అతడే/ఆమే నీ మొగుడు/పెళ్ళాం అనడానికి నాకట్టే తేడా కనిపించలేదు. అలాగని పశ్చిమ దేశాల్లోలాగా ఎప్పుడంటే అప్పుడు విడిపోవడం వ్యక్తి స్వేక్ష వరకూ బాగానే వుందిగానీ, అటు తల్లో ఇటు తండ్రో పిల్లలకు దక్కకుండా పోతున్న వైనం సమాజశ్రేయస్సుకు ఉపయుక్తంగా లేదు. వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా? సమాజ శ్రేయస్సా అంటే సమాజ శ్రేయస్సేనేమొ!
ఇక మిగతా రెండు నవలలు (చెదిరిన స్వప్నాలు, బాందవ్యాలు) ఫరవాలేదని పించాయి. అదికూడా కుటుంబసంబదాల కోణంలో చిత్రీకరణ బాగా వున్నా చరిత్ర కోణంలో అంత బాగాలేదనే చెప్పాలి. ఇందులో వున్న చరిత్ర సాంఘిక శాస్త్రము చదివిన ఏ హైస్కూలు కుర్రాడికయినా తెలిసిందే. అసలు చైనాకు ఇండియాకు జరిగిన యుద్దానికి ముందు దానికి దారితీసిన పరిస్థితులి ఏమిటి? లేదా పాకిస్తానుతో యుద్దాలకు దారితీసిన పరిస్థితులేమిటి ఇత్యాది వివరాలేమీ లేవు. పోనీ ఈ నవలాత్రయము తెలంగాణా చరిత్రకే పరిమతమనుకున్నా, ముల్కీ రూల్స్ చరిత్ర గానీ, వాటిని కోర్టు రద్దు చేసిన దాని వెనుక భిన్న వాదనలు గానీ ఈ నవలలు చూపించవు.
ఇక ఈయన రచనలు కూడా నిండుగా, గంబీరంగా సాగుతాయే కానీ మచ్చుకు కూడా ఒక సరదా సన్నివేశము కనపడదు. పోనీ సీరియస్ విషయమైనా గుండెలు కరిగేలా చెబుతారా అంటే అదీ కనపడదు. మాదిగ వాడలో చొరబడి ఒకరిని మానబంగము చేసి ఇంకిద్దరిని చంపి గుడిసె తగలబెట్టిన విషయాన్ని కూడా చాలా మామూలుగా చెబుతారు.
వీటికి ముందే ఈయనకు పేరు తెచ్చిన అంపశయ్య చదివాను. అది ఒక 14 గంటల విషయము కాబట్టి చాలా చిక్కగా వుందనిపించింది. గడగడా చదివేలా చేసింది. సగటు విధ్యార్థి జీవితంలో ఒకరోజు ఎలా గడుస్తుందో ఇది సరిగ్గా అలానే గడిచింది. అందువల్ల చదివే ప్రతి ఒక్కరూ దానిలో తన జీవితాన్ని చూసుకొని లీనమయిపోతారు. కాకపోతే కాలేజీ జీవితంలో అనుకునే పచ్చి శృంగార భావనలని కూడా అలాగే ముద్రించడంతో కొంత సెన్సార్‌షిప్ అవసరమేమొ అనిపించింది.
–ప్రసాద్

స్వర్గం X నరకం వుందా లెదా !!??

తేది:October 25, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:dileep 3,023 views

స్వర్గం X నరకం  వుందొ లెదొ అంటె  నెను మాత్రం గట్టిగా లెదు అని మాత్రం చెపుతాను, కాని ఎ జన్మలొ చెసుకున్న పాప కర్మలు ఆ జన్మలొనొ లెక తరువాత జన్మలొనైనా తప్పక అనుబవిస్తారని మాత్రం నమ్ముతాను. మల్లి ఇక్కాడ సందెహం మల్లి జన్మా వుందా అని? సొ మొదటిది నమ్మితె అదె ఈజమలొ పాపాలు, రెండొది నమ్మాలి, నెను నమ్ముతాను.

            ఎందుకంటె మీరు గమనిచండి ఎవరైన అలా దుర్మర్గపు పనులు చెసినవాల్లు,, చివరికి ఎ విదంగా దెబ్బతింటారొ. వారి చావు కుడా చాల నీచ మైన స్తితి లొనె వెల్తారు, దానికి కారణం పాప కర్మలె అంటను,, అలాగె ఎందరినొల్లొ కొట్టి సంపాదించి, కస్టపడి మరి కుడ బెడతారు కొందరు కాని ఎమి లాబం?  కుమరులు ఎ తాగొబొతులొ, జులయిగాల్లు గానొ తయరయి మొతం తగలెస్తారు. ఇలా చాల చెప్పుకొవచ్హు.      

