పొగ త్రాగుట హానికరం!

తేది:November 2, 2012 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 1,687 views

ఈ మధ్య ఎలాగోలా వెసులుబాటు చూసుకొని సినిమాలు చూస్తున్నాలెండి. Yupp TVలో జీ తెలుగు VODలో తెలుగు సినిమాలు అప్పుడప్పుడూ చూస్తున్నా.

నేను గమనించిన కొన్ని విపరీతాలు ఏంటంటే ఎవడైనా తెర మీద పొగతాగుతున్నా మద్యం తాగున్నా అది హానికరం అంటూ పెద్ద అక్షరాల్లో కింద పట్టీ వేయడం!

నాకైతే సినిమా చూడటం అంటే ఆ పాత్రలమద్యలోకి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి లీనమయి చూడటం. పది నిమిశాలకోసారి ప్రకటనలొచ్చి ఎలాగూ ఆ ఏకాగ్రతను భగ్నం చేస్తాయనుకోండి. అవెలాగూ తప్పనిసరి అవసరం అయిపోయాయి. అందుకే VODలో అయితే వెంటానే ముందుకు జరిపేయొచ్చు. కానీ సినిమా రసపట్టులో వుండగా కింద తాటికాయంత అక్షరాలతో “పొగత్రాగటం హానికరం”, “మద్యం తాగటం హానికరం” అని వేయడం అవసరమా? అలావేయటం నిజంగా సినిమా చూసి ప్రభావితమయ్యేవాన్ని కాకుండా ఆపుతుందా? ఇంట్లో పసిపిల్లల మధ్యే పొగతాగే తండ్రులుండగా ఇది ఏమాత్రం?
ఒకచో అది అంతో ఇంతో చూసేవాన్ని ప్రభావితున్ని కాకుండా ఆపిందే అనుకుందాం. మరయితే అలా ఎన్ని సుభోధాలు వినిపించాలి సినిమా అంతా?
“పిల్లలను కొట్టడం తప్పు”
“చంపడం నేరం”
“దొంగిలించడం నేరం”
“మోసగించడం తప్పు”
….
ఇలా సుభాషితాలన్నీ వల్లిస్తూ పోవాలి. వీటాన్నింటికీ లేని తలనొప్పి పొగకీ మద్యానికే ఎందుకో!

ఇక ప్రకటనల్లో అయితే మొన్న “దమ్ము” చూస్తూ మరో విపరీతం చూశాను.
హీరో ఏమో విపరీతమైన ఆవేశంలో వున్నాడు. అంతెత్తున ఆకాశంలోకెగిరి మరీ ప్రత్యర్థులను చంపుతున్నాడు. సరిగ్గా హీరో అలా ఆకాశంలో వున్నప్పుడు అతన్ని అక్కడే వుంచేసి “Tide” అతని చొక్కాని తెల్లగా మార్చేసి “Tide” వాడమని చెబుతుంది. థూ ఇంతకంటే దరిద్రంగా సినిమా చూడలేమేమొ! దమ్ము ఎలాగూ దరిద్రంగా వుంది గనుక సరిపోయింది.

మరో విపరీతం ఏమిటంటే ఒక సినిమాలో ఒక పాత్ర చేసిన దాన్ని మొత్తం కులానికో వర్గానికో ఆపాదించుకొని దుమారం లేపడం. సినిమా అన్నాక అందులో సమాజంలో వున్నదంతా వుంటుంది. శూద్రుడూ వుంటాడు, బ్రాహ్మణుడూ వుంటాడు. ప్రేమించడమూ వుంటుంది, వ్యభిచారమూ వుంటుంది. అవి ఆయా పాత్రలు చేసినట్టుగా భావించాలే గానీ మొత్తం వర్గానికీ ఆపాదించుకుంటే ఎలా? అయితే సినిమా తీసేవాళ్ళు భావోద్వేగాలని దృష్టిలో పెట్టూకొని విపరీతాలకు పోకుండా వుంటే మరీ మంచిది. ఇప్పుడు ఇది ముదిరిపోయింది. మమ్మల్ని హీనం చేశారు లేదా మమ్మల్ని హేళన చేశారు. ఒక వర్గంలో ఒకరిద్దరు చేసే పనులే వర్గం మొత్తానికి చెందనప్పుడు, ఒక సినిమాలో ఒక పాత్ర చేష్టలు ఒక వర్గం మొత్తానికి ఎలా చెందుతాయి!

