మనం పిల్లలకేమి నేర్పుతున్నాం?

తేది:August 17, 2007 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 4,020 views

రోజూ హత్య వార్తలు, ఆత్మ హత్య వార్తలు, అత్యాచారాలు మామూలు విశయాలయిపోయి మనసు వాటికి స్పందించడం మానేసింది. అయితే ఇవాళ్టి ఈ వార్త “మితృణ్ని చంపిన పిల్లలు” చదివితే మన భవిష్యత్ సమాజం ఎలా వుండబోతోందో అన్న భయంకర వేదన మనసును మెలిపెడుతోంది.

నార్త్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా?

తేది:July 17, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 2,859 views

నేను “The Indian Express” North Amrican Edition తెప్పిస్తాను. ఆఫీసులో కూర్చొని అన్నీ చూడటం కుదరదు కదా అందులోనూ ఇది అమెరికాలో భారతీయుల విషయాలను బాగా చూపిస్తుంది అనే వుద్దేశ్యంతో రైలులో చదువుకోవచ్చు కదా అని దీనిని రెండేళ్ళుగా తెప్పిస్తున్నా. దేసీలకే ప్రత్యేకమైన బోలెడన్ని వ్యాసాలు వుంటాయి. మొన్న తానా సమావేశాలు జరిగాక వాటిమీద తప్పక ఓ వ్యాసం లేదా వార్తా విశేషం వస్తుందని ఆశించాను. కానీ ఇప్పటికి రెండు వారాల పత్రిక వచ్చింది కానీ ఎక్కడా తానా అన్న నాలుగక్షరాలు కనపడలేదు. ఫోటోల విభాగంలో ఓ చోట క్లింటన్, బాబు ప్రసంగిస్తున్న ఫోటో ఇంకా మరికొన్ని ఫోటోలయితే వున్నాయి గానీ కనీసం ఆ సందర్బంగా ఓ చిన్న వ్యాసమైనా లేక పోవడం నన్ను భలే ఆశ్చర్యపరిచింది.
తెలుగు వాళ్ళకు సంబందించిన ఇంత పెద్ద విశేషాన్ని పట్టించుకోలేదంటే ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా లేక నార్త్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా? ఒక నార్త్ ఇండియా విశేషాలే చెప్పే పక్షమైతే దీన్ని నేనెందుకు తెప్పించాలి. దానికి ఈ సంవత్సరంతో వీడ్కోలు చెబుతున్నా. తెలుగు వాడి గురించి చెప్పని పత్రికకు తెలుగు వాడి చందా మాత్రం ఎందుకు?

–ప్రసాద్

పౌరసత్వ విధేయత

తేది:July 17, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 4,420 views

2008 లో మాకు అమెరికా పౌరసత్వం పొందడానికి మాకు అర్హత వస్తుంది. మా ఇద్దరు పిల్లలూ జన్మతః అమెరికా పౌరులే. అయితే ఏంటి అంటారా? ఇది చెప్పినంత సులభం కాదు మానసికంగా ఎంతో ఘర్షణ జరుగుతుంది. పిల్లలకు పుట్టిన చోటును బట్టి పౌరసత్వం వస్తుందేమొ గానీ వారసత్వం వస్తుందా? తల్లిదండ్రులు మరొక సంస్కృతికి వారసులైతే పిల్లలనూ అదే సంస్కృతికి వారసులుగా చేయాలనుకుంటారు.

ఇదేం రోగం?

తేది:July 16, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 2,429 views

నేను గత ఏడాది బ్లాగు మొదలెట్టినపుడు తెలుగు బ్లాగులు క్రియాశీలకంగా వ్రాస్తూ తెలుగు బ్లాగుల గుంపులో పాల్గొనే వాళ్ళు పట్టుమని పదిమందో, ఇరబై మందో వుండే వాళ్ళు. ఆ బ్లాగులంటినీ క్రమం తప్పక చదివే వాన్ని. కూడలి వచ్చాక ప్రతి బ్లాగుకూ వెళ్ళే బెడద తప్పింది. అయితే మాటిమాటికీ కూడలిని refresh చేయడం, కొత్త పోస్టు లేకుంటే నిరాశ పడటం జరిగేది. వుంటే కళ్ళు ఆనందంతో వెలిగేవేమొ ఆ సమయంలో మా ఆవిడ చూసివుంటే చెప్పుండేది. చదివాక అదెలా వున్నా ఓ వాఖ్య తప్పక రాసేవాన్ని.

రామ రాజ్యం

తేది:July 16, 2007 వర్గం:చరిత్ర, నా ఏడుపు రచన:చరసాల 3,867 views

విజయ నగర సామ్యాజ్యంలో రత్నాలు రాశులు పోసి అమ్మారని, రాయల వారు కావ్యాలు రాసి కవులను, పండితులను ప్రోత్సహించారని…ఇలాంటివే చెబుతుంటారు ఎవరైనా ఆ రాజ్యం సుఖ శాంతులతో వర్ధిల్లిందని చెప్పటానికి. ఒక సామాన్య రైతు ఎలా బతికేవాడో, ఒక సామాన్య పనివాడి రోజువారీ జీవితమెట్లుండేదో ఎవ్వరూ ఎక్కడా చెప్పరు. యుద్దాలు, పెళ్ళిళ్ళు, కుట్రలు, సానివాడలు ఇవే కనిపిస్తాయి సాధారణంగా.