 మరి తరువాత జన్మలొ ఎలాగ అంటె మనము చని పొయిన తరువాత మన శరీరం మత్రమె నసిస్తుంది. కాని అత్మ అనెది కాదు అని ఒక యొగా వీడియొ లొ చూసాను నెజమెననుకుంటా!!

       ఒ కుక్క అకలితొ తిండి కొసమొ ఎమొ అలా ఇంత్లొకెల్లిందొ లెదొ అలా పెద్ద కర్ర తొ బాదె సరికి అది అలా రక్తం కార్చుకుంతు లబొ దిబొ మంటు ఎడుచుకుంటు వెల్లింది, పాపం అది ఎమి ఈ మనుసుల్లాగా కుడ బెట్టుకొనె తెలివిలెదు గా పాపం అకిలితొ అలాచెసింది, అదె బుష్ గారి దగ్గర వుండె కుక్కలను చుడండి  ఎమి చక్కా విమానాల్లొ చకర్లు కొడుతున్నయి, అది అవి చెసుకున్న అద్రుస్టం అంటార? నెను అయెతె గతజన్మ సుక్రుతమెమొ అనుకుంటా. మరి మీరు ఎమంటారు?    

     

ఎంతగా మారి పొయింది నా పల్లె చూస్తూ చూస్తుండగానె…!

తేది:October 22, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:dileep 3,230 views