అంతా మన ఖర్మ!

తేది:October 23, 2012 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 1,689 views

ఇది కర్మో, ఖర్మో గానీ మొత్తానికి ఇది మన జాతిని వేల ఏళ్ళ నుండి పీల్చి పిప్పి చేస్తున్నది. ఇది వినబడని రోజు వుండదంటే అతిశయోక్తి గాదేమొ!

పండితులనుండీ పామరుల దాకా ఈ కర్మ సిద్దాంతాన్ని మరో ప్రశ్నకు తావులేకుండా నమ్మేస్తున్నారు. అసలు పూర్వజన్మ అనేది వుందా, కర్మ పలితాలు ఒక జన్మనుండి మరో జన్మకి అతుక్కొనివస్తాయా అన్నదాన్ని ఎవరి కర్మకు దాన్ని వదిలేస్తే, అసలు ఈ సిద్దాంతం మన జీవితాలని ఈ జన్మలో మాత్రం నరకప్రాయం చేసేస్తోంది.

ఒకడు ఆకలితో చనిపోయాడనుకుందాం. అది చనిపోయిన వాడి కర్మే గానీ, వాడికి పట్టెడన్నం పెట్టలేని సమాజానిదిగానీ, రాజ్యానిదిగానీ తప్పేం లేదు.

ఒక వీధిలో ఒక బీదవాడు, ఒక సంపన్నుడూ వుంటే, బీదవాడి మీద జాలి అవసరమే లేదు. అది వాడి పూర్వజన్మ కర్మ ఫలితం. వాడెన్నెన్ని పాపాలు చేసుంటే ఇప్పుడిలా కష్టాలు పడతాడు? కాబట్టి అసహ్యంచుకోండి. అదే పక్కనున్న సంపన్నున్ని చూడండి. వాడి పూర్వజన్మ పుణ్యఫలమే కదా ఈ భోగభాగ్యాలు. ఇంకేం వాడిని నెత్తికెత్తుకోండి.

ఒక క్షయరోగి ఎదురొస్తే అయ్యో పాపం అనకండి. ఎన్ని పాపాలు చేస్తే ఈ జన్మకి ఈ శిక్ష అని మనసులో అనుకొని వీలయితే వాడి మొహాన వుమ్మేయండి.

ఎవరికున్న కష్టానికి వారి కర్మే కారణం. మరిక పాలకున్ని ప్రశ్నించడం మూర్ఖత్వం. రోడ్డు ప్రమాదాల్లో వేల మంది చనిపోతున్నారా, అది చనిపోయిన వారి కర్మ! వాళ్ళకి అంతే రాసిపెట్టివుంది.

ఆయిదేళ్ళలో ఓ డిల్లీ ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన పిల్లల సంఖ్య పది వేలట! బహుశా ఈ పిల్లలది భీష్ముని ముందటి సోదరులు వసువుల కథ అయ్యుంటుంది. వారికి ఏదో అలా భూమ్మీదపడి ఇలా దేవున్ని చేరుకొనే వరమేదో వుండివుంటుంది. వారి చావుకు, అల్పాయుష్షుకి ప్రభుత్వాన్నీ, సౌకర్యాల లేమిని నిందించడం ఇహలోక మాయలో చిక్కుకోవడమే! కర్మ గురించి తెలియని వారి వాదన అది.

ఇలా ఏ సమస్యకైనా, ఏ అన్యాయనికైనా, ఏ విపత్తుకైనా ఒకే సమాధానం. కర్మ! ఓహ్! కనిపెట్టినోడెవరోగానీ, సర్వరోగనివారిణి. దీన్ని విశ్వవ్యాపితం చేస్తే ప్రపంచసమస్యలన్నిటినీ చిటికెలో పరిష్కరిస్తుంది.

ఇప్పుడు ప్రజా ప్రథినిధులనిపించారు!

