రోగ వివరణ
అయ్యో! రోగం ఎవ్వరికో సరిగ్గా వివరించక పోవడం నాదే తప్పు. ఓ విషయం రాయబోయి ఇంకో విషయం చొప్పిస్తే ఇలాగే అవుతుంది. ఎవరికి రోగం అనే ప్రశ్న వస్తుందని చివరి నిమిషంలో వూహించి రోగమేంటో ముద్ద అక్షరాల్లో చెప్పాను.
ఉపోధ్ఘాతము:
ముందనుకున్నట్లే నిన్న సాయంత్రం 4 గంటలకి చిత్తరంజన్ (theuscats chairman) గారింటికి చేరుకున్నాను. అక్కడ ఆయనతో పాటు మురళి, మయూర్ మరియు చైతన్యలు వేచివున్నారు. మంచినీళ్ళు తాగి, తేనీరు తీసుకున్నాక సమావేశం ప్రారంభించాం.
అయ్యో! రోగం ఎవ్వరికో సరిగ్గా వివరించక పోవడం నాదే తప్పు. ఓ విషయం రాయబోయి ఇంకో విషయం చొప్పిస్తే ఇలాగే అవుతుంది. ఎవరికి రోగం అనే ప్రశ్న వస్తుందని చివరి నిమిషంలో వూహించి రోగమేంటో ముద్ద అక్షరాల్లో చెప్పాను.
ఎప్పట్నుంచో రండి రండి అంటూ ఆహ్వానిస్తున్న మితృలను కాదనలేక ఎట్టకేలకు గత వారం న్యూయార్క్ వెళ్ళాం. అసలు ఎక్కడికయినా కాస్తా దూర ప్రయాణం చేయాలంటే మా పిల్లలతో ఎలా పడాలో అని చచ్చేంత బెరకు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని శుక్రవారం సాయంత్రం భోజనం కానిచ్చి ఏడింటికి బయలు దేరాం. మా చిట్టిది ప్రణతి, చిన్నొడు ప్రధం హుషారుగానే వ్యానెక్కారు. ఆమెకు చిరుతిళ్ళు, వాడికి పిడియాస్యూర్ ఇంకా డయాపర్లు, తుండు గుడ్డలు, ఒక్కొక్కరికి మూడేసి జతలు బట్టలు వగైరా, వగైరా అన్నీ సర్దుకొని బయలుదేరాం.
ఈ మధ్య Akismet స్పామ్ జల్లెడ సరిగ్గా పనిచేయటం లేదు. దానికి తోడు Wordpress 2.2కు నా బ్లాగును update చేశాక నా బ్లాగుకు కొత్త వాఖ్య వచ్చిన ప్రతిసారి ఈ-మెయిల్ కూడా రావడం లేదు. దీనివల్ల అసభ్యకరమైన స్పామ్ నా బ్లాగుకు రావడం నేను కనీసం రోజుకు పదిసార్లైనా బ్లాగును చూసి స్పామ్ తొలగించడం జరిగింది గత కొన్నాళ్ళ నుండీ.
అయితే తానా సభల పుణ్యమా అని గత రెండు మూడూ రోజులు ఈ స్పామ్ నా బ్లాగులో తొంగి చూడటం అక్కడి నుంచీ అది కూడలి లాంటి Aggregatorsలలో కనపడటం… ఎంతోమందిని కలవరపరచి వుండొచ్చు.
ఇవాళే Akismet spam filterని update చేశాను. ఈ సమస్య ఇక రాదనుకుంటాను. ఇంకా మీలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఎదురయ్యి దానికి మరేదయినా పరిష్కారముంటే దయచేసి పంచుకొనగలరు.
ఈ అసౌకర్యానికి మనఃస్పూర్తిగా చింతిస్తూ మీ క్షమాపణలను కోరుకుంటున్నాను.
–ప్రసాద్
తానా సభలు ముగిశాయి. “విహారి“ని కలిశాను. విహారి ఇంకా ఇంటికి వెళ్ళాక తానా విశేషాలతో సరదా కబుర్లు చెబుతాడనుకుంటాను. ఈలోపల నా అనుభవాలు కొన్ని.