మాది ఒక చిన్న పల్లెటూరండి.. పది సంవత్సరాల్లో   చూస్తూ చూంస్తుండగానే ఎంతగా మారిపొయిదంటె అంతగా, ఏదొ అభివృద్ది తో అని పప్పులో కాలేసేరు..
పాత పేరు అగ్రహరం అండి ,, ఆ పేరు ఎందుకొ మీకు తెలిసే వుంటుంది  అనుకుంటాను? ఏమి లేదండి పూర్వం మొత్తం ఆ ఉరిలో బ్రాహ్మణులు వుండేవారు అందుకే ఆ పేరు.. ఇప్పటి(చికెన్ గున్య ,డెంగు)లాగె అప్పుడు కలరా వచ్హి మొతం ఖాళి చేసి వెళ్ళి పోయారు.. తరువాత  పక్కనే ఊరు వెలసింది, కల్పనాయునిచెరువుగా. ఈ పెరులొనే వుంది,, పూర్వం కల్పనాయుడు అనే నామధేయుయుడు ఆ చెరువు కట్టించాడు. అందుకే ఆ పేరు. పేరుకు తగ్గట్టుగానే చెరువు పక్కనే ఊరు వుంటుందడి. ఊరిలోనుంచి అడుగేస్తే చెరువే. వర్షాకాలం లో చూడాలి ఆ అందం. చాల చాల అందంగా వుంటుందండి. చెరువు నిండా నీళ్ళు … ఆ నీళ్ళ మద్యలొ అక్కడక్కడ చెట్లు.. ఆ చెట్లపైన తెల్లటి కొంగలు, నీళ్ళ పైన నల్లటి బాతుకోళ్ళు, చెరువు కోళ్ళు. ఇంకా అలా ఒంపు సొంపుల వయ్యారంగా చెరువు కట్ట, కట్ట  ఎక్కడానికి ముందే జలజలా  పారే  నీటి వంకా, అలా చెరువు గట్టు పైకి ఎక్కగానే, కట్ట పైనే ఒక పెద్ద మామిడి చెట్టు, ఆ పక్కనే తెల్లటి రంగులొ మెరిసే శివాలయం, అ పక్కనుంచి చూస్తే చెరువు కింది భాగాన పచ్చటి పైర్లు, అక్కడ పాటలు పాడుతూ నాట్లు వేయడం, కలుపు తీయటాలు కనిపిస్తాయి. అలాగే మొగలి పొదల వాసనలు పీల్చుకోవచ్హు. అలాగే కొంచం దూరంగా మూడు దిక్కులా నల్లమల కొండలు, చెరువు పై బాగాన వేరుశనగ చేలు… అబ్బో…ప్రతి ఇంట్లో ఒక ఎడ్లబండి, పది ఆవులు పది బర్రెలు, మా ఇంట్లోనె ఎక్కువగా వుండేవి మొత్తం 50 ఆవులు 20 బర్రెలు వుండేవి… ఉదయాన్నే తా ఎంత సందడిగా వుండేదో ఉర్లో! సుబ్బిగా ఈరోజు మాకు తవ్వకానికి వస్తున్నావా లేదా అని ఒకవైపు, బర్రెలను తోలండని యానాది కేక ఒకవైపు, ఆవులను తొలండని ఒక వైపు కేకలు… అలాగె బట్టల మూటతో సాకలి, మంగలి డబ్బాతో మంగలి…అరెరెరె కొంచం ఈగడ్డం గీకురా పనికెల్లాలి…అలాంటి కేకలు…పొలాల దగ్గరా కొన్ని సార్లు తిట్టు మాటలు (వాల్ల పొలాలొ ఎవరైనా కనిపించినపుడు), మళ్ళీ సాయంత్రంగా అదే కోలాహలం…సాయంత్రంగా ప్రతిఒక్కరూ ఎద్దులబండి నిండా గడ్డి వేసుకొని…ఆ బండిపైన సాయంత్రం ఆచెరువు నీళ్ళలో నుంచి వస్తూ ఆ పక్షుల కిలకిలలు చాలా బాగా వుండేది. పొంగలి కంతా పాడు బడిన అగ్రహరాన్ని అందరు వేరుశనగ కుప్పలు వేసుకోవడానికి ఉపయోగిస్తారు, అలా పూర్తిగా బిజి బిజి గా వుండేది..
 కాని ఈ పది సంవత్సరాల్లో చాల మార్పు వచ్హిందండి. ఇప్పుడు ఆ చెరువు నిండడం మానేసింది. ఆ వేరుశనగ చేలు ఇప్పుడు ఎడారుల్లాగా కనిపిస్తాయి… ఒకప్పుడు ప్రతి ఇంట్లో వేరుశనగ కుప్పలో , వడ్లకుప్పలో కనిపించేవి కాని ఇప్పుడు అవేమి కని పించవు. ఎవరింట్లోనూ ఇప్పుడు ఆ ఆవులు లేవు, బర్రెలు లేవు, ఇప్పుడు ఆ అరుపులు (అంభా, మా మా) లాంటి శబ్దాలు వినిపించవు. ఒకప్పుడు వూర్లో రాజులు, బ్రామణులు, చాకలి, కంసలి అందరూ వుండే వాళ్ళు. ఒకరొకరె వూరినుంచి వెళ్ళిపోయారు. వారి తప్పు ఏమి లేదు. ఒకప్పుడు వీళ్ళకు ధనం ప్రతిఫలంగా ఇచ్చేవాల్లు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదుగా. వీళ్ళు పచ్చడికి కూడా శనకాయలు, మెరపకాయలు కూడా కొనాలి, ఇంక వాళ్ళకెక్కడ ఇస్తారు. ఊరిలొ జనాలుకూడా తగ్గారు వున్న వాళ్ళలొ మొగుడో పెళ్ళామొ ఎవరో ఒకరు ఏ కువైటో, సౌది అరేబియానో వెళ్ళారు. పెళ్ళాము వెళ్ళిన వాల్ల అవస్తలు
చూడాలి..
ఇంట్లో వంట ఛేయాలి (గొవిందు అనే అతనికి ముగ్గురు కూతుర్లు) నీళ్ళు పోయాలి, ఇంకా తినిపించాలి(ముడ్డి కడగాలి కూడా), జడలు వేయాలి, ఇల్లు అలకాలి, ముగ్గు వేయాలి (ఇది అంతా ఎందుకు చెపుతున్నా అంటే గత నెలలొ “చేయి కాల్చుకున్న రొజు” అనే బ్లాగ్ పైన చాలా పెద్ద చర్చే జరిగింది) అలా ఒకప్పుడు వూర్లో తిరుగుతూ కబుర్లు  చెప్పే గోవిందు ఇప్పుడు అన్ని  తానె చేస్తున్నాడు. ఎవరో అన్నటు ఈ సమాజం లో “ప్రతి బంధం ఆర్థిక పరమైన బంధమె”  ఎవరి పనులు ఎవరైనా చేయల్సి రావచ్హు, పరిస్థితులు అలా మారవచ్చు.
పోని అలా కువైటోటో, సౌది అరేబియానో వెళ్ళినవాళ్ళు సంతోషంగా వున్నారా అంటే అది కూడా లేదు. అక్కడ అంతా మోసాలంట. కొందరు ఒకసారి వెళ్ళివస్తే అందమైన జీవితం గడపొచ్చు అని వెళ్ళి శవాలుగా కూడా తిరిగి వస్తున్నారు. ఉరిలో వాళ్ళు కుడా అంతా ఎముకలతో తప్ప కండలతో ఎవరు లేరనే చెప్పుకోవాలి. ఈ మద్య మన దేశం లో స్థూలకాయుల  రేటు చాలా బాగ పెరుగుతున్నది అని ఈమద్య చదివాను.
ఎందుకు ఇంత మార్పు… ఈ వర్షాలు ఇంక  ఆలా కురవవా? మా చెరువు ఇంక అలా నిండదా? మా చేలు మళ్ళీ ఎప్పుడు అలా పచ్హగా పచ్చదనంతో పరుచుకుంటాయి? మళ్ళి ఎప్పుడు ఆ పశువుల అరుపులు, పక్షుల శబ్దాలు వింటాను?
లేక జ్ణాపకాల్లాగె మిగులుతాయా??????