తేది:December 12, 2009 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,762 views

మొన్న రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ నేను మన ప్రజాస్వామ్యానికి అర్థం వెతుకుతూనే వున్నాను. మెజారిటీ ప్రజల అభీష్టం, రాజ్యాంగ విలువలు వగైరా అన్నీ కూడా నేతిబీరకాయ లోని నెయ్యి చందమని పూర్తిగా అర్థమయ్యింది. ఇక్కడ నా అయిష్టం రోశయ్య ముఖ్యమంత్రి అవ్వడం మీద కాదు, అయిన విధానం మీద. ఈ తతంగం అంతటిలోనూ ప్రజల విశ్వాసాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడెప్పుడో రాజు చనిపోయి, తనకు వారసులెవ్వరూ లేకపోతే ఆస్థాన ఏనుగు ఎవరో ఒకరి మెడలో మాల వేసి రాజును చేసేదట! అది కథేనో లేక నిజమో తెలియదు గానీ, ఇప్పుడు జరిగింది అంతకంటే భిన్నంగా లేదు. కాకపోతే ఇక్కడ ఏనుగుకి బదులు సోనియా గాంధీ ఆ పని చేశారు.

ఈ పరిణామాలు, నాయకుల బహిరంగ వాఖ్యానాలూ ఎలా వున్నాయంటే ప్రజల ప్రాపు కోసం ఎవ్వరూ ప్రాకులాడక్కర లేదు, అధినేత్రి కరణ కురిస్తే చాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకూ వెళుతోందంటే ప్రజాస్వామ్యపు మూలాన్నే కూలగొట్టేవరకు! నిజానికి తన నియోజక వర్గపు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఆ నియోజక వర్గ ప్రథినిధి మోయాలి. తన పార్టీ మెజారిటీ ప్రథినిధుల అభిప్రాయాన్ని ఆ పార్టీ అనుసరించాలి. కానీ అంతా తల్లకిందులు! చివరికి ఇప్పటి తరం ఈ తల్లకిందుల ఎవ్వారమే అసలైనదిగా భావించేటట్లు ఇది ముదిరిపోయింది.

ప్రజల అవసరాలు ఏ మంత్రికీ పట్టడం లేదు. రోశయ్య మాట మాటకీ తను ప్రజలకు బాద్యత వహిస్తున్నానే మాటే మరచిఫొయి, అమ్మ ఆజ్ఞ ఏదైయితే అది పాటిస్తా అంటూ పదే పదే వల్లె వేయడం ఏమాత్రం రుచికరంగా లేదు. ఇలా తను ఏదంటే అదే నోరెత్తకుండా వినే ఆంధ్ర ఎంపీలంటే ప్రధానికైనా, అమ్మకైనా ఎంతో ప్రేమ! వాళ్ళేం చెప్పినా చెల్లుతుందనే ధీమా జగన్ తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కోవటంతో బాగా పెరిగినట్లుంది. అందువల్లనే కేవలం ఒకటి రెండు రోజుల కంటితుడుపు కసరత్తుతో తెలంగాణాకు అనుకూల ప్రకటన చేసేశారు. మనకు ఎదురేంటి అనే బలుపు కనిపిస్తోంది ఆ ప్రకటన వెనుకాల. కాకపోతే కేసీయార్ నెల ముందునుంచే ధీక్ష గురించి చెప్పినా చెవికెక్కలేదు. దీక్ష మొదలయ్యాకా చీమకుట్టినట్లు లేదు. తీరా అతని ఆరోగ్యం బాగా క్షీణించాక, విధ్యార్థుల ఆగ్రహం పెరిగాక అప్పుడు హడావుడిగా ఇక్కడో గంటా, అక్కడో గంటా చర్చించి ఆనక నిర్ణయం చెప్పడం! ఇందులో ఎక్కడా ప్రజల మాట గురించి పల్లెత్తు మాట లేదు.

హమ్మయ్య, ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాలు చూశాక నాకు కాస్తా తృప్తిగా వుంది. నా తృప్తి సమైఖ్యాంద్ర వుద్యమం గురించి, అది బలపడటం గురించి కాదు. కనీసం ఈ ఒక్క విశయంలోనైనా తమ రాజీనామా నిర్ణయం తమ పార్టీ నాయకుణ్ణి బట్టో లేక అధిష్టానాన్ని బట్టో గాక ప్రజల నాడిని బట్టి తీసుకున్నందుకు!

ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?

తేది:September 30, 2009 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,315 views

 ఒక నల్లవాడు అమెరికా అధ్యక్షుడైనా, అకస్మాత్తుగా వైస్సార్ గల్లంతైనా చలించని నేను ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ తంతు చూస్తుంటే మాత్రం స్పందించకుండా అదే నా ఏడుపు ఏడవకుండా వుండలేకున్నాను.

నేను కాంగ్రెసు పక్షపాతినసలే కాదు. అయితే మాత్రం ఈ రాజ్యాంగభంగాన్ని సహించాల్సిందేనా? తెలుగువాడికి జరిగే అవమానాన్ని భరించాల్సిందేనా? ఎవరెన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి లేనిదే కేవలం సోనియా బొమ్మ చూసి రాష్ట్ర ఓటర్లు కాంగ్రెసును మళ్ళీ అధికారంలోకి తెచ్చారంటే నేను నమ్మను. తను ఒంటిచేత్తో అటు మూకుమ్మడిగా కట్టగట్టిన మహాకూటమిని ఇటు స్వంత పక్షంలోని అస్మదీయులనీ ఎదుర్కొని విజయం సాధించాడు. అలాగని ఆయన కొడుకు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని నేననను. ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్‌కున్న అర్హతే జగన్‌కూ వుంది. అందుకో, ఇందుకో ఎందుకో అధిక శాసనసభ్యుల మద్దతూ వుంది. అది చాలు కదా రాంజ్యాంగ నిభందనలను సంతృప్తి పరచడానికి.

మన ప్రజాస్వామ్యంలో మెజారిటీ భావన నేతిబీరకాయలో నెయ్యి లాంటిదేనని అందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెసులోనయితే మరీను. అక్కడ పైవాడి ఒక్క ఓటు ప్రజలందరి ఓటుతో సమానం. మన్మోహన్ సింగ్ ఆ ఒక్క ఓటుతోనే ప్రధాని అయ్యుండవచ్చు. రాజసేఖర రెడ్డీ అలానే అయ్యుండవచ్చు. అయితే కనీసం రాజ్యాంగ బద్దం అనిపించడానికి “మమ” అనే తంతు జరగాలిగా, మనందరికీ అది తంతేనని తెలిసినా! రాష్ట్రపతికి సోనియా మద్దతు లేఖ ఒకటే సరిపోతుందా మన్మోహన్ ప్రధాని కావడానికి? మెజారిటీ MPల మద్దతు వుందని చూపక్కరలేదా? అలానే ఎంత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నా, శంఖంలో పోసిందే తీర్థమయినట్లు మెజారిటీ ఎమ్మెల్యేలతో చెప్పిస్తేనేగదా ముఖ్యమంత్రి అయ్యేది.

 ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తే “ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు?” అన్న ప్రశ్నకి “సోనియా గాంధీ” అని విధ్యార్థులు సమాధానం రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే మన కాంగ్రెసోళ్ళు ఉపాద్యాయులైతే అదే సత్యమంటారు.

ఇంతకు ముందు అధిష్టానం నుండి ఓ దూత రహస్య సందేశం తెచ్చేవాడు. ఆ సందేశం ప్రకారం ఇక్కడ ఎమ్మెల్యేలు తమ నాయకున్ని ఎన్నుకునేవారు. ఛ ఛ అంత రహస్యం ఎందుకనుకున్నారో ఏమో గానీ ఇప్పుడదే సంప్రదాయమయిపోయింది. ముంఖ్యమంత్రి చనిపోయి నెలవుతున్నా CLP సమావేశం గానీ దాని వూసు గానీ లేకుండా రోశయ్యే CLP నాయకుడని చెప్పేవాళ్ళకి బుర్రలో గుజ్జు వుందా? లేకుంటే మనమేం చెప్పినా వినే తెగులున్నవాళ్ళే తెలుగువాళ్ళు అన్న నిశ్చయానికి డిల్లీ పెద్దలు వచ్చారా?

ఏదేమయినా ఇది కాంగ్రెసు స్వంత వ్యవహారం కాదు. రాజ్యాంగ సూత్రాలకు అవమానం. పదవిలో వుండి మరణించిన తెలుగు నాయకుడికీ, ప్రజలకూ అవమానం.

వివాహ మహోత్సవ ఆహ్వానం

తేది:August 3, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 5,227 views

శ్రేయోభిలాషులందరికీ మా తమ్ముడు దిలీప్ పెళ్ళికి బ్లాగ్ముఖ ఆహ్వానపత్రం.

పెళ్ళి పత్రిక