–దిలీప్

చదువుల్లో పోటీ, బాల్యం లూటీ

తేది:October 18, 2006 వర్గం:నా ఏడుపు రచన:charasala 3,796 views

చదువు, చదువు, చదువు ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. మంచిదే అందరూ చదువుకుంటే అంతకన్నా మంచేముంది. కాకపోతే అత్యాశ పనికిరాదు. అందరూ కలెక్టర్లో, డాక్టర్లో, ఇంజనీర్లో అవ్వలేరు కదా! కానీ ప్రతి తల్లిదండ్రుల ఆశా తమ పిల్లలు మాత్రం అలా ఏదో ఒకటి కావాలనే. ఒక మంచి సమాజసేవకుడుగా, సత్‌ప్రవర్తన కలవాడుగా, బాద్యతగల పౌరుడుగా తమ పిల్లలని తయారుచేయడం కంటె గూడా బాగా సంపాదన ఆర్జించగలవాడిగా, లంచాలు బాగా వచ్చే పోస్టు తెచ్చుకోగలిగే వాడిగా, అధికారం, దర్పం వుండే ఉద్యోగం చేయగల్గే వాడిగా తమ పిల్లలు తయారుకావాలని ఆశిస్తున్నారు. మంచిగా, నిజాయితీతో బతికేవాన్ని తల్లో నాలుకలేని వాడని, చేతకాని వాడని ఎద్దేవా చేస్తున్నారు. అదే లంచాలు మరిగిన కొడుకును చూసి “రెండు చేతులా ఆర్జిస్తున్నాడని” గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా సంపాదనే లక్ష్యంగా మన చదువులు వుంటున్నాయి తప్పితే, విలువల లక్ష్యంగా లేవు.
పిల్లల కిష్టమయిన చదువులు కాక భవిష్యత్తులో బాగా సంపాదించడానికి వుపయోగపడే చదువులు చదివిస్తున్నాం.
భవిష్యత్తు పేరుతో పిల్లల వర్తమానాన్ని పాడు చేస్తున్నాం. ఎంతో అమూల్యమయిన బాల్యాన్ని చదువుల పేరుతో చెరబడుతున్నాం. అసలు అయిదేళ్ళు వచ్చేవరకు బడిలో చేర్పించడాన్ని నిశేదించాలి. పాలుతాగే వయసులో పుస్తకాలు తినడం ఏంటి. ఎదురింటి, పక్కంటి పిల్లలతో పోల్చి వాళ్ళలో అసూయ, స్పర్థ బీజాలు నాటడమెందుకు?
ఏ పిల్లాడికయినా తనకంటూ కొన్ని పరిమితులు వుంటాయి. వాటిని మించి వాళ్ళను చదివి ర్యాంకులు సాధించమంటే అది చివరికి బెడిసికొట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఎదురు తిరగుతారు లేక పోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. (http://www.prajasakti.com/headlines_14.htm)
ఇంటర్ చదువుతున్న మా వదిన కూతురుని అడిగితే వారమంతా పాఠాలట, శనివారం, ఆదివారం పరీక్షలట! వారమంతా చదువే అయితే ఇక బయటి విషయాలు వాళ్ళకెలా తెలుస్తాయి. ఆటలు లేవు, పాటలు లేవు, ఓ నవల చదివేది లేదు, సాహిత్యమంటే ఏంటో తెలియదు. ఇదేనా జీవితం!
–ప్రసాద్